AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CM Jagan: పట్టాభి దూషణలపై, టీడీపీ కార్యాలయాలపై దాడులపై స్పందించిన సీఎం జగన్

ఏపీ నుంచి బ్రేకింగ్ న్యూస్ వచ్చింది. టీడీపీ నేత పట్టాభి తనపై చేసిన వ్యాఖ్యలపై సీఎం జగన్ స్పందించారు.

CM Jagan: పట్టాభి దూషణలపై, టీడీపీ కార్యాలయాలపై దాడులపై స్పందించిన సీఎం జగన్
Cm Jagan
Ram Naramaneni
|

Updated on: Oct 20, 2021 | 12:41 PM

Share

ఏపీ నుంచి బ్రేకింగ్ న్యూస్ వచ్చింది. టీడీపీ నేత పట్టాభి తనపై చేసిన వ్యాఖ్యలపై సీఎం జగన్ స్పందించారు. మంచి పాలనను చూసి కొందరు ఓర్వలేకపోతున్నారని ముఖ్యమంత్రి అన్నారు. టీడీపీ నేతలు మాట్లాడుతోన్న బూతులను గతంలో ఎవరూ మాట్లాడి ఉండరని సీఎం అన్నారు. దారుణమైన, పరుష పదజాలం వాడుతున్నారని చెప్పారు. దారుణమైన బూతులు తిట్టడం వల్ల.. అభిమానులు, ప్రేమించేవాళ్లు తట్టుకోలేకపోవడం వల్ల ఇలాంటి రియాక్షన్ వచ్చిందన్నారు. ప్రతి మాటలోను, ప్రతి రాతలోనూ వక్ర బుద్ది కనిపిస్తుందన్నారు. కావాలని తిట్టించి వైషమ్యాలు రెచ్చగొడుతున్నారని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యవస్థలను మ్యానేజ్ చేస్తున్నారని.. మంచి పనులు జరిగితే జగన్‌కు మంచి పేరు వస్తుందని.. కుటిల డ్రామాలు ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.  వైసీపీ సర్కారుపై ప్రజల ప్రేమను విపక్షం జీర్ణించుకోలేకపోతోందన్నారు. కులాలు, మతాలు మధ్య చిచ్చుపెడుతున్నారని పేర్కొన్నారు. ఇంతటి అన్యాయమైన పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా దేవుని దయ, ప్రజల చల్లని దీవెనలతో  రెండున్నర ఏళ్ల పరిపాలన సంతృప్తికరంగా చేయగలిగానని సీఎం జగన్ చెప్పారు. ఇంకా మంచి చేయడానికి కూడా వెనకాడనన్నారు సీఎం.

“ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నేను ఇలా మాట్లాడలేదు. దారుణమైన, పరుష పదజాలం వాడుతున్నారు. తిట్లు విని భరించలేని అభిమానులు స్పందిస్తున్నారు. కావాలని తిట్టించి వైషమ్యాలు రెచ్చగొడుతున్నారు. వైషమ్యాలు రెచ్చగొట్టి లబ్ది పొందాలనుకుంటున్నార” అని సీఎం జగన్ పేర్కొన్నారు.

Also Read: టీడీపీని బ్యాన్ చేయాలని ఈసీని కొరతాం.. బొత్స సంచలన వ్యాఖ్యలు

Srikakulam District: చెరువులో స్కూల్ బస్సు బోల్తా.. 8 ఏళ్ల విద్యార్థి దుర్మరణం..