Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

YCP: చంద్రబాబు ప్లాన్‌ ప్రకారం రెచ్చగొడుతున్నారు.. చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి ఫైర్..

ముఖ్యమంత్రి జగన్‌పై పట్టాభి వ్యాఖ్యలు చంద్రబాబే ప్లాన్‌ ప్రకారం చేయించారని వైసీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి ఆరోపించారు. ముఖ్యమంత్రికి ఇద్దరూ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

YCP: చంద్రబాబు ప్లాన్‌ ప్రకారం రెచ్చగొడుతున్నారు.. చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి ఫైర్..
Ycp Mla Gadikota Srikanth R
Follow us
Sanjay Kasula

|

Updated on: Oct 20, 2021 | 11:30 AM

ముఖ్యమంత్రి జగన్‌పై పట్టాభి వ్యాఖ్యలు చంద్రబాబే ప్లాన్‌ ప్రకారం చేయించారని వైసీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి ఆరోపించారు. ముఖ్యమంత్రికి ఇద్దరూ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో టీడీపీ రాజకీయ ఉనికి కోల్పోయిందని శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. బుధవారం ఆయన మీడియా మాట్లాడారు. చంద్రబాబు డైరెక‌్షన్‌లో ఇదంతా జరిగిందని మండిపడ్డారు. ముఖ్యమంత్రిపై కుట్ర ప్రకారమే పట్టాభితో అనుచిత వ్యాఖ్యలు చేయించారని అన్నారు. రాజకీయ పార్టీలు రాజకీయాలు చేసుకోవచ్చు.. కానీ టీడీపీలో ఆ హుందాతనం కరువైందన్నారు శ్రీకాంత్ రెడ్డి. పట్టాభి వ్యాఖ్యలు ఏరకంగా ఉన్నాయో ఆంధ్రప్రదేశ్ ప్రజలు గమనించాలన్నారు.

చంద్రబాబు ఆకస్మికంగా ఏపీకి ఎందుకు వచ్చారు? అంటూ ప్రశ్నించిన శ్రీకాంత్ రెడ్డి.. బాబు వైఖరి దారుణంగా ఉందన్నారు. టీడీపీది వికృత క్రీడ అంటూ మండిపడ్డారు. పట్టాభితో నీచాతి నీచంగా మాట్లాడించారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల్లో కోపం వస్తుందని చంద్రబాబుకు తెలుసు… అయినా పట్టాభి వాడిన పదాలకు అర్థమేమిటో తెలుసా? అంటూ చంద్రబాబును ప్రశ్నించారు. చంద్రబాబు హయాంలో ఎవరిని అడిగినా వెన్నుపోటు, కుట్రే అంటారు. రెండున్నరేళ్లలో సీఎం జగన్‌ ఎన్నో ప్రజా సంక్షేమ పథకాలు అందించారని శ్రీకాంత్‌రెడ్డి గుర్తు చేశారు.

సీఎం జగన్‌ ప్రజాస్వామ్య విలువలు కాపాడుతున్నారు. టీడీపీ నేతలు రెచ్చగొట్టినా సంయమనం పాటించాలని సీఎం ఆదేశించారు. నీచ రాజకీయాలు చేసేదే చంద్రబాబు. పబ్లిసిటీ కోసం ఆయన దేనికైనా తెగిస్తారని ఎద్దేవ చేశారు. సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన పట్టాభి క్షమాపణ చెప్పాలని శ్రీకాంత్‌రెడ్డి డిమాండ్‌ చేశారు.

ఇవి కూడా చదవండి: LPG Gas Booking – WhatsApp: వాట్సాప్‌తో ఓ మెసెజ్‌ చేస్తే చాలు మీ LPG గ్యాస్ సిలిండర్ బుక్ అవుతుంది.. ఎలా చేయాలో తెలుసా..

Online Shopping: భారీ ఆఫర్లు ఉన్నాయని ఆన్‌లైన్ షాపింగ్ చేస్తున్నారా.. అయితే ఈ ఐదు సంగతులు గుర్తుంచుకోండి..