Botsa Satyanarayana: టీడీపీని బ్యాన్ చేయాలని ఈసీని కొరతాం.. బొత్స సంచలన వ్యాఖ్యలు

ఏపీలో టీడీపీ వెర్సస్ వైసీపీ వార్ కొనసాగుతోంది. ఆంధ్రాలో ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి. సీఎంపై టీడీపీ నేత పట్టాభి వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. 

Botsa Satyanarayana: టీడీపీని బ్యాన్ చేయాలని ఈసీని కొరతాం.. బొత్స సంచలన వ్యాఖ్యలు
Botsa Satyanarayana
Follow us
Ram Naramaneni

|

Updated on: Oct 20, 2021 | 12:21 PM

ఏపీలో టీడీపీ వెర్సస్ వైసీపీ వార్ కొనసాగుతోంది. ఆంధ్రాలో ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి. సీఎంపై టీడీపీ నేత పట్టాభి వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి.  అనంతరం టీడీపీ కార్యలయాలపై కొందరు దాడులకు పాల్పడ్డారు. ఈ క్రమంలో ప్రతిపక్ష నేత చంద్రబాబు బుధవారం ఏపీ బంద్‌కు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వైసీపీ, టీడీపీ నేతల మధ్య మాటల యుద్దం కొనసాగుతోంది. మంత్రి బొత్స సంచలన వ్యాఖ్యలు చేశారు. శాంతి భద్రతలను అల్లకల్లోలం చేస్తున్న టీడీపీని నిషేధించాలన్నారు. మావోయిస్టు పార్టీకి, టీడీపీకి తేడా లేదంటూ ఘాటు వ్యాఖ్యలు  చేశారు. మావోయిస్టు పార్టీలా టీడీపీని కూడా నిషేధించాలని ఎలక్షన్ కమిషన్ ని కోరుతామన్నారు. ఈమేరకు లేఖ రాస్తామని తెలిపారు.  ఒక ప్రజాధారణ కలిగి ఉన్న ముఖ్యమంత్రి పట్ల ఇలాంటి భాష వాడుతారా అంటూ ఫైరయ్యారు.  అలాంటి వారిని చంద్రబాబు సమర్ధించడం దారుణమన్నారు.  ఎన్నో ఏళ్లుగా తాము రాజకీయాల్లో ఉన్నామని..  అలాంటి భాషని ఎవరూ మాట్లాడలేదని బొత్స తెలిపారు. నీచమైన రాజకీయాలు చేస్తున్నా చంద్రబాబుకు..  పవన్ కల్యాణ వత్తాసు పలుకుతున్నారన్నారు. పవన్ టీడీపీ నేతల భాషను ఎందుకు ఖండించడం లేదని ప్రశ్నించారు. పవన్, చంద్రబాబు కలిసి ఓ పథకం ప్రకారం రాష్ట్రంలో అశాంతి సృష్టిస్తున్నారని బొత్స ఆరోపించారు. బీజేపీ సోము వీర్రాజు కూడా టీడీపీ నేతల భాషని ఎందుకు ఖండించలేదని ప్రశ్నించారు. ఇలాంటి చర్యలు తమ ప్రభుత్వాన్ని ఏమీ చేయలేవని..  చంద్రబాబు బేషరుతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

Also Read: ఏపీలో టీడీపీ బంద్‌.. పలుచోట్ల ఉద్రిక్తతలు.. ఇప్పటివరకు ఓవరాల్‌ రిపోర్ట్ ఇది

Srikakulam District: చెరువులో స్కూల్ బస్సు బోల్తా.. 8 ఏళ్ల విద్యార్థి దుర్మరణం..