Dalita Bandhu: నిరూపిస్తే కొప్పుల ఇంటి ముందు వాచ్‌మన్‌గా పని చేస్తా.. ఛాలెంజ్ చేసిన గోనె ప్రకాష్ రావు..
దళిత బంధుపై తాను ఏ లేఖ రాయలేదన్నారు ఆర్టీసీ మాజీ చైర్మన్ గోనే ప్రకాష్‌రావు. లేఖ రాసినట్లు నిరూపిస్తే దేనికైనా సిద్ధమేనన్నారు. నిరూపించకపోతే కొప్పుల..

హుజూరాబాద్ ఉప ఎన్నికల ప్రచారంలో మాటల యుద్ధం మొదలైంది. తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన దళిబంధు పథకానికి ఎలక్షన్ కమిషన్ తాత్కాలికంగా బ్రేక్ వేసిన సంగతి తెలిసిందే. హుజూరాబాద్ ఉపఎన్నిక పూర్తయ్యేంత వరకు దళితబంధు అమలును నిలిపివేయాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. మీరు అడ్డుతగలండం వల్లే దళిత బంధు నిలిపివేసిందని విమర్శలు చేసుకుంటున్నారు అధికార ప్రతిపక్షాల నాయకులు. దళిత బంధుపై తాను ఏ లేఖ రాయలేదన్నారు ఆర్టీసీ మాజీ చైర్మన్ గోనే ప్రకాష్‌రావు. లేఖ రాసినట్లు నిరూపిస్తే దేనికైనా సిద్ధమేనన్నారు. నిరూపించకపోతే కొప్పుల ఈశ్వర్ మంత్రి పదవికి రాజీనామా చేస్తారా అని సవాల్ విసిరారు. ఈసీకి లేఖ రాశారన్న విమర్శలపై గోనె ప్రకాష్ రావు మండిపడ్డారు.
ఇదిలావుంటే.. దళితబంధు పథకాన్ని నిలిపివేయడంలో రాజకీయ కుట్ర ఉందని మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ పథకాన్ని నిలిపివేయడం దళితజాతికి జరిగిన అన్యాయంగా భావించాలని అన్నారు. దళితబంధు పథకాన్ని ఆపాలని బీజేపీ నేతలు ఈసీకి ఎందుకు లేఖ రాశారని ప్రశ్నించారు. ఈ పథకాన్ని హుజూరాబాద్ ఉపఎన్నిక కోసం తీసుకురాలేదని చెప్పారు. దళితబంధు పథకాన్ని ఈసీ ఆపివేయడానికి ఈటల రాజేందర్ బాధ్యత వహించాలని అన్నారు. కొనసాగుతున్న పథకాన్ని ఆపివేయడం చరిత్రలో ఎప్పుడూ జరగలేదని చెప్పారు. రాజకీయ ఒత్తిడితోనే ఈసీ ఈ నిర్ణయం తీసుకున్నట్టు స్పష్టంగా అర్థమవుతోందని తెలిపారు మంత్రి కొప్పుల ఈశ్వర్.
ఇవి కూడా చదవండి: Sirimanu Utsavam: నేడు పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం.. లక్షలాదిగా తరలిరానున్న భక్తులు..
Chanakya Niti: ఇలాంటి శత్రువులతో జాగ్రత సుమీ.. అలాంటివారి పట్ల ఏమరపాటు అసలే వద్దు..