IND vs PAK: పాకిస్తాన్‌తో మ్యాచ్ క్యాన్సిల్.. భారత్‌కు లాభమా.. న‌ష్టమా? పరిణామాలు ఎలా ఉండనున్నాయంటే..!

T20 World Cup 2021: ఉగ్రవాద సంఘటనల కారణంగా టీమిండియా పాకిస్తాన్‌తో ఆడటానికి నిరాకరిస్తే భారత్‌కు సమస్యలు పెరుగుతాయి. ఒకవేళ గ్రూపు స్టేజ్‌లో ఆడకపోయినా.. ఫైనల్లో ఆడాల్సి వస్తే ఎలా అంటూ ప్రశ్నలు ఎదురవుతున్నాయి.

IND vs PAK: పాకిస్తాన్‌తో మ్యాచ్ క్యాన్సిల్.. భారత్‌కు లాభమా.. న‌ష్టమా? పరిణామాలు ఎలా ఉండనున్నాయంటే..!
T20 World Cup 2021 India Vs Pakistan

T20 World Cup, India vs Pakistan: అక్టోబర్ 24 న టీ 20 వరల్డ్ కప్‌లో పాకిస్థాన్‌తో భారత్ తన మొదటి మ్యాచ్ ఆడనుంది. అయితే అంతకు ముందు మ్యాచ్ రద్దు చేయాలనే డిమాండ్ బలంగా వినిపిస్తోంది. జమ్మూ కాశ్మీర్‌లో కాశ్మీరీయేతరులను ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకోవడమే దీనికి కారణం. పాకిస్తాన్ మద్దతు ఉన్న ఉగ్రవాదుల వ్యూహం మార్పు కారణంగా, కాశ్మీర్‌లో తీవ్రవాద సంఘటనలు పెరిగిన సంగతి తెలిసిందే.

ఉగ్రవాదులు కాశ్మీరీయేతరులను లక్ష్యంగా చేసుకుని వారిని చంపేస్తున్నారు. అయితే, ఆర్మీ సైనికులు కూడా ఉగ్రవాదులకు తగిన సమాధానం ఇస్తున్నారు. అటువంటి పరిస్థితిలో పాకిస్తాన్ తన చేష్టల నుంచి వైదొలగే వరకు, భారత్ వర్సెస్ పాకిస్తాన్ మధ్య క్రికెట్ సంబంధాలు ఉండకూడదని, టీ20 ప్రపంచ కప్ మ్యాచ్ కూడా రద్దు చేయాలని ప్రజలు కోరుతున్నారు.

ఈ మ్యాచ్‌ని రద్దు చేయడం వల్ల ప్రపంచకప్‌లో భారత్‌కు నష్టమా? లాభమా?
ఉగ్రవాద సంఘటనల కారణంగా టీమిండియా పాకిస్తాన్‌తో ఆడటానికి నిరాకరిస్తే భారత్‌కు సమస్యలు పెరుగుతాయి. టీమిండియాకు అతిపెద్ద నష్టం ఎదురుకానుంది. మ్యాచ్ ఆడకుండానే పాకిస్థాన్ రెండు పాయింట్లు పొందుతుంది. అదే సమయంలో భారతదేశానికి ఒక్క పాయింట్ కూడా ఇవ్వరు. ఇది పాకిస్థాన్ సెమీ ఫైనల్‌కు చేరుకునే అవకాశాలను పెంచుతుంది. అదే సమయంలో, సెమీ ఫైనల్స్, ఫైనల్‌కు చేరుకోవడం భారత్‌కు కష్టంగా మారుతుంది.

ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో..
ఐసీసీ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్‌ 2021లో పాకిస్తాన్‌తో ఆడటానికి భారతదేశం నిరాకరించింది. పాకిస్తాన్ కూడా దీని గురించి అనేక సార్లు ఐసీసీకి ఫిర్యాదు చేసింది. అయితే బిసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ సిరీస్ జరగడానికి అనుమతించలేదు.

భారతదేశం వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ లేకపోతే ఈసారి ఐసీసీ దీనిని అనుమతించదు. దీనికి ప్రధాన కారణం దాని ఆర్థిక ప్రయోజనాలు. అదే సమయంలో, టీమిండియా ఆడకపోవడంపై పాకిస్థాన్ ఐసీసీకి నిరంతరం ఫిర్యాదు చేస్తోంది. అటువంటి పరిస్థితిలో టీ 20 వరల్డ్ కప్‌లో మ్యాచ్ ఆడటానికి టీమిండియా నిరాకరిస్తే, ఐసీసీ కూడా భారత జట్టుపై నిషేధం విధించవచ్చు. దీనితో పాటు, టీమిండియా కూడా భారీ జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.

ఇండియా-పాకిస్థాన్ ఫైనల్ చేరితే ఏమవుతుంది?
అక్టోబర్ 24 న జరిగే మ్యాచ్‌లో భారత జట్టు ఆడేందుకు నిరాకరిస్తే, అటువంటి పరిస్థితిలో టీమిండియాకు 2 పాయింట్లు రావు. కానీ, మిగతా అన్ని మ్యాచ్‌లలో బాగా ఆడి, ఫైనల్‌కు వెళ్లినా.. అక్కడ పాకిస్తాన్‌తో తలపడితే అవకాశం వస్తే ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అని మరికొంతమంది అడుగుతున్నారు.

సూపర్ 12 స్టేజ్‌లో ఆడలేదు కాబట్టి, ఫైనల్లో కూడా ఆడకూడదు? అప్పుడు వరల్డ్ కప్ ట్రోఫీ పాకిస్తాన్ కి చెందుతుంది. అదే సమయంలో, ఆడకుండానే పాకిస్థాన్‌ని భారతదేశం విజేతగా చేస్తుంది. దీంతో పాకిస్తాన్‌కు భారత్ ప్రయోజనం చేకూర్చినట్లే అవుతోంది.

ఈ డిమాండ్ 2019 వరల్డ్ కప్ సమయంలోనూ..
చివరిసారిగా ప్రపంచకప్ -2019 లో భారత్-పాకిస్తాన్ కలిశాయి. ఆ సమయంలో కూడా మ్యాచ్‌ను రద్దు చేయాలనే డిమాండ్లు వినిపించాయి. కానీ భారత మాజీ బ్యాట్స్‌మెన్ సచిన్ టెండూల్కర్ తనకు అది అక్కర్లేదని చెప్పాడు. అతను పాకిస్తాన్‌ను మైదానంలో ఓడించి, వారి నుంచి 2 పాయింట్లను కొల్లగొట్టాలనుకుంటున్నాడు. ఆ మ్యాచులో పాకిస్తాన్‌పై భారత్ ఘన విజయం సాధించింది.

2008 లో ముంబైలో జరిగిన ఉగ్రవాద దాడి తర్వాత, టీమిండియా పాకిస్తాన్‌లో పర్యటించలేదు. అదే సమయంలో ఈ రెండు జట్ల మధ్య చివరి సిరీస్ 2012 లో జరిగింది.

Also Read: T20 World Cup 2021: హార్దిక్ పాండ్యా ఎఫెక్ట్.. ప్రమాదంలో ఈ ఆటగాడి ప్లేస్.. ప్లేయింగ్ XI నుంచి ఔట్?

35 ఏళ్ల కివీస్ ఆటగాడు.. డేవిడ్ వార్నర్ పాలిట యముడయ్యాడు.. తొలి బంతికే స్టన్నింగ్ క్యాచ్‌తో షాకిచ్చాడు..!

Click on your DTH Provider to Add TV9 Telugu