35 ఏళ్ల కివీస్ ఆటగాడు.. డేవిడ్ వార్నర్ పాలిట యముడయ్యాడు.. తొలి బంతికే స్టన్నింగ్ క్యాచ్‌తో షాకిచ్చాడు..!
T20 World Cup 2021: ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ ప్రారంభమైన తొలి బంతికే ఈ క్యాచ్ పట్టుకుని, స్కోర్ బోర్డులో పరుగుల కంటే ముందే వికెట్ పడగొట్టాడు. ఇందుకు బలైంది ఆస్ట్రేలియా ఆటగాడు డేవిడ్ వార్నర్.
Martin Guptill: టీ 20 యువకుల ఆట అని చెబుతుంటారు. అలాగే బ్యాట్స్‌మెన్ గేమ్ అని పిలస్తుంటారు. కానీ, ఆస్ట్రేలియా వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్‌లో మాత్రం ఇలాంటిది కనిపించలేదు. ఈ మ్యాచ్ చూసిన తరువాత టీ 20 అంటే కేవలం యువత ఆట మాత్రమే కాదని, ఇక్కడ ఫిట్‌గా ఉంటే చాలు వయసుతో సంబంధం లేదని నమ్ముతారు. ఎందుకంటే 35 ఏళ్ల న్యూజిలాండ్ మార్టిన్ గప్టిల్ పట్టిన క్యాచ్ చూశాక మీ అభిప్రాయం కచ్చితంగా మారిపోతుంది. ఈ మ్యాచ్ న్యూజిలాండ్ ఖాతాలో చేరకపోయినా.. గప్టిల్ క్యాచ్‌పై చాలా చర్చలు జరిగాయి.
న్యూజిలాండ్ వార్మప్ మ్యాచ్ ఆస్ట్రేలియాకు అనుకూలంగా మారిపోయింది. అయితే అంతకు ముందు మార్టిన్ గప్తిల్ తన ఎడమ చేతితో పట్టుకున్న అద్భుతమైన క్యాచ్ గురించి కుడి చేతి ఆటగాడు చర్చించాడు. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ ప్రారంభమైన తొలి బంతికే ఈ క్యాచ్ పట్టుకుని, స్కోర్ బోర్డులో పరుగుల కంటే ముందే వికెట్ పడగొట్టాడు. ఇందుకు బలైంది ఆస్ట్రేలియా ఆటగాడు డేవిడ్ వార్నర్. అసలే ఐపీఎల్‌లో ఫాంలో లేక తంటాలు పడిన ఈ బ్యాట్స్‌మెన్.. టీ20 ప్రపంచ కప్‌లోనూ అదే ఫాలో అవుతన్నట్లు కనిపిస్తోంది.
ఆస్ట్రేలియా జట్టు 159 పరుగుల ఇన్నింగ్స్‌ని ఛేజ్ చేయడానికి బరిలోకి దిగింది. ఆరోన్ ఫించ్, డేవిడ్ వార్నర్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. టిమ్ సౌథీ న్యూజిలాండ్ బౌలింగ్ ప్రారంభించాడు. డేవిడ్ వార్నర్ మొదటి స్ట్రైక్ తీసుకున్నాడు. మొదటి బంతిని స్లిప్‌లో గాలిలోకి కొట్టాడు. అయితే రెండో స్లిప్‌లో గప్టిల్ నిల్చున్నాడు. బంతికి చాలా దూరంగానే ఉన్నా.. బంతికోసం తీవ్రంగా ప్రయత్నించాడు. ఆ ప్రయత్నం విజయవంతమైంది. ఫలితంగా అతని అద్భుతమైన క్యాచ్ నెట్టింట్లో వైరల్‌గా మారింది.
కుడి చేతి ఆటగాడి ఎడమ చేతి క్యాచ్ ఈ క్యాచ్ కూడా కఠినమైనది. ఎందుకంటే ఆయన కుడి చేతి వాటం ఆటగాడు. ఎడమ చేతితో అద్భుతంగా బాల్‌ను ఒడిసి పట్టుకున్నాడు. వార్నర్ బ్యాట్ నుంచి బయటకు వచ్చిన ఈ క్యాచ్, స్లిప్‌లో నిలబడి ఉన్న గప్టిల్ డైవింగ్ చేస్తూ పట్టుకున్నాడు.
ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ మొదట బ్యాటింగ్ చేసి 20 ఓవర్లలో 7 వికెట్లకు 158 పరుగులు చేసింది. అనంతరం డేవిడ్ వార్నర్ సున్నాకి పెవిలయన్ చేరినా.. ఆస్ట్రేలియా 159 పరుగుల లక్ష్యాన్ని 3 వికెట్ల తేడాతో గెలిచింది. ఆస్ట్రేలియా 19.5 ఓవర్లలో లక్ష్యాన్ని సాధించింది.
View this post on Instagram
ICC T20 World Cup 2021: టీ 20 ప్రపంచకప్‌లో ప్రత్యేక రికార్డులు.. తొలిమ్యాచ్ నుంచి నేటి వరకు..!