AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Honour Killing: ప్రేమ పెళ్లి చేసుకుందని దారుణం.. ఇద్దరు కూతుళ్లు, నలుగురు మనవలు సజీవ దహనం..

Honour Killing: పాకిస్తాన్‌లో దారుణం చోటుచేసుకుంది. త‌న కూతురు త‌న‌కు ఇష్టం లేని పెళ్లి చేసుకుందని.. ఓ తండ్రి కుటుంబంలోని ఆరుగురిని

Honour Killing: ప్రేమ పెళ్లి చేసుకుందని దారుణం.. ఇద్దరు కూతుళ్లు, నలుగురు మనవలు సజీవ దహనం..
Shaik Madar Saheb
|

Updated on: Oct 19, 2021 | 3:23 PM

Share

Honour Killing: పాకిస్తాన్‌లో దారుణం చోటుచేసుకుంది. త‌న కూతురు త‌న‌కు ఇష్టం లేని పెళ్లి చేసుకుందని.. ఓ తండ్రి కుటుంబంలోని ఆరుగురిని స‌జీవ ద‌హనం చేశాడు. ఈ ఘాతుకానికి ఇద్దరు కూతుళ్లు, ఇద్దరు మ‌న‌వ‌లు, ఇద్దరు మ‌న‌వ‌రాళ్లు బలయ్యారు. ఈ దారుణ సంఘటన పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్ ముజ‌ఫ‌ర్‌గ‌ఢ్‌లో చోటుచేసుకుంది. ముజఫర్‌గఢ్‌లో నివసించే మంజూర్ హుస్సేన్ ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. మంజూర్ కూతురు ఫౌజియా బీబీ, మెహబూబ్ కొన్నేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అనంతరం ఇరు కుటుంబాల మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో మంజూర్ కూతురు చంపాలని కొడుకు సాబిర్ హుస్సేన్‌తో కలిసి ప్లాన్ రచించాడు. కూతురు, మనవళ్లు ఉన్న ఇంటిని తగులబెట్టాడు. ఈ ఘటనలో మంజూర్ కూతురు ఫౌజియా బీబీ, ఆమె నాలుగు నెల‌ల చిన్నారి, మ‌రో ముగ్గురు పిల్లలు మృత్యువాత ప‌డినట్లు పోలీసు అధికారి అబ్దుల్ మజీద్ తెలిపారు.

ఈ ఘటన నుంచి బ‌య‌ట‌ప‌డిన హుస్సేన్‌ అల్లుడు మెహ‌బూబ్ అహ్మద్ పోలీసుల‌కు ఫిర్యాదు చేశాడు. మంజూర్ హుస్సేన్‌తోపాటు అత‌ని కొడుకు సాబిర్ హుస్సేనే ఈ దారుణానికి పాల్పడ్డారని పేర్కొన్నాడు. తాను ముల్తాన్ నుంచి ఇంటికి వ‌చ్చే స‌మ‌యానికి ఆ ఇద్దరూ ఇంటిని తగులబెట్టి పారిపోవ‌డం చూశాన‌ని ఫిర్యాదులో పేర్కొన్నాడు. కాగా.. ఈ ఘటన పాకిస్తాన్‌లో కలకలం రేపింది. ఇదిలాఉంటే.. మానవహక్కుల నివేదిక ప్రకారం.. పాకిస్తాన్‌లో ప్రతి సంవత్సరం దాదాపు 1,000 పరువు హత్యలు జరుగుతున్నాయి.

Also Read:

NIA: జమ్మూకాశ్మీర్‌లో వరుస హత్యలపై కేంద్రం సీరియస్ యాక్షన్.. రంగంలోకి ఎన్ఐఏ..

Indian Railways: రైల్వే ప్రయాణీకులకు బ్యాడ్‌న్యూస్.. ఇకపై ‘బెడ్ రోల్స్’ కావాలంటే జేబులకు చిల్లే.!

Follow Us
ఆలుగడ్డలు ఎక్కువ కాలం తాజా ఉండాలా? ఈ సులభమైన చిట్కాలు పాటించండి!
ఆలుగడ్డలు ఎక్కువ కాలం తాజా ఉండాలా? ఈ సులభమైన చిట్కాలు పాటించండి!
భార్యను స్నేహితుడికి ఇచ్చి పెళ్లి చేసిన భర్త..!
భార్యను స్నేహితుడికి ఇచ్చి పెళ్లి చేసిన భర్త..!
బిగ్ బాస్‌లో డబ్బులిచ్చారు కానీ నా జీవితంతో ఆడుకున్నారు
బిగ్ బాస్‌లో డబ్బులిచ్చారు కానీ నా జీవితంతో ఆడుకున్నారు
శనివారం వెంకటేశ్వర స్వామి దీపారాధన.. ఒక్కసారి చేసేయండి, డబ్బు..
శనివారం వెంకటేశ్వర స్వామి దీపారాధన.. ఒక్కసారి చేసేయండి, డబ్బు..
ఎయిర్ ఇండియా చేసిన పనికి వెనక్కి వచ్చిన విమానం!
ఎయిర్ ఇండియా చేసిన పనికి వెనక్కి వచ్చిన విమానం!
సిలిండర్‌ 14.2 కేజీలే ఎందుకు ఉంటుంది? 15 కేజీలు ఎందుకు ఉండదు?
సిలిండర్‌ 14.2 కేజీలే ఎందుకు ఉంటుంది? 15 కేజీలు ఎందుకు ఉండదు?
భారతదేశంలో ఎప్పటికీ ఫెయిల్యూర్ కాని 5 టాప్ బిజినెస్ ఐడియాలివే!
భారతదేశంలో ఎప్పటికీ ఫెయిల్యూర్ కాని 5 టాప్ బిజినెస్ ఐడియాలివే!
గ్లోబల్ సైజుకు తీసుకెళదామనుకున్న సినమాకు గుర్తింపు లేదా?
గ్లోబల్ సైజుకు తీసుకెళదామనుకున్న సినమాకు గుర్తింపు లేదా?
బ్యాడ్ కొలెస్ట్రాల్ కు చెక్.. గుండెపోటు రాకుండా 5 సూపర్ టిప్స్
బ్యాడ్ కొలెస్ట్రాల్ కు చెక్.. గుండెపోటు రాకుండా 5 సూపర్ టిప్స్
ఉగాది రోజున ఇల్లు శుభ్రం చేస్తుండగా ఘోరం..!
ఉగాది రోజున ఇల్లు శుభ్రం చేస్తుండగా ఘోరం..!