Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ind vs Pak: పాకిస్తాన్ భరతం పట్టే ప్లేయింగ్ XI ఇదే.. ప్రకటించిన సెహ్వాగ్.. ఆ కీలక ప్లేయర్‌కు మాత్రం చోటివ్వలే?

India vs Pakistan: రెండు దేశాలు ప్రపంచ కప్‌లో వన్డే, టీ20 తో సహా మొత్తం 12 సార్లు తలపడ్డాయి. ప్రతీసారి భారత జట్టు విజయం సాధించి, ఐసీసీ ఈవెంట్లలో తన సత్తా చాటింది.

Ind vs Pak: పాకిస్తాన్ భరతం పట్టే ప్లేయింగ్ XI ఇదే.. ప్రకటించిన సెహ్వాగ్.. ఆ కీలక ప్లేయర్‌కు మాత్రం చోటివ్వలే?
Virender Sehwag
Follow us
Venkata Chari

| Edited By: Anil kumar poka

Updated on: Oct 23, 2021 | 1:29 PM

T20 World Cup 2021, India vs Pakistan: టీ 20 ప్రపంచకప్‌లో అతిపెద్ద మ్యాచ్ అక్టోబర్ 24న భారత్ వర్సెస్ పాకిస్తాన్ మధ్య జరగనుంది. ఈ మ్యాచ్ పట్ల క్రికెట్ అభిమానులతోపాటు ఇరు దేశాల మాజీ ఆటగాళ్లలు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ హై ఓల్టేజ్ మ్యాచ్ కోసం భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ భారత జట్టు ప్లేయింగ్ ఎలెవన్‌ను ఎంపిక చేసి మరింత హీట్ పెంచేశారు.

ఓపెనర్లుగా వీరే.. రోహిత్-రాహుల్ ద్వయం టీమిండియా ఓపెనర్లుగా బరిలోకి దిగాలని సెహ్వాగ్ ప్రకటించాడు. అలాగే కోహ్లీపై కూడా టాప్ ఆర్డర్‌కు బాధ్యత వహించాలంటూ తెలిపాడు. ఈ మేరకు కెప్టెన్ విరాట్ కోహ్లీని తన జట్టులో 3 వ స్థానానికి ఎంపిక చేశాడు. ఇంగ్లండ్‌తో జరిగిన వార్మప్ మ్యాచ్‌లో, కోహ్లీ తాను ప్రస్తుతం టోర్నమెంట్‌లో నంబర్ త్రీలో ఆడుతానని స్పష్టం చేశాడు. అదే సమయంలో, ఓపెనింగ్‌లో రోహిత్‌తో పాటు రావడానికి రాహుల్ కంటే మెరుగైన ఎంపిక మరొకటి ఉండదని ఈ డాషింగ్ బ్యాట్స్‌మెన్ తెలిపాడు.

ఇషాన్ స్థానాన్ని సూర్య భర్తీ చేస్తాడు.. వీరూ తన జట్టులో మిడిల్ ఆర్డర్‌లో ఇషాన్ కిషన్ స్థానంలో సూర్యకుమార్ యాదవ్‌కు చోటు కల్పించాడు. ఇంగ్లండ్‌పై, ఇషాన్ 70 పరుగుల అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. కానీ, అదే మ్యాచులో సూర్య 8 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఐపీఎల్ ఫేజ్ -2 లో కూడా, సూర్యకుమార్ కొన్ని ఇన్నింగ్స్‌లు మినహా కష్టపడుతున్నట్లు కనిపించాడు. అదే సమయంలో ఫినిషర్‌గా, సెహ్వాగ్ తన జట్టులో రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యలకు చోటు కల్పించాడు.

ఇద్దరు స్పిన్నర్లు చాలు.. పాకిస్థాన్‌పై ఇద్దరు స్పిన్నర్లతో బరిలోకి దిగితే చాలంటూ సూచించాడు. దుబాయ్ మైదానంలో భారత్ వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. దుబాయ్ వికెట్ బ్యాటింగ్ స్నేహపూర్వకంగా పరిగణించారు. అయితే మిడిల్ ఓవర్లలో స్పిన్నర్లు కూడా ప్రాణాంతకంగా మారే అవకాశం ఉంది. అటువంటి పరిస్థితిలో సెహ్వాగ్ తన జట్టులో స్పిన్నర్లుగా రవీంద్ర జడేజా, వరుణ్ చక్రవర్తిని ఎంపిక చేసుకున్నాడు. ఈ ఇద్దరు ఆటగాళ్లు ఐపీఎల్ ఫేజ్ 2 లో అద్భుతంగా రాణించారు. టీమిండియా కూడా పాకిస్థాన్‌పై ఇద్దరు ఆటగాళ్ల నుంచి బలమైన ప్రదర్శనను ఆశిస్తోంది.

బలమైన పేస్ దాడితో పాక్‌ను కట్టడి చేసే అవకాశం.. శార్దూల్ ఠాకూర్, మహమ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రాను ఫాస్ట్ బౌలర్లుగా ఎంచుకున్నాడు. ఈ ఆటగాళ్లందరూ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నారు. పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా కూడా తమ ఫామ్‌ను కొనసాగించాలని కోరుకుంటున్నాడు. ఈ త్రయంతో పాకిస్తాన్ ముప్పుతిప్పలు పెట్టొచ్చని తేల్చేశాడు.

భారత్‌పై పాకిస్తాన్ ఎన్నడూ గెలవలేదు.. టీ 20 ప్రపంచకప్‌లో భారత్ వర్సెస్ పాకిస్తాన్ టీంల మధ్య మొత్తం 5 మ్యాచ్‌లు జరిగాయి. టీమిండియా అన్నింటిలోనూ గెలిచింది. మొత్తం ప్రపంచ కప్ చరిత్ర గురించి మాట్లాడితే, రెండు దేశాలు ప్రపంచ కప్‌లో వన్డే, టీ20 తో సహా మొత్తం 12 సార్లు తలపడ్డాయి. ప్రతీసారి భారత జట్టు విజయం సాధించి, ఐసీసీ ఈవెంట్లలో తన సత్తా చాటింది.

వీరేంద్ర సెహ్వాగ్ ఎంపిక చేసిన భారత జట్టు: రోహిత్ శర్మ(వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ (కెప్టెన్), సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్(కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా.

Also Read: IND vs PAK: పాకిస్తాన్‌తో మ్యాచ్ క్యాన్సిల్.. భారత్‌కు లాభమా.. న‌ష్టమా? పరిణామాలు ఎలా ఉండనున్నాయంటే..!

T20 World Cup 2021: హార్దిక్ పాండ్యా ఎఫెక్ట్.. ప్రమాదంలో ఈ ఆటగాడి ప్లేస్.. ప్లేయింగ్ XI నుంచి ఔట్?