Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Aryan Drug Case: ఆర్యన్‌ఖాన్‌కు బెయిల్‌ ఇవ్వండి.. సుప్రీంకోర్టును ఆశ్రయించిన శివసేన..

ముంబై క్రూయిజ్‌లో డ్రగ్స్‌ కేసుపై దుమారం మరింత ముదురుతోంది. ఆర్యన్‌ఖాన్‌ అరెస్ట్‌పై ప్రకంపనలు కొనసాగుతుతున్నాయి. ఇప్పడు ఎన్సీబీ వర్సెస్‌ శివసేనగా మారింది.

Aryan Drug Case: ఆర్యన్‌ఖాన్‌కు బెయిల్‌ ఇవ్వండి.. సుప్రీంకోర్టును ఆశ్రయించిన శివసేన..
Aaryan Khan Arrest
Follow us
Sanjay Kasula

|

Updated on: Oct 19, 2021 | 1:01 PM

ముంబై క్రూయిజ్‌లో డ్రగ్స్‌ కేసుపై దుమారం మరింత ముదురుతోంది. ఆర్యన్‌ఖాన్‌ అరెస్ట్‌పై ప్రకంపనలు కొనసాగుతుతున్నాయి. ఇప్పడు ఎన్సీబీ వర్సెస్‌ శివసేనగా మారింది. ఆర్యన్‌ఖాన్‌ అరెస్ట్‌ వెనుక బీజేపీ కుట్ర ఉందని ఆరోపిస్తున్నారు శివసేన నేతలు. ఎన్సీబీ అధికారి సమీర్‌ వాంఖడే బీజేపీ కార్యకర్తలా మారారని విమర్శిస్తున్నారు. తాజాగా సుప్రీంకోర్టును ఆశ్రయించారు శివసేన నేత కిశోర్‌ తివారీ. ఈ-మెయిల్‌ ద్వారా పిటిషన్‌ దాఖలు చేశారు. ఆర్యన్‌ఖాన్‌ ప్రాథమిక హక్కులను రక్షించాలని విజ్ఞప్తి చేశారు తివారీ.

ముంబైలో డ్రగ్స్ పార్టీ క్రూయిజ్ పట్టుబడ్డ బాలీవుడ్ సూపర్ స్టార్ షారూఖ్ కుమారుడు ఆర్యన్ ఖాన్ కోసం శివసేన  నాయకులు సుప్రీం కోర్టు తలుపులు తట్టారు. ఆర్యన్ ఖాన్‌కు మద్దతుగా సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు సేన నాయకుడు తివారీ కిశోర్ తివారీ. ఈ పిటిషన్‌లో నిందితులకు ప్రాథమిక హక్కులను పేర్కొంటూ ఆర్యన్‌కు ఉపశమనం కలిగించాలని అభ్యర్థించారు. 

ముంబై NCB అధికారులు అవినీతికి పాల్పడుతున్నారని.. NCBపై న్యాయవిచారణ జరపాలని కిశోర్‌ తివారీ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. రెండేళ్లుగా సెలబ్రిటీలను టార్గెట్‌గా చేసుకొని దాడులు చేస్తున్నారని.. ఈ డ్రగ్స్‌ కేసులో అసలు నిజాలేంటో నిగ్గుతేల్చేందుకు ప్రత్యేక న్యాయ విచారణ జరపాలని కోరారు.

ప్రస్తుతం ఆర్థర్‌ రోడ్‌ జైల్లో ఉన్నారు ఆర్యన్‌ఖాన్‌. పలుమార్లు బెయిల్‌ పిటిషన్‌ వేసినా తిరస్కరించింది కోర్ట్‌. 5 రోజుల క్రితం ఆర్యన్‌ బెయిల్‌ పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం.. బెయిల్‌ తీర్పును రిజర్వ్‌లో ఉంచింది. ఆర్యన్ ఖాన్ బెయిల్ పిటిషన్‌పై బుధవారం తీర్పు వెల్లడించనుంది.

ఇవి కూడా చదవండి: Sirimanu Utsavam: నేడు పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం.. లక్షలాదిగా తరలిరానున్న భక్తులు..

Chanakya Niti: ఇలాంటి శత్రువులతో జాగ్రత సుమీ.. అలాంటివారి పట్ల ఏమరపాటు అసలే వద్దు..