Aryan Khan Case: కొడుకు రిలీజ్ అయ్యేవరకు నో స్వీట్స్.. సిబ్బందిని ఆదేశించేంచిన గౌరీ ఖాన్..

డ్రగ్స్ కేసులో జైలు ఊచలు లెక్కబెడుతున్నాడు కింగ్ ఖాన్ కొడుకు ఆర్య‌న్ ఖాన్ . సముద్రం మధ్యలో క్రూయిజ్‌ రేవ్‌ పార్టీలో అడ్డంగా బుక్కైన ఆర్యన్‌ఖాన్‌ జైలు జీవితం అనుభవిస్తున్నాడు.

Aryan Khan Case: కొడుకు రిలీజ్ అయ్యేవరకు నో స్వీట్స్.. సిబ్బందిని ఆదేశించేంచిన గౌరీ ఖాన్..
Aryan Khan
Follow us
Rajeev Rayala

|

Updated on: Oct 19, 2021 | 8:59 PM

Aryan Khan Case: డ్రగ్స్ కేసులో జైలు ఊచలు లెక్కబెడుతున్నాడు కింగ్ ఖాన్ కొడుకు ఆర్య‌న్ ఖాన్. సముద్రం మధ్యలో క్రూయిజ్‌ రేవ్‌ పార్టీలో అడ్డంగా బుక్కైన ఆర్యన్‌ఖాన్‌ జైలు జీవితం అనుభవిస్తున్నాడు. ఆ క్రూయిజ్‌లో డ్రగ్స్‌తో దొరికిపోయాడు ఆర్యన్‌ఖాన్‌. ఆర్యన్‌ఖాన్‌తో పాటు అర్బాజ్‌ మర్చంట్‌, మున్‌మున్‌, నుపూర్‌ సారిక, ఇస్మీత్ సింగ్‌, మోహక్‌ జస్వాల్‌, విక్రాంత్‌ ఛోకర్‌, గోమిత్‌ చోప్రాను ఎన్సీబీ అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఎన్సీబీ ఆర్యన్, మరొక నిందితుడు అర్బాజ్ నుండి డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు చెప్పారు. ఎన్సీబీ కోర్టులో వాట్సాప్ చాట్ కూడా సమర్పించింది. ఈ చాట్ దర్యాప్తులో డ్రగ్స్ కేసులో ఆర్యన్ ఖాన్ ముఖ్యమైన పాత్ర ఉందని తేలిందని పేర్కొన్నారు. వారందరూ రేవ్ పార్టీలో ఉన్నందున వారి కేసును ఒంటరిగా పరిగణించలేమని ఎన్సీబీ చెప్పింది.

ఇదిలా ఉంటే తన కొడుకు ఆర్య‌న్ ఖాన్ బెయిల్‌పై ఇంటికొచ్చే వ‌ర‌కూ మ‌న్న‌త్‌లో ఖీర్‌గానీ, ఇత‌ర స్వీట్లుగానీ చేయ‌కూడ‌ద‌ని త‌న ఇంట్లోని సిబ్బందికి ఆదేశాలిచ్చారట ఆర్య‌న్ తల్లి గౌరీ ఖాన్. బుధ‌వారం అత‌ని బెయిల్‌పై ప్ర‌త్యేక కోర్టు తీర్పు ఇవ్వ‌నుంది. ఈ నేపథ్యంలో ఆర్య‌న్ కు బెయిల్ దొరుకుతుంది. అతడు బయటకు వస్తాడని షారుక్ కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. ఈ పండుగ‌ల సీజ‌న్‌లో వాళ్లు సంబురాల‌కు దూరంగా ఉన్నారు. ప్రతి ఏడాది ఎంతో సంబరంగా  ఈద్‌, దీపావ‌ళిలాంటి పండుగలు జరుపుకునే మ‌న్న‌త్‌లో ఈసారి ఆ కళ కనిపించడం లేదు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Megastar Chiranjeevi : కళలను మరిచిపోతోన్న ఈ తరంలో ఇలాంటి సినిమా రావడం సంతోషంగా ఉంది: మెగాస్టార్

Suriya’s Jai Bheem : సూర్య ‘జై భీమ్’ నుంచి ‘పవర్’ సాంగ్.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న పాట..

Akkineni: అక్కినేని అభిమానుల సంబరాలు.. సూపర్ హిట్స్ అందుకున్న అఖిల్- నాగచైతన్య..