Chandrababu Naidu: రాజకీయ జీవితంలో ఇలాంటి ఘటనలు చూడలేదు.. సీఎం, డీజీపీ కలిసి దాడి చేయించారు.. చంద్రబాబు ఫైర్..

YSRCP vs TDP: సీఎం, డీజీపీ కలిసి టీడీపీ కార్యాలయాలపై, నాయకుల ఇళ్లపై దాడి చేయించారని తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ఆగ్రహం

Chandrababu Naidu: రాజకీయ జీవితంలో ఇలాంటి ఘటనలు చూడలేదు.. సీఎం, డీజీపీ కలిసి దాడి చేయించారు.. చంద్రబాబు ఫైర్..
Chandrababu Naidu
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Oct 19, 2021 | 8:37 PM

YSRCP vs TDP: సీఎం, డీజీపీ కలిసి టీడీపీ కార్యాలయాలపై, నాయకుల ఇళ్లపై దాడి చేయించారని తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తంచేశారు. తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి ఘటనలను ఇప్పటివరకు చూడలేదంటూ చంద్రబాబు ఆవేదన వ్యక్తంచేశారు. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి దారుణమని చంద్రబాబు పేర్కొన్నారు. ప్రతిపక్షంగా మాట్లాడితే స్టేట్ స్పాన్సర్ట్ టెర్రరిజంతో పోలుస్తూ అణిచివేస్తున్నారంటూ చంద్రబాబు పేర్కొన్నారు. లా అండ్ ఆర్డర్ పూర్తిగా విఫలమైందంటూ చంద్రబాబు పేర్కొన్నారు. దేవాలయం లాంటి టీడీపీ కార్యాలయంపై దాడి అప్రజాస్వామ్యమన్నారు. ఇది పులివెందుల రాజకీయం కాదని.. ఏపీ రాజకీయం అంటూ చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఏపీలో శాంతి భద్రతలు పూర్తిగా దిగజారాయంటూ చంద్రబాబు ఆవేదన వ్యక్తంచేశారు. దీనిపై డీజీపీకి ఫోన్ చేసినా స్పందించలేదని చంద్రబాబు పేర్కొన్నారు. దాడులు చేసి చంపేసే ప్రయత్నం చేస్తున్నారని.. ఇది చాలా దారుణమని పేర్కొన్నారు. డ్రగ్ మాఫియాకు ఏపీ కేంద్రంగా మారిందని చంద్రబాబు పేర్కొన్నారు. కొంతమంది వల్ల పోలీసు వ్యవస్థ బ్రష్టుపట్టి పోయిందని చంద్రబాబు పేర్కొన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని చంద్రబాబు కోరారు. రేపటి టీడీపీ బంద్‌కు ప్రజలు సహకరించాలని చంద్రబాబు కోరారు.

రాష్ట్రంలో ఆర్టికల్ 356 అమలు చేసే స్థితికి తీసుకొచ్చారంటూ చంద్రబాబు పేర్కొన్నారు. రాష్ట్రంలో పరిస్థితి చూస్తుంటే.. రాష్ట్రపతి పాలన పెడితే బాగుంటుందని అనిపిస్తోందని చంద్రబాబు పేర్కొన్నారు. ఇలాంటి రౌడీలను జీవితంలో చాలామందిని చూశానంటూ.. ఇది శ్రేయస్కారం కాదంటూ చంద్రబాబు తెలిపారు. ఇది తన కోసం చేసే పోరాటం కాదని.. ప్రజాస్వామ్యం కోసం చేసే పోరాటమని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. టీడీపీ బంద్‌కు ప్రజాస్వామిక వాదులు, పార్టీలు మద్దతునివ్వాలని చంద్రబాబు కోరారు. ఈ పోరాటంలో ప్రాణాలు పోయినా భయపడనంటూ చంద్రబాబు పేర్కొన్నారు. ఏపీలో ప్రజాస్వామ్యంపై దాడి జరిగిందని.. భవిష్యత్తు కోసం బంద్‌కు మద్దతునివ్వాలని చంద్రబాబు కోరారు.

Also Read:

AP Bandh: ఏపీలో భగ్గుమన్న రాజకీయాలు.. రేపు రాష్ట్ర వ్యాప్తంగా బంద్‌కు పిలుపునిచ్చిన టీడీపీ

TDP vs YCP: ప్లాన్‌తో దాడులు చేస్తున్నారు.. కేంద్ర బలగాలను పంపండి.. హోంమంత్రి అమిత్‌షాకు చంద్రబాబు విజ్ఞప్తి..