Chandrababu Naidu: వేడెక్కుతున్న ఏపీ రాజకీయాలు.. ఢిల్లీకి చంద్రబాబు.. అమిత్ షాతో భేటీకి రెడీ..
Chandrababu Naidu to meet Amit Shah: ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు అట్టుడుకుతున్నాయి. తెలగుదేశం అధికార ప్రతినిధి పట్టాభి వ్యాఖ్యల అనంతరం.. అధికార వైఎస్‌ఆర్‌సీపీ కార్యకర్తలు..
Chandrababu Naidu to meet Amit Shah: ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు అట్టుడుకుతున్నాయి. తెలగుదేశం అధికార ప్రతినిధి పట్టాభి వ్యాఖ్యల అనంతరం.. అధికార వైఎస్‌ఆర్‌సీపీ కార్యకర్తలు.. ప్రతిపక్ష టీడీపీ కార్యాలయాలు, అతని ఇంటిపై దాడి చేసిన సంగతి తెలిసిందే. దీంతోపాటు టీడీపీ కేంద్ర కార్యాలయంపై కూడా వైసీపీ కార్యకర్తలు దాడి చేసి ఫర్నిచర్ ధ్వంసం చేశారు. దీంతో రాష్ట్రంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఈ రోజు బంద్‌కు పిలుపునిస్తూ చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ఏపీలో బంద్ చేస్తున్న టీడీపీ నాయకులను, కార్యకర్తలను పోలీసులు కట్టడి చేస్తున్నారు. ఈ క్రమంలో అధికార, ప్రతిపక్ష నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. కాగా.. వైసీపీ కార్యకర్తల దాడుల అనంతరం తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కేంద్ర మంత్రి అమిత్ షాకు ఫోన్ చేశారు. పక్కా ప్రణాళిక ప్రకారమే దాడులు చేస్తున్నారని.. కేంద్ర బలగాలతో రక్షణ కల్పించాలంటూ కోరారు. పరిస్థితుల గురించి చంద్రబాబు వివరించగా.. దాడి విషయం ఇంకా తన దృష్టికి రాలేదని పార్టీ లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేస్తే తప్పకుండా చర్యలు తీసుకుంటామంటూ అమిత్ షా హామీ ఇచ్చారు.
ఈ క్రమంలోనే చంద్రబాబు నాయుడు ఢిల్లీకి శనివారం వెళ్లనున్నారు. చంద్రబాబుకు అమిత్ షా అపాయింట్మెంట్ ఖరారైంది. 36 గంటల దీక్ష అనంతరం ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి షాను చంద్రబాబు కలిసి వివరించనున్నారు. టీడీపీ కార్యాలయాలపై జరిగిన దాడులపై చంద్రబాబు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయడంతోపాటు.. పరిస్థితుల గురించి వివరించనున్నారు. ఆయనతోపాటు పలువురు నాయకులు కూడా ఢిల్లీకి వెళ్లనున్నారు. కాగా.. “ప్రభుత్వ ఉగ్రవాదంపై పోరు” పేరుతో 21-10-2021 గురువారం ఉదయం 8 గంటల నుంచి 22-10-2021 శుక్రవారం సాయంత్రం 8 గంటల వరకు 36 గంటల పాటు చంద్రబాబునాయుడు గారు కేంద్ర పార్టీ కార్యాలయం వద్ద నిరసన దీక్ష కార్యక్రమం చేపట్టనున్నారు.
Also Read: