Breaking: టీడీపీ నేతలపై హత్యాయత్నం కేసు నమోదు.. ఏ1గా నారా లోకేశ్
ఏపీలో పొలిటికల్ హీట్ పీక్స్‌కు చేరింది. ముఖ్యమంత్రి జగన్‌పై పట్టాభి వ్యాఖ్యలతో వైసీపీ శ్రేణుల్లో ఆగ్రహావేశాలు పెల్లుబికాయి.
ఏపీలో పొలిటికల్ హీట్ పీక్స్‌కు చేరింది. ముఖ్యమంత్రి జగన్‌పై పట్టాభి వ్యాఖ్యలతో వైసీపీ శ్రేణుల్లో ఆగ్రహావేశాలు పెల్లుబికాయి. ఇక మంగళవారం టీడీపీ కార్యాలయాలపై కొందరు దాడులు చేయడంతో.. పరిస్థితి మరింత చేయి దాటింది. ఈ క్రమంలో టీడీపీ నేడు ఏపీ బంద్‌కు పిలుపునిచ్చింది. కాగా తాజాగా మంగళవారం దాడికి సంబంధించి మరో అప్‌డేట్ అందుతోంది. నిన్న టీడీపీ కార్యాలయానికి వచ్చిన సీఐ నాయక్‌పై దాడి చేశారంటూ టీడీపీ నేతలపై కేసు నమోదయ్యింది. మంగళగిరి పోలీస్ స్టేషనులో కేసు ఫైల్ చేశారు పోలీసులు. ఏ1గా లోకేష్, ఏ2గా అశోక్ బాబు, ఏ3గా ఆలపాటి రాజా, ఏ4గా తెనాలి శ్రావణ్‌లను పేర్కొన్నారు. హత్యాయత్నం సహా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. నిన్న టీడీపీ ఆఫీస్‌పై కొందరు కార్యకర్తల దాడి తర్వాత అక్కడికి వెళ్లిన సీఐ నాయక్‌పై దాడి చేసిన కేసులో ఈ నలుగురు నేతలపై హత్యాయత్నం, ఎస్సీ, ఎస్టీ ఎట్రాసిటీ కేసు నమోదైంది.
అసలు ఎవరీ సీఐ నాయక్ అన్నది మంగళవారం టీడీపీ నేతలే చూపించారు. అతనికి, టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడికి సంబంధం ఉందంటూ టీడీపీ నేత అశోక్‌బాబు అతని మాస్క్ తీయించి మరీ చూపించారు. టీడీపీ వైసీపీల మధ్య మాటల యుద్ధం.. మంటలుగా మారి.. ఇరు వర్గాల మధ్య సంఘర్షణ చెలరేగి.. బంద్‌లు, నిరసనలు, ధర్నాలు హౌస్ అరెస్టుల వరకూ వెళ్లింది. ఇది మున్ముందు ఇంకెన్ని టర్న్స్ తీసుకుంటుందో అని సామాన్య ప్రజల్లో ఆందోళన నెలకుంది.
లోకేశ్‌పై వల్లభనేని వంశీ సెటైర్లు
అసలు టీడీపీ ఎవరిదంటూ ప్రశ్నించారు వల్లభనేని వంశీ. చంద్రబాబుపై ఘాటు విమర్శలు చేశారాయన. ఈ తరహా రెచ్చగొట్టడాలు, బూతులు తిట్టించడాలు ఆయనకు అలవాటే అన్నారు. నారా లోకేష్ పాలు, పెరుగు, తోటకూర అమ్ముకుని బతకాల్సిందేనన్నారు ఎమ్మెల్యే వల్లభనేని వంశీ.
టీడీపీ క్షమాపణలు చెప్పాల్సిందే…
పట్టాభి ఉపయోగించిన పదం అర్ధం మీకు తెలుసా? కన్నతల్లులను అవమానించినట్టు.. ఇలాంటి పదజాలం తాము వాడలేమనీ.. తమ నాయకుడు అది నేర్పించలేదనీ.. పట్టాభి అన్న మాటలకు క్షమాపణలు చెప్పి తీరాల్సిందే అంటున్నారు వైసీపీ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి.
Also Read: పట్టాభి దూషణలపై, టీడీపీ కార్యాలయాలపై దాడులపై స్పందించిన సీఎం జగన్
టీడీపీని బ్యాన్ చేయాలని ఈసీని కొరతాం.. బొత్స సంచలన వ్యాఖ్యలు