Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Uttarakhand Floods: ఉత్తరాఖండ్‌ వరదల్లో చిక్కుకున్న హైదరాబాదీలు.. నాలుగు రోజులుగా హోటల్లో పడిగాపులు

ఉత్తరాఖండ్ వరదల్లో చిక్కుకుపోయింది హైదరాబాద్‌కు చెందిన ఓ కుటుంబం. మల్కాజిగిరి ఆర్.కె.నగర్ కు చెందిన ఇద్దరు వ్యక్తులు.. దసరా సెలవులకు ఉత్తరాఖండ్ వెళ్లారు.

Uttarakhand Floods: ఉత్తరాఖండ్‌ వరదల్లో చిక్కుకున్న హైదరాబాదీలు.. నాలుగు రోజులుగా హోటల్లో పడిగాపులు
Floods
Follow us
Sanjay Kasula

|

Updated on: Oct 19, 2021 | 12:46 PM

ఉత్తరాఖండ్ వరదల్లో చిక్కుకుపోయింది హైదరాబాద్‌కు చెందిన ఓ కుటుంబం. మల్కాజిగిరి ఆర్.కె.నగర్ కు చెందిన ఇద్దరు వ్యక్తులు.. దసరా సెలవులకు ఉత్తరాఖండ్ వెళ్లారు. అకస్మాత్తుగా అక్కడ వరదలు ముంచెత్తడంతో గత నాలుగు రోజులుగా అక్కడ లేమన్ ట్రీ ప్రాంతంలో చిక్కుకుపోయారు. అక్కడ తాము ఒక బిల్డింగ్ మూడవ అంతస్తుపై చిక్కుపోయామని..రెండవ అంతస్తు వరకు నీళ్లు చేరడంతో బయటకు రాలేని పరిస్థితిలో తాము ఉన్నట్లు బాధితులు విచారం వ్యక్తం చేస్తున్నారు. తమను కాపాదాటానికి ఎవరు ఇక్కడ అధికారులు రావడంలేదని వాపోతున్నారు. దయచేసి తమను ఇక్కడ నుండి తమ సొంత రాష్ట్రం తెలంగాణకు పంపించాలని ఇదే విషయం తెలంగాణ సి.ఎం.ఓ కు మెసేజ్ చేశామని వెంటనే తమను కాపాడాలని వేడుకుంటున్నారు.

భారీ వర్షాలు, వరదలకు వణికిపోతున్నాయి కేరళ, ఉత్తరాఖండ్‌ రాష్ట్రాలు. పలు జిల్లాల్లో ఎడతేరిపి లేకుండా కురిసిన వర్షాలకు నదులు, వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. వర్షాలు, వరదల ధాటికి కేరళలో పదుల సంఖ్యలో మృత్యువాత పడ్డారు.

కేరళ, ఉత్తరాఖండ్‌ రాష్ట్రాల్లో ఎటు చూసినా హృదయ విదారక దృశ్యాలే కనిపిస్తున్నాయి. భారీ వరదలకు చిన్నారులతో జలసమాధి అయిపోయింది. 10 డ్యాంల పరిధిలో రెడ్ అలెర్ట్ జారీ చేశారు అధికారులు. నీటి మట్టం ప్రమాదకర స్థాయికి చేరడంతో గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు.

ఇవి కూడా చదవండి: Sirimanu Utsavam: నేడు పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం.. లక్షలాదిగా తరలిరానున్న భక్తులు..

Chanakya Niti: ఇలాంటి శత్రువులతో జాగ్రత సుమీ.. అలాంటివారి పట్ల ఏమరపాటు అసలే వద్దు..