Indian Railways: రైల్వే ప్రయాణీకులకు బ్యాడ్‌న్యూస్.. ఇకపై ‘బెడ్ రోల్స్’ కావాలంటే జేబులకు చిల్లే.!

రైల్వే ప్రయాణీకులకు బ్యాడ్‌న్యూస్. ఇకపై రైలులో దుప్పట్లు, బెడ్‌షీట్స్ కావాలంటే జేబులకు చిల్లు పడినట్లే. ప్రస్తుతం శీతాకాలం ప్రారంభం..

Indian Railways: రైల్వే ప్రయాణీకులకు బ్యాడ్‌న్యూస్.. ఇకపై 'బెడ్ రోల్స్' కావాలంటే జేబులకు చిల్లే.!
Indian Railways
Follow us
Ravi Kiran

|

Updated on: Oct 19, 2021 | 1:45 PM

రైల్వే ప్రయాణీకులకు బ్యాడ్‌న్యూస్. ఇకపై రైలులో దుప్పట్లు, బెడ్‌షీట్స్ కావాలంటే జేబులకు చిల్లు పడినట్లే. ప్రస్తుతం శీతాకాలం ప్రారంభం కావడంతో ‘బెడ్ రోల్స్’ డిమాండ్ బాగా పెరుగుతోంది. ఈ క్రమంలోనే ప్రయాణీకులకు మళ్లీ బెడ్ రోల్స్(బెడ్ షీట్స్, దుప్పట్లు, దిండు)ను అందించేందుకు రైల్వే శాఖ కొత్త మార్గాన్ని అన్వేషించింది. ఢిల్లీతో సహా పలు రైల్వే డివిజన్ల రైళ్లలో డిస్పోజబుల్ బెడ్ షీట్లు, దుప్పట్లు వంటి అవసరమైన కిట్‌లను ప్రయాణీకులకు అందించేందుకు స్టేషన్లలో అల్ట్రా-వైలెట్ బేస్డ్ లగేజ్ శానిటైజేషన్ మెషిన్లను ప్రారంభించింది. ఇందుకోసం రైళ్లలో ప్రయాణించే ప్రతీ ప్రయాణీకుడు కనిష్టంగా రూ. 30 నుంచి గరిష్టంగా రూ. 300 వరకు చెల్లించాల్సి ఉంటుంది.

ఇదిలా ఉంటే.. కరోనా వైరస్ మొదటి వేవ్ ప్రారంభం నుంచి రైల్వే శాఖ బెడ్ షీట్స్, దుప్పట్లు, దిండు ఇవ్వడాన్ని నిలిపేసిన సంగతి తెలిసిందే. మహమ్మారి ఉధృతి తగ్గిన తర్వాత నుంచి ఇండియన్ రైల్వేస్.. దశలవారీగా ట్రైన్ సర్వీసులను ప్రారంభిస్తూ వస్తోంది. ప్రస్తుతం కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా 95 శాతం రైళ్లు నడుస్తున్నాయి. వీటిల్లోని ఏసీ కోచ్‌లలో బెడ్ రోల్స్ సౌకర్యం లేదు. ప్రయాణీకులు తమ వెంటే దుప్పట్లు తెచ్చుకుంటున్నారు. అయితే ఇప్పుడు మళ్లీ ఆ సౌకర్యాన్ని షురూ చేసింది. దీని కోసం మూడు రకాల కిట్లను అందుబాటులోకి తీసుకొచ్చింది.

రైల్వేశాఖ అందించనున్న మూడు రకాల కిట్లు:

* మొదటి కిట్- దీని కోసం ప్రయాణీకులు రూ. 300 చెల్లించాల్సి ఉంటుంది. దుప్పటి, దిండు(నేసినవి కావు), బెడ్ షీట్, బ్యాగ్, టూత్‌పేస్ట్, హెయిర్ ఆయిల్, దువ్వెన, శానిటైజర్ సాచెట్, పేపర్ సబ్బు, టిష్యూ పేపర్ అందుబాటులో ఉంటాయి.

* రెండవ కిట్- ఇందుకు ప్రయాణీకులు రూ. 150 చెల్లించాలి. ఈ కిట్‌లో కేవలం దుప్పట్లు మాత్రమే అందుబాటులో ఉంటాయి.

* మూడవ కిట్- ఇందుకు ప్రయాణీకులు రూ. 30 చెల్లించాలి. టూత్‌పేస్ట్, టూత్ బ్రష్, హెయిర్ ఆయిల్, దువ్వెన, శానిటైజర్, పేపర్ సబ్బు, టిష్యూ అందుబాటులో ఉంటాయి.

కాగా, ప్రస్తుతం ఢిల్లీ రైల్వే డివిజన్‌లో 57 రైళ్లలో మాత్రమే ఈ సౌకర్యం అందుబాటులో ఉంది. కోవిడ్ పరిస్థితిని సమీక్షించిన తర్వాత మరిన్ని స్టేషన్లలో ప్రారంభిస్తారు.

హైకోర్టులో క్లర్క్‌ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల
హైకోర్టులో క్లర్క్‌ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల
సికింద్రాబాద్ ​నుంచి కుంభమేళాకు IRCTC ప్యాకేజీ.. వివరాలు ఏమిటంటే
సికింద్రాబాద్ ​నుంచి కుంభమేళాకు IRCTC ప్యాకేజీ.. వివరాలు ఏమిటంటే
ఓటీటీలో అద్దిరిపోయే సర్వైవల్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎందులోనంటే?
ఓటీటీలో అద్దిరిపోయే సర్వైవల్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎందులోనంటే?
దక్షిణాది నుంచి బీజేపీలో కీలక నేతగా కిషన్ రెడ్డి
దక్షిణాది నుంచి బీజేపీలో కీలక నేతగా కిషన్ రెడ్డి
EPFO: పీఎఫ్‌ ఖాతాదారులకు గుడ్‌న్యూస్‌.. PF ATM కార్డ్‌, యాప్‌!
EPFO: పీఎఫ్‌ ఖాతాదారులకు గుడ్‌న్యూస్‌.. PF ATM కార్డ్‌, యాప్‌!
ఆ స్టార్ డైరెక్టర్ వల్లే నా కెరీర్ డ్యామేజ్ అయ్యింది..
ఆ స్టార్ డైరెక్టర్ వల్లే నా కెరీర్ డ్యామేజ్ అయ్యింది..
ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల ఘాతుకం.. 9 మంది జవాన్లు మృతి..!
ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల ఘాతుకం.. 9 మంది జవాన్లు మృతి..!
విద్యార్ధులకు అలర్ట్.. స్కాలర్‌షిప్‌ దరఖాస్తు గడువు పెంపు
విద్యార్ధులకు అలర్ట్.. స్కాలర్‌షిప్‌ దరఖాస్తు గడువు పెంపు
ఇంగ్లిష్‌లో మాట్లాడినందుకు స్టార్ హీరో కూతురిపై ట్రోల్స్
ఇంగ్లిష్‌లో మాట్లాడినందుకు స్టార్ హీరో కూతురిపై ట్రోల్స్
విద్యార్థులకు గుడ్‌న్యూస్‌..7 నుంచి 13 వరకు పాఠశాలలకు సెలవులు
విద్యార్థులకు గుడ్‌న్యూస్‌..7 నుంచి 13 వరకు పాఠశాలలకు సెలవులు