Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Temple Assets: రూ. 951 కోట్ల ఖర్చుపై ఆడిట్ అభ్యంతరాలు.. ఏపీలోని ఆలయాల ఆదాయ అక్రమాలపై చర్యలకు సిద్ధం

ఆంధ్రప్రదేశ్‌లోని ఆలయాల ఆస్తుల, సొత్తులు పక్కదోవ పట్టించిన విషయంలో చేసిన అక్రమాలపై ఆయా ఆలయాల ఈవోలపై చర్యలకు రంగం సిద్ధమవుతోంది.

Temple Assets: రూ. 951 కోట్ల ఖర్చుపై ఆడిట్ అభ్యంతరాలు.. ఏపీలోని ఆలయాల ఆదాయ అక్రమాలపై చర్యలకు సిద్ధం
Temples
Follow us
Venkata Narayana

|

Updated on: Oct 19, 2021 | 12:39 PM

Andhra Pradesh Temple Assets: ఆంధ్రప్రదేశ్‌లోని ఆలయాల ఆస్తుల, సొత్తులు పక్కదోవ పట్టించిన విషయంలో చేసిన అక్రమాలపై ఆయా ఆలయాల ఈవోలపై చర్యలకు రంగం సిద్ధమవుతోంది. దాదాపు రూ. 951 కోట్ల ఖర్చుపై ఆడిట్ అభ్యంతరాల నేపథ్యంలో కొరడా ఝులిపించేందుకు జగన్ సర్కారు చర్యలు చేపట్టింది. విజయవాడ దుర్గ గుడిలో 110 కోట్లు, శ్రీకాళహస్తి లో 150 కోట్లు, కాణిపాకం లో 122 కోట్లు, అన్నవరం లో 70 కోట్ల ఖర్చుపై అభ్యంతరాలు వ్యక్తమైన నేపథ్యంలో ఈ చర్యలకు దిగింది ఏపీ సర్కారు.

దేవాలయాల సొమ్ములు ఇష్టానికి ఖర్చుచేశారని ఆడిట్ లో అభ్యంతరాలు వచ్చిన సమయంలో ఉన్న ఈవో లపై చర్యలకు దేవదాయ శాఖ వేగంగా అడుగులు వేస్తోంది. ఆలయ భూముల NOC లకు ముగ్గురు అధికారులతో కమిటీ ఏర్పాటు చేసింది. కాగా, దేవుడి ఆస్తులకూ రక్షణ లేకుండా పోతోంది. వందల కోట్ల విలువ చేసే దేవుడి ఆస్తి కొట్టేసేందుకు ఆయా ప్రాంతాల్లో మాస్టర్‌ ప్లాన్లు వేసిన గ్యాంగ్ భారీగా ఆదాయాలను పక్కదారి పట్టించినట్టు భావిస్తున్నారు.

అటు, విజయవాడ వన్‌టౌన్‌లోని బ్రాహ్మణవీధిలో శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయం ఉంది. దీని చెంతనే నిడుముక్కల రంగవల్లి తాయారమ్మ చారిటీస్‌, నిడుముక్కల సుబ్బారాయుడు ధర్మ రామానుజ కూటం, పారేపల్లి శ్రీరాములు ధర్మరామానుజ కూటం ఉన్నాయి. ఈ నాలుగు సంస్థలూ దేవదాయ శాఖ అధీనంలో ఉన్నాయి. వీటి నిర్వహణపైనా పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

Read also: Etela Rajender: అంబేద్కర్ చౌరస్తా దగ్గర చర్చకు రండి.. TRS నేతలకు ఈటల సవాల్