AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nara Lokesh: డ్రగ్స్‌కు కేరాఫ్‌ అడ్రస్‌గా ఏపీ.. టైం, ప్లేస్ చెప్పండి మేమే వస్తాం.. సీఎం జగన్‌పై నారా లోకేష్‌ ఫైర్‌

Nara Lokesh Comments: ఏపీ పోలీసుల చేతకానితనం వల్లే రాష్ట్రంలో గంజాయి విపరీతంగా పెరిగిపోయిందని టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పేర్కొన్నారు. రాష్ట్రంలో జరిగిన

Nara Lokesh: డ్రగ్స్‌కు కేరాఫ్‌ అడ్రస్‌గా ఏపీ.. టైం, ప్లేస్ చెప్పండి మేమే వస్తాం.. సీఎం జగన్‌పై నారా లోకేష్‌ ఫైర్‌
Nara Lokesh
Shaik Madar Saheb
|

Updated on: Oct 20, 2021 | 5:46 PM

Share

Nara Lokesh Comments: ఏపీ పోలీసుల చేతకానితనం వల్లే రాష్ట్రంలో గంజాయి విపరీతంగా పెరిగిపోయిందని టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పేర్కొన్నారు. రాష్ట్రంలో జరిగిన పరిణామాల అనంతరం బుధవారం సాయంత్రం ఆయన టీడీపీ కేంద్ర కార్యాలయంలో మాట్లాడారు. ఏపీ డ్రగ్స్‌కు కేరాఫ్‌ అడ్రస్‌గా మారిపోయిందని నారా లోకేష్‌ పేర్కొన్నారు. జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత డ్రగ్స్ లీగల్ అయ్యాయంటూ ఆరోపించారు. ఇదంతా నిలదీసినందుకు దాడులకు పంపుతారా అంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. ధైర్యం ఉంటే నేరుగా రావాలని.. పెంపుడు కుక్కలను పంపుతారా అంటూ లోకేష్‌ పేర్కొన్నారు. అవసరమైతే టైం, ప్లేస్‌ చెప్పాలని తామే ధైర్యంగా వస్తామని లోకేష్‌ సీఎం జగన్‌కు సవాల్‌ విసిరారు. దాడి చేస్తే భయపడమని.. లోకేష్‌ పేర్కొన్నారు. డీజీపీ ఆఫీస్‌ వైపు నుంచే వాహనాలు వచ్చాయని.. లోకేష్‌ పేర్కొన్నారు.

ఓ వైపు దాడులు చేసేవారు ఉంటే.. మరోవైపు పోలీసులు మఫ్టీలో ఉన్నారని పేర్కొన్నారు. దాడులు జరగబోతున్నాయని.. మా నాయకుడు ఫొన్‌ చేసినా స్పందించరా అంటూ లోకేష్‌ డీజీపీపై మండిపడ్డారు. గతలో జగన్‌ చంద్రబాబును ఇష్టంవచ్చినట్లు తిట్టారని.. ఇదంతా గుర్తులేదా అంటూ ప్రశ్నించారు. బూతులు మాట్లాడిన వైసీపీ నాయకులపై చర్యలేవి అంటూ నిలదీశారు. దేశంలో డ్రగ్స్‌ ఎక్కడ దొరికినా ఏపీతో లింక్‌ అయి ఉంటుందని లోకేష్ పేర్కొన్నారు. రాష్ట్రంలో పోలీసుల తీరు దారుణంగా ఉందని లోకేష్‌ అభిప్రాయపడ్డారు.

ప్రశ్నించే వారిని ఈ ప్రభుత్వం ఇబ్బందులు పెడుతోందంటూ లోకేష్ ఫైర్ అయ్యారు. కేంద్ర ప్రభుత్వం ఏపీలో ఎమర్జెన్సీ విధించాలని కోరారు. డీజీపీ, వైసీపీ నేతలు ప్రెస్ మీట్ పెట్టి ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. డీజీపీ ఆఫీస్ సీఐపై దాడి చేయకుండా పంపితే.. మా మీద కేసులు పెట్టారంటూ ఫైర్ అయ్యారు. దీనికి వడ్డీతో సహా చెల్లిస్తామంటూ పేర్కొన్నారు. దేశంలో ఎక్కడా ఉన్నా వదిలిపెట్టమంటూ లోకేష్ పేర్కొన్నారు. ఇది పార్టీ ఆఫీస్ కాదని.. ఒక దేవాలయమని.. అలాంటి ఆలయంపై దాడి చేశారంటూ పేర్కొన్నారు. మా ఓర్పు, సహనాన్ని పరీక్షిస్తున్నాంటూ మండిపడ్డారు. పోలీసులు ఏక పక్షంగా వ్యవహరిస్తున్నారని.. దాడి చేస్తుండగా కొందరు మఫ్టీలో ఉన్నారన్నారు.

డీజీపీ వాస్తవాలు తెలుసుకోవాలని లోకేష్ సూచించారు. దాడి జరిగి 24 గంటలు గడిచింది.. ఒక్కరినీ అరెస్ట్ చేయలేదంటూ ఫైర్ అయ్యారు. గతంలో సవాంగ్ పోస్టింగ్ కోసం చంద్రబాబుకి ఎన్నోసార్లు ఫోన్ చేశారని.. ఇప్పుడు చంద్రబాబు ఫోన్ చేస్తే మాట్లాడరంటూ పేర్కొన్నారు. అధికారం శాశ్వతం కాదు.. మళ్లీ టీడీపీ అధికారంలోకి వస్తుందంటూ పేర్కొన్నారు.

Also Read: AP Politics: మేమేం తక్కువ కాదన్నట్లు.. ఏపీ రాజకీయ దాడులపై సంచలన వ్యాఖ్యలు చేసిన బీజేపీ మాజీ మంత్రి..!

Chandrababu Naidu: వేడెక్కుతున్న ఏపీ రాజకీయాలు.. ఢిల్లీకి చంద్రబాబు.. అమిత్‌ షాతో భేటీకి రెడీ..