AP Politics: రాష్ట్ర రాజకీయాల్లో అగ్గి రాజేసిన పట్టాభి వ్యాఖ్యలు.. చంద్రబాబుపై మంత్రి అవంతి సంచలన వ్యాఖ్యలు..!

AP Politics: రాజకీయాల్లో అగ్గి రాజుతుందంటే అది ఏపీ రాష్ట్రమేనని చెప్పాలి. ప్రతి రోజు ఏదో ఒక మూలన జరిగిగే ఘర్షణల కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా భగ్గుమంటుంది. ఇక టీడీపీ, వైసీపీ..

AP Politics: రాష్ట్ర రాజకీయాల్లో అగ్గి రాజేసిన పట్టాభి వ్యాఖ్యలు.. చంద్రబాబుపై మంత్రి అవంతి సంచలన వ్యాఖ్యలు..!
Follow us
Subhash Goud

|

Updated on: Oct 19, 2021 | 9:21 PM

AP Politics: రాజకీయాల్లో అగ్గి రాజుతుందంటే అది ఏపీ రాష్ట్రమేనని చెప్పాలి. ప్రతి రోజు ఏదో ఒక మూలన జరిగిగే ఘర్షణల కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా భగ్గుమంటుంది. ఇక టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా ఉంటుంది. తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి పట్టాభి ఇంటిపై వైఎస్‌ఆర్‌సీపీ కార్యకర్తలు దాడి నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాలు అట్టుడుకుతున్నాయి. పట్టాభి చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో అగ్గి రాజుకుంది. ఇందుకు నిరసనగా రేపు రాష్ట్ర వ్యాప్తంగా బంద్‌కు పిలుపునిచ్చింది టీడీపీ. ఈ నేపథ్యంలో మంత్రి అవంతి శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయాలు ఎంతగా దిగజారిపోతున్నాయనడానికి టీడీపీ నాయకుల తీరే నిదర్శనమని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో అశాంతి కల్పించాలని రెండున్నరేళ్లుగా చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు మనుషులు ఈ రోజు రెచ్చగొట్టే తీరులో మాట్లాడారని చంద్రబాబుపై అవంతి ధ్వజమెత్తారు.

ఎప్పుడు ఇలాంటి పరిస్థితి రాజకీయాల్లో లేవు..

ఎప్పుడు కూడా ఇలాంటి పరిస్థితి రాజకీయాల్లో లేవని, చంద్రబాబు ఇంట్లో సమస్యలు ఎక్కువయ్యాయని, ఆ సంక్షోభం దారి మళ్లించేందుకే ఇలా మాట్లాడుతున్నారని ఆరోపించారు. చంద్రబాబు కొడుకు లోకేష్‌ను నాయుకడిని చేయాలని అనుకుంటారు.. కానీ టీడీపీ నాయకులు పార్టీలో అంగీకరించడం లేదు.. చిన్న చిన్న సంఘటనలను పట్టుకుని రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు.

టీడీపీలో మూడు ముక్కలాట జరుగుతోంది..

రాష్ట్ర టీడీపీ పార్టీలో మూడు ముక్కలాట కొనసాగుతోందని, నారా లోకేష్ నాయకత్వంను పార్టీలో అంగీకరించడం లేదని అన్నారు. జూనియర్‌ ఎన్టీఆర్‌ను తీసుకుని రావాలని, పవన్ కల్యాణ్‌ను ఆహ్వానించాలని డిమాండ్ పార్టీలో ఎక్కువైందని అన్నారు. ఇక వయసు అయిపోతున్నందున కొడుకును ముఖ్యమంత్రిని చేయలేకపోతున్నానే అసహనంతో చంద్రబాబు రాజకీయాలను భ్రష్టుపట్టించడానికి సిద్ధం అయ్యారని ఆరోపించారు. సంక్షోభం నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికే రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతున్నారని అవంతి ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎంగా సుదీర్ఘ కాలం పని చేసిన అనుభవం ఉన్న చంద్రబాబు ఇప్పుడు చేస్తున్న రాజకీయాలు మంచిది కాదని, అది గుర్తించుకోవాలని అన్నారు.

ఇవీ కూడా చదవండి:

AP Politics: రెచ్చగొట్టె వ్యాఖ్యలు చేసిన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు: డీజీపీ కార్యాలయం

AP Bandh: ఏపీలో భగ్గుమన్న రాజకీయాలు.. రేపు రాష్ట్ర వ్యాప్తంగా బంద్‌కు పిలుపునిచ్చిన టీడీపీ

TDP vs YCP: ప్లాన్‌తో దాడులు చేస్తున్నారు.. కేంద్ర బలగాలను పంపండి.. హోంమంత్రి అమిత్‌షాకు చంద్రబాబు విజ్ఞప్తి..