Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP Politics: పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా ఏపీ రాజకీయాలు.. ఎవ్వరేమి తక్కువ కాదన్నట్లు రచ్చ రచ్చ..!

AP Politics: తమిళనాడు రాజకీయాలను తలదన్నే విధంగా ఏపీ రాజకీయాలు ఉంటున్నాయి. ఎవ్వరు కూడా తక్కేవేం కాదన్నట్లు కొనసాగుతున్నాయి ఏపీ పాలిటిక్స్‌..

AP Politics: పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా ఏపీ రాజకీయాలు.. ఎవ్వరేమి తక్కువ కాదన్నట్లు రచ్చ రచ్చ..!
Follow us
Subhash Goud

|

Updated on: Oct 20, 2021 | 12:59 PM

AP Politics: తమిళనాడు రాజకీయాలను తలదన్నే విధంగా ఏపీ రాజకీయాలు ఉంటున్నాయి. ఎవ్వరు కూడా తక్కేవేం కాదన్నట్లు కొనసాగుతున్నాయి ఏపీ పాలిటిక్స్‌. అటు టీడీపీ, ఇటు వైసీపీ నేతల మధ్య రోజుకో రచ్చ జరుగుతోంది. ఇరు పార్టీల మధ్య బూతు పురాణం కొనసాగుతోంది. అసలు విషయాలు పక్కనబెట్టి పనికి రాని విషయాలపై రచ్చ చేసుకుంటున్నారు. వైసీపీ నేతలు, టీడీపీ నేతలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు.

టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి చేసిన వ్యాఖ్యలే ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో కుంపటి పెట్టాయి. పట్టాభి చేసిన వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో ఊగిపోయిన వైసీపీ కార్యకర్తలు కర్రలకు పని చెప్పారు. పట్టాభి ఇంటిపై దాడికి దిగారు. ఇంట్లో ఉన్న ఫర్నిచర్స్‌ అన్ని కూడా ధ్వంసం చేశారు. అంతేకాదు.. అటు కేంద్ర, రాష్ట్ర టీడీపీ కార్యాలయాలపై కూడా దాడులకు తెగబడ్డారు. కార్యాలయంలో ఉన్న ఫర్నిచర్స్‌, అద్దాలు, కుర్చీలన్నీ ధ్వంసం చేశారు. అయితే పట్టాభి ఆ వ్యాఖ్యలు చేసిన వెంటనే ఎన్నో ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి. ముఖ్యమంత్రి పదవిని గౌరవిస్తూ పార్టీ తరుపున క్షమాపణ చెప్పాలి. కానీ చంద్రబాబు అది చేయకపోగా వైసీపీ నేతలు తమను ఎన్ని మాటలు అన్నారని ఎదురు ప్రశ్నించడంతో పార్టీ నేతల నోళ్లు మరింతగా తెరుచుకున్నట్లయింది. సభ్యసమాజం తలదించుకునే విధంగా ఒక ముఖ్యమంత్రిపై వ్యాఖ్యలు చేయడం సరైంది కాదని తనను తాను ప్రశ్నించుకోలేకపోయారు చంద్రబాబు.

పోలీసులను అని ప్రయోజనమేంటి?

అయితే పట్టాభి వ్యాఖ్యలతో కోపం కట్టలు తెంచుకున్న వైసీపీ కార్యకర్తలు.. తమదైన శైలిలో రెచ్చిపోయారు. ఇక వైసీపీ దాడులకు నిరసనగా నేడు రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చింది తెలుగుదేశం పార్టీ. ఇలాంటి విషయాలలో రెండు పార్టీలు కూడా సంయమనం పాటించాల్సి ఉంటుంది. కానీ అలాంటివేమి జరగడం లేదు.

ఇవీ కూడా చదవండి:

AP Politics: రాష్ట్ర రాజకీయాల్లో అగ్గి రాజేసిన పట్టాభి వ్యాఖ్యలు.. చంద్రబాబుపై మంత్రి అవంతి సంచలన వ్యాఖ్యలు..!

AP Bandh Live: ఏపీలో టీడీపీ బంద్‌.. నేతల నిరసన.. ఉద్రిక్తత వాతావరణం.. టీడీపీ-పోలీసుల మధ్య తోపులాట

AP Bandh: చంద్రబాబు 420.. నీ ఆఫీస్‌లో బల్లలు పగిలితే రాష్ట్రపతి పాలన పెట్టాలా..? కొడాలి నాని ఘాటైన వ్యాఖ్యలు

AP Bandh: రాష్ట్ర ప్రభుత్వం, పోలీసుల ప్రోత్సాహంతోనే విధ్వంసాలు.. సంచలన వ్యాఖ్యలు చేసిన యనమల