Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP Politics: రెచ్చగొట్టె వ్యాఖ్యలు చేసిన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు: డీజీపీ కార్యాలయం

AP Politics: ఏపీలో రాజకీయాలు అట్టుడుకుతున్నాయి. టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి పట్టాభి చేసిన వ్యాఖ్యలతో..

AP Politics: రెచ్చగొట్టె వ్యాఖ్యలు చేసిన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు: డీజీపీ కార్యాలయం
Follow us
Subhash Goud

|

Updated on: Oct 19, 2021 | 8:48 PM

AP Politics: ఏపీలో రాజకీయాలు అట్టుడుకుతున్నాయి. టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి పట్టాభి చేసిన వ్యాఖ్యలతో రాష్ట్రంలో అగ్గిరాజుకుంది. పట్టాభి ఇంటిపై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలు దాడికి దిగారు. పట్టాభి ఇంటిపైనే కాకుండా కేంద్ర రాష్ట్ర టీడీపీ కార్యాలయాలపై కూడా దాడులు జరిగాయి. ఫర్నిచర్‌ మొత్తం ధ్వంసం అయ్యింది. ఈ దాడికి నిరసనగా బుధవారం (రేపు) రాష్ట్ర వ్యాప్తంగా బంద్‌కు పిలుపునిచ్చింది టీడీపీ. ఈ నేపథ్యంలో పోలీసు బలగాలు రంగంలోకి దిగాయి. ఇరు వర్గాలు సంయమనం పాటించాలని, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసుకోవద్దని డీజీపీ కార్యాలయం సూచించింది.

రెచ్చగొట్టే వ్యాఖ్యల పట్ల ప్రజలు ఆవేశాలకు గురికావద్దు.. సంయనం పాటించండి అంటూ తెలిపింది. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ హెచ్చరించారు. చట్టాన్ని ఎవరు తమ చేతిలోకి తీసుకోవద్దు, అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు ఉంటాయని తెలిపింది. దాడులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాయని డీజీపీ కార్యాలయం హెచ్చరించింది. రాష్ట్ర వ్యాప్తంగా అదనపు బలగాలను మోహరించినట్లు తెలిపింది. ప్రజలందరూ శాంతిభద్రతల పరిరక్షణలో సంయనం పాటిస్తూ సహకరించాలని కోరింది.

ఇక ఈ దాడిపై చంద్రబాబు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. సీఎం, డీజీపీ కలిసి టీడీపీ కార్యాలయాలపై, నాయకుల ఇళ్లపై దాడి చేయించారని ఆరోపించారు. తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి ఘటనలను ఇప్పటివరకు చూడలేదంటూ చంద్రబాబు ఆవేదన వ్యక్తంచేశారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని చంద్రబాబు కోరారు. రేపటి టీడీపీ బంద్‌కు ప్రజలు సహకరించాలని చంద్రబాబు కోరారు. ఏదీ ఏమైనా.. వైసీపీ, టీడీపీ ఘర్షణతో రాష్ట్ర రాజకీయాలు భగ్గుమంటున్నాయి.

ఇవీ కూడా చదవండి:

AP Bandh: ఏపీలో భగ్గుమన్న రాజకీయాలు.. రేపు రాష్ట్ర వ్యాప్తంగా బంద్‌కు పిలుపునిచ్చిన టీడీపీ

Chandrababu Naidu: రాజకీయ జీవితంలో ఇలాంటి ఘటనలు చూడలేదు.. సీఎం, డీజీపీ కలిసి దాడి చేయించారు.. చంద్రబాబు ఫైర్..