Nakka Anandababu: మీడియా సమావేశంలో మాట్లాడితే అర్థరాత్రి ఇళ్లకొచ్చి అరెస్టులా? చినరాజప్ప ఆగ్రహం
ముఖ్యమైన అంశాలపై మీడియా ముందుకొచ్చి మాట్లాడితే అర్థరాత్రి ఇళ్లకు వచ్చి అరెస్టులు చేస్తారా అని మండిపడ్డారు టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు,
China Rajappa – Nakka Anandababu: ముఖ్యమైన అంశాలపై మీడియా ముందుకొచ్చి మాట్లాడితే అర్థరాత్రి ఇళ్లకు వచ్చి అరెస్టులు చేస్తారా అని మండిపడ్డారు టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప. మాదకద్రవ్యాల వ్యవహారంపై టీడీపీ నేత ఆనందబాబు మీడియా సమావేశంలో మాట్లాడితే అర్థరాత్రి పోలీసులు ఇంటికి రావడంపై రాజప్ప మండిపడ్డారు. పోలీసులు నర్సీపట్నం నుంచి గుంటూరు రావడంపై ఆయన మరింత ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
ఇదే తరహాలో అన్నింట్లో ఇంత మెరుపు వేగంగా పోలీసులు స్పందిస్తే బాగుండునని రాజప్ప ఏపీ సర్కారుకు, పోలీసులకు చురకలంటించే ప్రయత్నం చేశారు. పక్కనున్న ఏజెన్సీ ప్రాంతంలో గంజాయి సాగు జరుగుతుంటే అక్కడికి వెళ్లే తీరికలేని పోలీసులు… ఆనంద బాబుకు నోటీసులు ఇవ్వడానికి మాత్రం నర్సీపట్నం నుంచి గుంటూరు ఆగమేఘాలమీద వచ్చారని రాజప్ప ఆగ్రహం వ్యక్తం చేశారు. అత్యాచారాలు, దళితులపై దాడులు జరిగితే మాత్రం పోలీసులు స్పందించరని రాజప్ప ఆగ్రహం వ్యక్తం చేశారు
కాగా, మాజీ మంత్రి నక్కా ఆనందబాబు నిన్న విలేకరులతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో గంజాయి దందా యథేచ్ఛగా సాగుతోందని ఆరోపించారు. ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన విశాఖపట్టణం పోలీసులు నోటీసులు ఇచ్చేందుకు గత అర్ధరాత్రి గుంటూరు వచ్చారు. గంజాయి ఏయే ప్రాంతాల్లో దొరుకుతుందో ఆధారాలు ఇవ్వాలంటూ నోటీసులు ఇవ్వాలని ప్రయత్నించారు. నోటీసులు తీసుకునేందుకు నిరాకరించిన టీడీపీ నేత పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడు దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్న తాను ఇలాంటి పరిస్థితిని ఎప్పుడూ చూడలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
Read also: Bandi Sanjay: నైతిక బాధ్యత వహిస్తూ కేసీఆర్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలి: బండి సంజయ్