Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Megastar Chiranjeevi : కళలను మరిచిపోతోన్న ఈ తరంలో ఇలాంటి సినిమా రావడం సంతోషంగా ఉంది: మెగాస్టార్

ప్రముఖ కూచిపూడి డ్యాన్సర్ సంధ్యారాజు నటిస్తూ స్వయంగా నిర్మిస్తున్న సినిమా ‘నాట్యం’. రేవంత్ కోరుకొండ దర్శకత్వంలో నిశ్రింకళ ఫిల్మ్‌ పతాకంపై రూపొందిన ఈ సినిమా

Megastar Chiranjeevi : కళలను మరిచిపోతోన్న ఈ తరంలో ఇలాంటి సినిమా రావడం సంతోషంగా ఉంది: మెగాస్టార్
Natyam
Follow us
Rajeev Rayala

|

Updated on: Oct 19, 2021 | 4:44 PM

Natyam Movie: ప్రముఖ కూచిపూడి డ్యాన్సర్ సంధ్యారాజు నటిస్తూ స్వయంగా నిర్మిస్తున్న సినిమా ‘నాట్యం’. రేవంత్ కోరుకొండ దర్శకత్వంలో నిశ్రింకళ ఫిల్మ్‌ పతాకంపై రూపొందిన ఈ సినిమా ఈ నెల 22న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్ప‌టికే ఈ చిత్రానికి ప్రేక్ష‌కులు, సినీప‌రిశ్ర‌మ‌ నుండి మంచి సపోర్ట్ ల‌భిస్తోంది. తాజాగా మెగాస్టార్ చిరంజీవి `నాట్యం` సినిమాను ప్ర‌శంసించారు.  ఈ సందర్భంగా మెగాస్టార్ మాట్లాడుతూ.. ‘ నాట్యం సినిమా చాలా చక్కగా అనిపించింది. మంచి ఫీలింగ్‌ను కలిగించింది. నాట్యం అంటే ఓ కథను అందంగా, దృశ్యరూపంలో చూపించడం. నాట్యం అంటే కాళ్లు, చేతులు లయబద్దంగా ఆడించడం అనుకుంటారు. కానీ దర్శకుడు రేవంత్, సంధ్యా రాజు మాత్రం కథను అందంగా చెప్పడం అని చూపించారు. ఒకప్పుడు ప్రజలకు ఏదైనా చెప్పాలంటే ఇలా ఎంటర్టైన్మెంట్‌లా చెప్పేవారు. ఇందులో అదే చూపించారు. ఇలాంటి చిత్రాలు అనగానే మనకు కే విశ్వనాథ్ గారు గుర్తుకు వస్తారు. ఆయన్ను స్ఫూర్తిగా తీసుకునే ఈ సినిమాను తీసినట్టు నాకు అనిపిస్తోంది. మన కళలు, నాట్యం, సంగీతం ఇలా అన్నింటిపైనా ఆయనకున్న గ్రిప్, ప్యాషన్ గానీ అంతా ఇంతా కాదు. యంగ్ డైరెక్టర్ అయిన రేవంత్ మళ్లీ ఇలాంటి ప్రయత్నం చేయడం ఎంతో ఆనందంగా ఉంది. ఇలాంటి వారు రావాలి అన్నారు చిరు.

అలాగే మన ఆచారాలు, సంప్రదాయాలు, కళలను మరిచిపోతోన్న ఈ తరంలో ఇలాంటి సినిమా రావడం సంతోషంగా ఉంది అన్నారు. ఈ ప్రయత్నాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. దానికి ఆలంబనగా, ఎంతో ప్యాషన్ ఉన్న సంధ్యా రాజు ముందుకు రావడాన్ని మనం అభినందించాలి. పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చారు.. డబ్బు కోసమని కాకుండా తనకున్న ప్యాషన్, కళల పట్ల తనకున్న అంకిత భావాన్ని తెలియజేస్తుంది. ఈ సినిమా ద్వారా నాట్యం గొప్పదనం కోట్ల మందికి చేరుతుంది. సినిమా మాధ్యమం అనేది చాలా ప్రభావవంతమైంది. దీని ద్వారా మీ టాలెంట్‌ను చూపించాలని అనుకుంటున్నారు. అది వృథా కాదు. రేవంత్, సంధ్యా రాజు ఇద్దరూ కూడా పర్ఫెక్ట్ కాంబినేషన్. ఈ చిత్రం హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చిన్న వయసు వాడైనా సరే.. తన డెబ్యూగా ఇలాంటి సినిమాను తీశారు. ఇలాంటి సినిమాను తెలుగు ప్రేక్షకులు కచ్చితంగా ఆదరిస్తారనే నమ్మకం నాకుంది. ఇండస్ట్రీని శంకరాభరణం ముందు శంకరాభరణం తరువాత అని అంటుంటారు. అలా శంకరాభరణం సినిమాను ఎంతగా ఆదరించారో ఈరోజు కొత్తగా చెప్పాల్సిన పని లేదు. అదో క్లాసిక్ చిత్రం. అలానే నాట్యం సినిమాకు కూడా ప్రజాశీస్సులు ఉంటాయని ఆశిస్తున్నాను. ఈ చిత్రం ఎప్పుడు చూస్తానా? అని నాకు కూడా ఆత్రుతగా ఉంది. ఈ చిత్రం పెద్ద సక్సెస్ అవ్వాలి. చిత్రయూనిట్‌కు ఆల్ ది బెస్ట్’ అని అన్నారు మెగాస్టార్.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Bigg Boss 5 Telugu: హౌజ్‌లో హీట్‌ పెంచిన ఎలిమినేషన్‌ ప్రక్రియ.. కెప్టెన్సీ టాస్క్‌ కోసం బిగ్‌బాస్‌ కొత్త ఆట షురూ.!

Heroine Pranitha: మత్తు ఎక్కించే ఫోజుల్లో ఆకట్టుకుంటున్న అందంతో ఎట్రాక్ట్ చేస్తున్న ‘ప్రణీత’ ఫొటోస్…

Manike Mage Hithe: బాలీవుడ్‌లోకి అడుగు పెట్టనున్న యొహాని…’థ్యాంక్‌ గాడ్’ మూవీలో ఛాన్స్‌ !