ప్రతిపక్ష పార్టీల కార్యాలయాల పై దాడులా? ఇదెక్కడి అన్యాయం : మాజీ మంత్రి ‘గంటా’
Ganta Srinivasa Rao Comments: ఏపీ వ్యాప్తంగా టీడీపీ కార్యాలయాలపై జరిగిన దాడులను మాజీమంత్రి గంటా శ్రీనివాసరావు తీవ్రంగా ఖండించారు. ప్రతిపక్ష పార్టీల
Ganta Srinivasa Rao Comments: ఏపీ వ్యాప్తంగా టీడీపీ కార్యాలయాలపై జరిగిన దాడులను మాజీమంత్రి గంటా శ్రీనివాసరావు తీవ్రంగా ఖండించారు. ప్రతిపక్ష పార్టీల కార్యాలయాల పై దాడులా? ఇదెక్కడి అన్యాయమని ప్రశ్నించారు. ఇప్పటికైనా సీఎం జగన్ జోక్యం చేసుకొని ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. ప్రజా సమస్యలపై దృష్టి మరల్చడానికే వైసీపీ నేతలు ఇలా చేస్తున్నారని జనం అనుకుంటారన్నారు.
రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడాల్సిన మీరే శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఎవరికి చెప్పాలని గంట ముఖ్యమంత్రికి సూటి ప్రశ్న వేశారు. ఆ మాత్రం కనీస విఘ్నత టీడీపీ కార్యాలయాల మీద దాడి చేయమని సలహా ఇచ్చిన వారికి లేదా అని ఆగ్రహించారు. నిజంగా మీరు డ్రగ్స్ వ్యాపారాలు చేయకపోతే, గంజాయి స్మగ్లింగ్ నిర్మూలనకు పాటుపడితే ప్రతిపక్ష నేతల విమర్శలను ఖండించండని అన్నారు.
ఇదిలా ఉంటే.. ఈ ఘటనపై తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తంచేశారు. సీఎం, డీజీపీ కలిసి టీడీపీ కార్యాలయాలపై, నాయకుల ఇళ్లపై దాడి చేయించారని ఆరోపించారు. తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి ఘటనలను ఇప్పటివరకు చూడలేదంటూ చంద్రబాబు ఆవేదన వ్యక్తంచేశారు. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి దారుణమని చంద్రబాబు పేర్కొన్నారు. ప్రతిపక్షంగా మాట్లాడితే స్టేట్ స్పాన్సర్ట్ టెర్రరిజంతో పోలుస్తూ అణిచివేస్తున్నారంటూ చంద్రబాబు పేర్కొన్నారు. లా అండ్ ఆర్డర్ పూర్తిగా విఫలమైందంటూ చంద్రబాబు పేర్కొన్నారు. దేవాలయం లాంటి టీడీపీ కార్యాలయంపై దాడి అప్రజాస్వామ్యమన్నారు. ఇది పులివెందుల రాజకీయం కాదని.. ఏపీ రాజకీయం అంటూ చంద్రబాబు వ్యాఖ్యానించారు.