- Telugu News Photo Gallery Cricket photos T20 world cup controversies Australia player Andrew Symonds thrown out of team after alcohol related incident
T20 World Cup Controversies: రూల్స్ బ్రేక్ చేసిన ఆసీస్ ప్లేయర్.. కెరీర్‌నే ప్రమాదంలో పడేసిన ఓ సంఘటన.. అదేంటంటే?
India vs Australia: టీ 20 ప్రపంచకప్‌లో అనేక వివాదాలు కనిపించాయి. ఆండ్రూ సైమండ్స్ 2009 లో టోర్నమెంట్ ప్రారంభానికి ముందు ఆస్ట్రేలియా జట్టు నుంచి తొలగించారు.
Updated on: Oct 20, 2021 | 9:19 AM

టీ 20 ప్రపంచకప్ 2021 గెలవడానికి ఆస్ట్రేలియా జట్టు తీవ్రంగా కృషి చేస్తోంది. మొదటి వార్మప్ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ని ఓడించింది. ఇప్పుడు ఆస్ట్రేలియా జట్టు భారత జట్టుతో తలపడేందుకు సిద్ధమైంది. ఈ మ్యాచ్‌కు ముందు, ఆస్ట్రేలియా జట్టుకు సంబంధించిన ఒక వివాదాన్ని తెలుసుకుందాం.

ఆల్ రౌండర్ ఆండ్రూ సైమండ్స్ కారణంగా ఆస్ట్రేలియా జట్టు ఇబ్బంది పడింది. నిజానికి 2009 టీ 20 వరల్డ్ కప్ సమయంలో ఆండ్రూ సైమండ్స్ అలాంటి చర్య చేశాడు. ఆ తర్వాత అతడిని వెంటనే జట్టు నుంచి తొలగించారు. అదే సమయంలో ఈ ఆటగాడిని ఆస్ట్రేలియాకు తిరిగి పంపించారు.

టీ 20 ప్రపంచకప్ 2009 ఇంగ్లాండ్‌లో జరిగింది. ఆండ్రూ సైమండ్స్ ఆస్ట్రేలియా జట్టులో కీలక సభ్యుడు. జట్టు ఇంగ్లండ్‌కు వచ్చిన వారం రోజుల తర్వాత సైమండ్స్ మద్యం సేవించడం ద్వారా జట్టులోని అనేక నియమాలను ఉల్లంఘించాడు. ఆ తర్వాత అతనిపై క్రికెట్ ఆస్ట్రేలియా చర్యలు తీసుకుంది.

సైమండ్స్‌ను జట్టు నుంచి తొలగించారు. అలాగే అతని కాంట్రాక్ట్ కూడా రద్దు చేసింది. సైమండ్స్ ఆస్ట్రేలియా జట్టుకు తిరిగి రాలేదు. ఈ చర్యతో అతని అంతర్జాతీయ కెరీర్ కూడా ముగిసింది.

సైమండ్స్ ఆస్ట్రేలియా తరఫున 26 టెస్టులు, 198 వన్డేలు, 14 టీ 20 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాడు. అతని బ్యాట్ నుంచి 8 సెంచరీలు వచ్చాయి. టీ20 లో అతని బ్యాటింగ్ సగటు 48.14గా ఉంది. అదే సమయంలో, అతను వన్డేల్లో 5088 పరుగులు చేశాడు. టెస్టుల్లో సైమండ్స్ 40.61 సగటుతో 1462 పరుగులు చేశాడు.





























