Virat Kohli: విరుష్క ఫ్యాన్స్‌కు మరోసారి నిరాశే.. ఫ్యామిలీ ఫొటోలో వామికా ఫేస్ మిస్.. ఇంకెన్నాళ్లు దాచిపెడతారంటూ కామెంట్లు

Virushka: భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ బుధవారం ట్విట్టర్‌లో తన భార్య అనుష్క శర్మ, కుమార్తె వామికతో కలిసి ఉన్న ఒక అందమైన ఫోటోను పంచుకున్నారు.

Virat Kohli: విరుష్క ఫ్యాన్స్‌కు మరోసారి నిరాశే.. ఫ్యామిలీ ఫొటోలో వామికా ఫేస్ మిస్.. ఇంకెన్నాళ్లు దాచిపెడతారంటూ కామెంట్లు
Virat Kohli And Anushka Sharma
Follow us
Venkata Chari

|

Updated on: Oct 20, 2021 | 1:56 PM

Vamika Photos: భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ బుధవారం ట్విట్టర్‌లో తన భార్య అనుష్క శర్మ, కుమార్తె వామికతో కలిసి ఉన్న ఒక అందమైన ఫోటోను పంచుకున్నారు. ఫోటోలో, కోహ్లీ, అనుష్క నవ్వుతూ ఉండడం చూడొచ్చు. దుబాయ్‌లో వీరిద్దరూ కుమార్తెతో కలిసి టిఫిన్ చేస్తున్నట్లు ఫొటోలో కనిపిస్తోంది. రెడ్ హార్ట్ ఎమోజీతో కోహ్లీ పోస్ట్‌కు క్యాప్షన్ ఇచ్చారు. టీ 20 వరల్డ్ కప్ కోసం భారత కెప్టెన్ యూఏఈలో ఉన్న సంగతి తెలిసిందే. అనుష్క కూడా ఇటీవల యూఏఈలో క్వారంటైన్‌లో ఉన్నప్పటి నుంచి కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఫొటోలోను వామికా ముఖం కనిపించకపోవడంతో అభిమానులు నిరుత్సాహానికి గురవుతున్నారు. ఇప్పటి వరకు విరుష్కలు తమ కుమార్తె ముఖాన్ని చూపించలేదు.

రెండు నెలల క్రితం ఫ్యామిలీతో కలిసి ఇంగ్లండ్ వెళ్లిన టీమిండియా క్రికెటర్లు.. అక్కడి నుంచి నేరుగా ఐపీఎల్ కోసం దుబాయ్ చేరుకున్నారు. ఐపీఎల్ 2021 అనంతరం ప్రస్తుతం అక్కడే జరుగుతోన్న టీ20 ప్రపంచ కప్ 2021 కోసం మరోసారి క్వారంటైన్‌లోనే ఉంటున్నారు. ఇన్నాళ్లుగా క్రికెటర్లతోనే ప్రయాణిస్తున్న ఫ్యామిలీ సభ్యులు.. క్వారంటైన్‌లోనే సరదాగా గడుపుతూ ఫొటోలను నెట్టింట్లో పంచుకుంటున్నారు.

ఇక సోమవారం జరిగిన తొలి వార్మప్ మ్యాచ్‌లో టీమిండియా 7 వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌పై విజయం సాధించింది. ఇందులో కోహ్లీ భారీ స్కోరు చేయలేకపోయాడు. యువ ఆటగాడు ఇషాన్ కిషన్ 70 పరుగులతో ఆకట్టుకున్నాడు. అతనికి కేఎల్ రాహుల్ కూడా బాగా అండగా నిలిచాడు. కేఎల్ రాహుల్ అర్ధ సెంచరీతో అలరించాడు. 189 పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన భారత్.. నేడు రెండో వార్మప్ మ్యాచులో ఆస్ట్రేలియాతో తలపడనుంది. అయితే ఈమ్యాచులో రోహిత్ శర్మ ఆడే అవకాశం ఉంది.

దుబాయ్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై తమ ప్రయాణాన్ని ప్రారంభించే ముందు ఆస్ట్రేలియాతో చివరి వార్మప్ గేమ్‌లో లోపాట్లను అధిగమించాలని భారత్ యోచిస్తోంది.టీ 20 ప్రపంచకప్ పూర్తయిన తర్వాత ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఫ్రాంచైజీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్‌గా ఇప్పటికే వైదొలిగిన కోహ్లీ, టీ20 ఫార్మాట్‌లో కెప్టెన్‌గా వైదొలగనున్న సంగతి తెలిసిందే.

Also Read: T20 World Cup: మ్యాచ్ జరగాల్సిందే.. యువకులు రాణిస్తే ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు.. దాయాదుల పోరుపై కపిల్ కీలక వ్యాఖ్యలు

T20 World Cup 2021: ఆకట్టుకున్న ఒమన్ ఫాస్ట్ బౌలర్.. కళ్లు చెరిదే క్యాచ్‌తో బంగ్లాకు షాక్.. 11 ఏళ్ల క్రితం భారత్‌ను కూడా బోల్తాకొట్టించాడు..!

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!