AP Weather Updates: ఏపీకి రెయిన్ అలర్ట్.. మరో మూడు రోజులపాటు వర్షాలు: వాతావరణ శాఖ
Andhra Pradesh Weather Updates: నైరుతి రుతుపవనాల తిరోగమనం దృష్ట్యా దేశంలోని పలు ప్రాంతాల్లో ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తున్నాయి. 23వ తేదీ నాటికి నైరుతి రుతుపవనాలు తిరోగమించడానికి
Andhra Pradesh Weather Updates: నైరుతి రుతుపవనాల తిరోగమనం దృష్ట్యా దేశంలోని పలు ప్రాంతాల్లో ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తున్నాయి. 23వ తేదీ నాటికి నైరుతి రుతుపవనాలు తిరోగమించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. అక్టోబర్ 26న బంగాళాఖాతం, దక్షిణ ద్వీపకల్ప భారతదేశంలలో ఈశాన్య గాలులు వీచే అవకాశం ఉన్నందువలన నైరుతి రుతుపవనాలు మొత్తం దేశం నుంచి తిరోగమించుకునే అవకాశాలున్నట్లు తెలిపింది. అదే సమయంలో ఈశాన్య రుతుపవనాలు భారతదేశంలోని ఆగ్నేయ ద్వీపకల్పంలో ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో తిరోగమన రేఖ.. ఉత్తర భారతంలోని కొన్ని ప్రాంతాల నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల మీదుగా కొనసాగుతుందని.. దీని దృష్ట్యా ఏపీలోని పలు ప్రాంతాల్లో మూడు రోజుల పాలు వర్షాలు కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ శాఖ వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ పరిస్థితులను అమరావతి వాతావరణ కేంద్రం బుధవారం వెల్లడించింది.
ఉత్తర కోస్తా ఆంధ్ర, యానాం: ఈరోజు ఉత్తర కోస్తాఆంధ్రాలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. రేపు, ఎల్లుండి ఉత్తర కోస్తాఆంధ్రాలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు, ఒకటి లేక రెండు ప్రదేశాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
దక్షిణ కోస్తా ఆంధ్ర: ఈ రోజు దక్షిణ కోస్తాఆంధ్రాలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. రేపు, ఎల్లుండి దక్షిణ కోస్తాఆంధ్రాలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేక రెండు ప్రదేశములలో కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం తెలిపింది.
రాయలసీమ: ఈరోజు రాయలసీమలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేక రెండు ప్రదేశములలో కురిసే అవకాశం ఉంది. రేపు రాయలసీమలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేక రెండు ప్రదేశాల్లో కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి రాయలసీమలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేక రెండు ప్రదేశాల్లో కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం సంచాలకులు తెలిపారు.
Also Read: