AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rohit Sharma: టీ20లకు కొత్త కెప్టెన్‌గా రోహిత్ శర్మ.? వరల్డ్‌కప్ తర్వాత అఫీషియల్ ప్రకటన.!

టీ20 ప్రపంచకప్ అనంతరం కెప్టెన్సీ బాధ్యతల నుంచి విరాట్ కోహ్లీ తప్పుకోనుండటంతో.. అతడి స్థానాన్ని ఎవరి భర్తీ చేస్తారన్న చర్చ..

Rohit Sharma: టీ20లకు కొత్త కెప్టెన్‌గా రోహిత్ శర్మ.? వరల్డ్‌కప్ తర్వాత అఫీషియల్ ప్రకటన.!
Rohit Sharma
Ravi Kiran
|

Updated on: Oct 22, 2021 | 9:31 PM

Share

టీ20 ప్రపంచకప్ అనంతరం కెప్టెన్సీ బాధ్యతల నుంచి విరాట్ కోహ్లీ తప్పుకోనుండటంతో.. అతడి స్థానాన్ని ఎవరి భర్తీ చేస్తారన్న చర్చ సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున జరుగుతోంది. కొంతమంది రోహిత్ శర్మ అంటుంటే.. మరికొందరు కెఎల్ రాహుల్ అని.. ఇంకొందరు రిషబ్ పంత్ అని.. కామెంట్స్ చేస్తున్నారు. ఈ తరుణంలో తాజాగా ఓ వార్త నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఒక విధంగా చెప్పాలంటే హిట్‌మ్యాన్ ఫ్యాన్స్‌కు ఇది గుడ్ న్యూస్ అని చెప్పాలి.

టీ20 వరల్డ్‌కప్ తర్వాత టీమిండియా స్టార్ ఓపెనర్, హిట్‌మ్యాన్ రోహిత్ శర్మకు టీ20ల్లో కెప్టెన్సీ బాధ్యతలను అప్పగించనున్నట్లు బీసీసీఐ అధికారి ఒకరు Inside Sport అనే జాతీయ స్పోర్ట్స్ వెబ్‌‌సైట్‌తో జరిగిన ఓ ఇంటర్వ్యూ‌లో వెల్లడించారు. ”ఇందులో రహస్యం ఏం లేదు. లీడర్‌షిప్ రేసులో రోహిత్ శర్మ ఖచ్చితంగా ఉన్నాడు. టీ20 ప్రపంచకప్ అనంతరం రోహిత్ శర్మ కెప్టెన్సీ పగ్గాలు చేపట్టనున్నాడు. ప్రపంచకప్ అనంతరం అధికారిక ప్రకటన ఉంటుంది” అని ఆయన పేర్కొన్నారు.

కాగా, ఐపీఎల్‌లో రోహిత్ శర్మకు కెప్టెన్‌గా గొప్ప రికార్డు ఉందని చెప్పాలి. ముంబై ఇండియన్స్ టీంకు సారధ్యం వహిస్తున్న రోహిత్.. ఐదు సార్లు ఐపీఎల్ ట్రోఫీని గెలుచుకున్నాడు. అంతేకాకుండా ఛాంపియన్స్ లీగ్ టీ20లో కూడా రెండుసార్లు ట్రోఫీ దక్కించుకున్నాడు. ఇక విరాట్ కోహ్లీ.. టీమిండియా తరపున టెస్టులు, వన్డేలకు సారధిగా వ్యవహరించనున్నాడు.

Also Read:

Follow Us
మాజీ రక్షణ మంత్రులకు మరణశిక్ష విధించిన కోర్టు!
మాజీ రక్షణ మంత్రులకు మరణశిక్ష విధించిన కోర్టు!
రియాన్ పరాగ్ తర్వాత చహల్ వంతు.. ఐపీఎల్‌లో మళ్ళీ స్మోకింగ్ సెగలు
రియాన్ పరాగ్ తర్వాత చహల్ వంతు.. ఐపీఎల్‌లో మళ్ళీ స్మోకింగ్ సెగలు
మోదీకి ఇష్టమైన స్ట్రీట్ ఫుడ్.. కేవలం 5 నిమిషాల్లో ఇలా చేసుకోండి
మోదీకి ఇష్టమైన స్ట్రీట్ ఫుడ్.. కేవలం 5 నిమిషాల్లో ఇలా చేసుకోండి
డీమార్ట్‌లో ఇలా షాపింగ్ చేస్తే రూ. 3 వేలు గ్యారంటీగా ఆదా
డీమార్ట్‌లో ఇలా షాపింగ్ చేస్తే రూ. 3 వేలు గ్యారంటీగా ఆదా
NEET UG 2026 ఆన్సర్‌ కీ విడుదల.. ఈసారి భారీగా పెరగనున్న కటాఫ్‌
NEET UG 2026 ఆన్సర్‌ కీ విడుదల.. ఈసారి భారీగా పెరగనున్న కటాఫ్‌
కొడుకు సమాధి వద్ద వెక్కి వెక్కి ఏడ్చిన టాలీవుడ్ హీరోయిన్.. వీడియో
కొడుకు సమాధి వద్ద వెక్కి వెక్కి ఏడ్చిన టాలీవుడ్ హీరోయిన్.. వీడియో
Kuja Gochar: ఆ రాశుల వారికి ధన యోగం, అదృష్టం డబుల్..!
Kuja Gochar: ఆ రాశుల వారికి ధన యోగం, అదృష్టం డబుల్..!
పళ్లురాని పసిపిల్లలు కూడా తినే పల్లెటూరి వంటకం నూకలపాయసం
పళ్లురాని పసిపిల్లలు కూడా తినే పల్లెటూరి వంటకం నూకలపాయసం
చల్లని ఏసీ వెనుక దాగిన ఆరోగ్య సమస్యలు.. తెలుసుకోవాల్సిన నిజాలు
చల్లని ఏసీ వెనుక దాగిన ఆరోగ్య సమస్యలు.. తెలుసుకోవాల్సిన నిజాలు
మీ కూలర్‌ నీటిలో ఇదొక్కటి వేస్తే చాలు.. ఏసీ లాంటి కూలింగ్‌
మీ కూలర్‌ నీటిలో ఇదొక్కటి వేస్తే చాలు.. ఏసీ లాంటి కూలింగ్‌