Etela Rajender: అంబేద్కర్ చౌరస్తా దగ్గర చర్చకు రండి.. TRS నేతలకు ఈటల సవాల్

దళిత బంధుపై తాము లేఖ రాసినట్లు నిరూపిస్తే.. అంటూ టీఆర్‌ఎస్‌ నేతలకు సరికొత్త సీరియస్ సవాల్ విసిరారు హుజురాబాద్ బీజేపీ అభ్యర్థి ఈటల

Etela Rajender: అంబేద్కర్ చౌరస్తా దగ్గర చర్చకు రండి.. TRS నేతలకు ఈటల సవాల్
Etela
Follow us
Venkata Narayana

|

Updated on: Oct 19, 2021 | 12:17 PM

Huzurabad By Election – Etela Rajender: దళిత బంధుపై తాము లేఖ రాసినట్లు నిరూపిస్తే.. అంటూ టీఆర్‌ఎస్‌ నేతలకు సరికొత్త సీరియస్ సవాల్ విసిరారు హుజురాబాద్ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్. దళిత బంధు ఆపాలంటూ తాము లేఖ రాసినట్లు నిరూపించాలని టీఆర్‌ఎస్‌ నేతలను ఆయన డిమాండ్ చేశారు. పోచమ్మ ఆలయం దగ్గర కానీ, అంబేద్కర్‌ విగ్రహం దగ్గర కానీ చర్చకు సిద్ధమా అని మరో సవాల్‌ విసిరారు. టీఆర్‌ఎస్‌ నేతలు చేస్తున్న విమర్శలకు ఈటల ఇవాళ స్ట్రాంగ్ రియాక్షన్‌ ఇచ్చారు.

ఇవాళ కరీంనగర్ లో టీవీ9 తో ఈటెల రాజేందర్ మాట్లాడారు. “దళిత బంధు ఆపాలని ఈసికి లేఖ రాయలేదు. హుజురాబాద్ అంబేడ్కర్ చౌరస్తా కు రండి.. చర్చిద్దాం.. నా సవాలు ను టీఆర్ఎస్ నేతలు స్వీకరిస్తారా.. గతంలో నే టిఆర్ఎస్ నేతలు ఫేక్ లేటర్లు సృష్టించారు. ఇప్పటికైనా అందరికీ దళిత బంధు ఇవ్వాలి. టీఆర్ఎస్ కు ఓటమి ఖాయం.” అంటూ జోస్యం చెప్పారు ఈటల. ఇదిలా ఉండగా, తెలంగాణలో దళిత బంధును ఎవరూ ఆపలేరన్నారు మంత్రి కేటీఆర్. హుజూరాబాద్‌ ఉప ఎన్నిక పది రోజుల్లో ముగుస్తుందని, ఆ తర్వాత పథకం కంటిన్యూ అవుతుందని చెప్పారు.

టీఆర్‌ఎస్‌కు ప్లీనరీనే ఫస్ట్‌ ప్రయార్టీ అని, హుజూరాబాద్‌ బైపోల్‌ సెకండ్‌ ప్రయార్టీ అని వివరించారు. తెలంగాణ భవన్‌లో మీడియాతో చిట్‌చాట్‌గా మాట్లాడారు కేటీఆర్‌. హుజురాబాద్‌లో కాంగ్రెస్ డిపాజిట్ తెచ్చుకోవాలన్నారు. రేవంత్ రెడ్డి ఇక చిలక జోస్యం చెప్పుకోవాల్సిందేనని విమర్శించారు. కాంగ్రెస్, బీజేపీ నేతలు కుమ్మక్కయ్యారని వ్యాఖ్యానించారు. ఏడాది తరువాత ఈటెల రాజేందర్‌ను కాంగ్రెస్‌లోకి తీసుకురావడానికి ప్లాన్‌ చేశారన్నారు. కాంగ్రెస్ డమ్మీ అభ్యర్థిని పెట్టిందని, హుజురాబాద్‌లో పీసీసీ రోల్‌ ఎక్కడ ఉందని ప్రశ్నించారు. హుజురాబాద్‌ ఉప ఎన్నికతో ఎవరు ఏంటో తెలిపోతుందన్నారు కేటీఆర్‌. హుజురాబాద్‌లో 100 శాతం గెలుపు టీఆర్‌ఎస్‌దేనని ధీమా వ్యక్తం చేశారు.

Read also: Bandi Sanjay: నైతిక బాధ్యత వహిస్తూ కేసీఆర్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలి: బండి సంజయ్