Bigg Boss 5 Telugu: హౌజ్‌లో హీట్‌ పెంచిన ఎలిమినేషన్‌ ప్రక్రియ.. కెప్టెన్సీ టాస్క్‌ కోసం బిగ్‌బాస్‌ కొత్త ఆట షురూ.!

Bigg Boss 5 Telugu: బిగ్‌బాస్‌ రియాలిటీ షోలో ఎలిమినేషన్‌ ప్రక్రియ అంటేనే హౌజ్‌లో గందరగోళం వాతావరణ పరిస్థితులు నెలకొంటాయి. ఎప్పటిలాగే ఈ వారం ఎలిమినేషన్‌ ప్రక్రియ కూడా హాట్‌ హాట్‌గా సాగింది...

Bigg Boss 5 Telugu: హౌజ్‌లో హీట్‌ పెంచిన ఎలిమినేషన్‌ ప్రక్రియ.. కెప్టెన్సీ టాస్క్‌ కోసం బిగ్‌బాస్‌ కొత్త ఆట షురూ.!
Bigboss 5 Telugu
Follow us
Narender Vaitla

|

Updated on: Oct 19, 2021 | 1:39 PM

Bigg Boss 5 Telugu: బిగ్‌బాస్‌ రియాలిటీ షోలో ఎలిమినేషన్‌ ప్రక్రియ అంటేనే హౌజ్‌లో గందరగోళం వాతావరణ పరిస్థితులు నెలకొంటాయి. ఎప్పటిలాగే ఈ వారం ఎలిమినేషన్‌ ప్రక్రియ కూడా హాట్‌ హాట్‌గా సాగింది. ఎలిమినేషన్‌ ప్రక్రియలో భాగంగా లివింగ్‌ ఏరియాలో టేబుల్‌పై పెట్టిన రెండు అరటి పండ్ల టాస్క్‌ ఇచ్చిన బిగ్‌బాస్‌. లివింగ్‌ ఏరియాలో ఉంచిన అరటి పండ్లను ఎవరైతే పట్టుకుంటారో వాళ్లు వేటగాడితో చర్చించి.. ఒకరిని నామినేట్ అయ్యేలా ఒప్పించాలి. ఇలా సాగిన ఈ ప్రక్రియలో చివరికి ఈ వారం అనీ మాస్టర్‌, ప్రియ, సిరి, రవి, కాజల్‌తో పాటు, డేరా నుంచి ఒక్కసారి కూడా బయటకు రాని కారణంగా వేటగాళ్లు అయిన శ్రీరామ్‌, జెస్సీలు నామినేట్‌ అయ్యారు. దీంతో ఎలిమినేషన్ ప్రక్రియ విజయవంతంగా పూర్తయింది.

ఇదిలా ఉంటే ఇలా ఎలిమినేషన్‌ ప్రక్రియ ముగిసిందో లేదో అలా కెప్టెన్సీ టాస్క్‌ను ఇచ్చాడు బిగ్‌బాస్‌. ఇందులో భాగంగా ‘బంగారు కోడిపెట్ట’ పేరుతో ఓ వినూత్న టాస్క్‌ ఇచ్చాడు. హౌజ్‌ లివింగ్‌ ప్లేస్‌లో కోడి ఆకారంలో ఉన్న బొమ్మ నుంచి గుడ్లను తీసుకొని వాటిని జాగ్రత్తగా కాపాడుకోవాలి. అలా చివరికి ఎవరి దగ్గర ఎక్కువ గుడ్లు ఉంటాయో వారు కెప్టెన్సీ టాస్క్‌ గెలిచినట్లు. మరి కెప్టెన్సీ టాస్క్‌లో ఎవరు గెలిచారో తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్‌ ప్రసారమయ్యే వరకు వేచి చూడాల్సిందే. ఈ క్రమంలోనే తాజాగా బిగ్ బాస్‌ నిర్వాహకులు ప్రోమోను విడుదల చేశారు.

ప్రోమోను గమనిస్తే.. నిన్నటి ఎలిమినేషన్‌ తాలూకు హీట్‌ ఇంకా తగ్గినట్లు కనిపించడం లేదు. నామినేషన్‌లో భాగంగా జరిగిన పరిమాణాలపై హౌజ్‌మేట్స్‌ మధ్య తీవ్ర చర్చకు దారి తీశాయి. వాళ్లు ఆడితే గేమ్‌.. నేను ఆడితే క్రైమా.? అని సన్నీ కాస్త సీరియస్‌గా స్పందించాడు. దీంతో ఈరోజు ఎపిసోడ్‌పై ఆసక్తి ఒక్కసారిగా పెరిగింది.

Also Read: Manike Mage Hithe: బాలీవుడ్‌లోకి అడుగు పెట్టనున్న యొహాని…’థ్యాంక్‌ గాడ్’ మూవీలో ఛాన్స్‌ !

Uttarakhand Floods: ఉత్తరాఖండ్‌ వరదల్లో చిక్కుకున్న హైదరాబాదీలు.. నాలుగు రోజులుగా హోటల్లో పడిగాపులు

Heavy Rainfall: ముంచెత్తిన వరదలు.. ఎడతేరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో వణుకుతున్న ఉత్తరాఖండ్‌, కేరళ..

క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?
కొత్త ఏడాది పైనే ఫ్లాప్ హీరోయిన్ల ఆశలు.. ఇప్పుడైన కలిసొచ్చేన
కొత్త ఏడాది పైనే ఫ్లాప్ హీరోయిన్ల ఆశలు.. ఇప్పుడైన కలిసొచ్చేన
నీయవ్వ తగ్గేదేలే.. పుష్పరాజ్‌లా పోజులిచ్చిన స్టార్ హీరోయిన్ డాటర్
నీయవ్వ తగ్గేదేలే.. పుష్పరాజ్‌లా పోజులిచ్చిన స్టార్ హీరోయిన్ డాటర్
వీళ్లు బాదంపప్పును పొరపాటున కూడా తినకూడదు.. దూరంగా ఉంటేనే ఆరోగ్యం
వీళ్లు బాదంపప్పును పొరపాటున కూడా తినకూడదు.. దూరంగా ఉంటేనే ఆరోగ్యం
హీరో ఆది పినిశెట్టి భార్య ఫేమస్ హీరోయిన్ తెలుసా.. ?
హీరో ఆది పినిశెట్టి భార్య ఫేమస్ హీరోయిన్ తెలుసా.. ?