Akkineni: అక్కినేని అభిమానుల సంబరాలు.. సూపర్ హిట్స్ అందుకున్న అఖిల్- నాగచైతన్య..

ఈ ఏడాది అక్కినేని ఫ్యామిలీలో రెండు విజయాలు పడ్డాయి. నాగచైతన్య గత కొంత కాలంగా వైవిధ్యమైన పాత్రలను ఎంచుకుంటూ మంచి విజయాలను అందుకుంటున్నారు.

Akkineni: అక్కినేని అభిమానుల సంబరాలు.. సూపర్ హిట్స్ అందుకున్న అఖిల్- నాగచైతన్య..
Akkineni
Follow us
Rajeev Rayala

|

Updated on: Oct 19, 2021 | 2:59 PM

Akkineni: ఈ ఏడాది అక్కినేని ఫ్యామిలీలో రెండు విజయాలు పడ్డాయి. నాగచైతన్య గత కొంత కాలంగా వైవిధ్యమైన పాత్రలను ఎంచుకుంటూ మంచి విజయాలను అందుకుంటున్నారు. మజిలీ సినిమా తర్వాత నుంచి నటనకు ప్రాధాన్యత ఇస్తున్నాడు చైతన్య. ఈ క్రమంలోనే శేఖర్ కమ్ముల దర్శకత్వంలో లవ్ స్టోరీ అనే సినిమా చేశాడు. ఈ సినిమాలో సాయిపల్లవి హీరోయిన్‌గా నటించింది. అందమైన ప్రేమ కథతో పాటు.. అద్భుతమైన సందేశంతో తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమాలో తెలంగాణ కుర్రాడిగా చైతన అద్భుతంగా నటించాడనే చెప్పాలి. ఇక కరోనా సెకండ్ వేవ్ తర్వాత విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోవడమే కాకుండా వసూళ్లు కూడా బాగానే రాబట్టింది. ఇక అన్న బాటలోనే నడిచాడు తమ్ముడు అఖిల్ కూడా.. ఎప్పటి నుంచో వాయిదా పడుతూ వస్తున్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ కూడా ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో బుట్టబొమ్మ పూజాహెగ్డే హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకూడా భారీ విజయాన్ని అందుకుంది. అఖిల్ చాలా కాలంగా సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఎట్టకేలకు ఈ సినిమాతో ఫస్ట్ సక్సెస్ అందుకున్నాడు అఖిల్. ఆకట్టుకునే కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ సినిమా సక్సెస్ అవడంతోపాటు నటుడిగా అఖిల్‌ను మరో మెట్టు పైకి ఎక్కించింది. ఇలా అక్కినేని ఫ్యామిలీకి ఈ ఏడాది రెండు విజయాలు దక్కాయి. దాంతో ఫ్యాన్స్ ఖుషి చేసుకుంటున్నారు. ఇక ఇప్పుడు నాగచైతన్య విక్రమ్ కుమార్ దర్శకత్వంలో థాంక్యూ అనే సినిమా చేస్తున్నాడు. అలాగే అఖిల్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఏజెంట్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ రెండు సినిమాలు ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్నాయి. అలాగే నాగార్జున అటు బిగ్ బాస్‌తో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాతో పాటు కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో బంగార్రాజు అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో నాగచైతన్య కూడా కీలక పాత్రలో నటిస్తున్నాడు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Bigg Boss 5 Telugu: హౌజ్‌లో హీట్‌ పెంచిన ఎలిమినేషన్‌ ప్రక్రియ.. కెప్టెన్సీ టాస్క్‌ కోసం బిగ్‌బాస్‌ కొత్త ఆట షురూ.!

Heroine Pranitha: మత్తు ఎక్కించే ఫోజుల్లో ఆకట్టుకుంటున్న అందంతో ఎట్రాక్ట్ చేస్తున్న ‘ప్రణీత’ ఫొటోస్…

Manike Mage Hithe: బాలీవుడ్‌లోకి అడుగు పెట్టనున్న యొహాని…’థ్యాంక్‌ గాడ్’ మూవీలో ఛాన్స్‌ !

క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?
కొత్త ఏడాది పైనే ఫ్లాప్ హీరోయిన్ల ఆశలు.. ఇప్పుడైన కలిసొచ్చేన
కొత్త ఏడాది పైనే ఫ్లాప్ హీరోయిన్ల ఆశలు.. ఇప్పుడైన కలిసొచ్చేన
నీయవ్వ తగ్గేదేలే.. పుష్పరాజ్‌లా పోజులిచ్చిన స్టార్ హీరోయిన్ డాటర్
నీయవ్వ తగ్గేదేలే.. పుష్పరాజ్‌లా పోజులిచ్చిన స్టార్ హీరోయిన్ డాటర్
వీళ్లు బాదంపప్పును పొరపాటున కూడా తినకూడదు.. దూరంగా ఉంటేనే ఆరోగ్యం
వీళ్లు బాదంపప్పును పొరపాటున కూడా తినకూడదు.. దూరంగా ఉంటేనే ఆరోగ్యం
హీరో ఆది పినిశెట్టి భార్య ఫేమస్ హీరోయిన్ తెలుసా.. ?
హీరో ఆది పినిశెట్టి భార్య ఫేమస్ హీరోయిన్ తెలుసా.. ?