ఆ ఇంటివారికి పెరట్లోకి వెళ్లాలంటే భయం.. తలకు హెల్మెట్‌ పెట్టాల్సిందే.. కారణం తెలిస్తే నవ్వాపుకోలేరు..

ఆ ఇంటి పెరట్లోకి వెళ్లాలంటే అందరికీ హడల్. పెరట్లో పిల్లలు స్నానం చేయాలన్నా, బట్టలు ఉతకాలన్నా... హెల్మెట్ లేనిదే...

ఆ ఇంటివారికి పెరట్లోకి వెళ్లాలంటే భయం.. తలకు హెల్మెట్‌ పెట్టాల్సిందే.. కారణం తెలిస్తే నవ్వాపుకోలేరు..
Viral

ఆ ఇంటి పెరట్లోకి వెళ్లాలంటే అందరికీ హడల్. పెరట్లో పిల్లలు స్నానం చేయాలన్నా, బట్టలు ఉతకాలన్నా… హెల్మెట్ లేనిదే ఆ ఇంటివాళ్లు పెరట్లోకి వెళ్లలేకపోతున్నారు. ఇంతకీ ఆ ఇంటి జనాలు భయపెడుతున్నది ఏంటో తెలుసా.? ఓ పిట్ట.. వాళ్లను ఆ పిట్ట ఎందుకు భయపెడుతుంది.? అసలు ఆ కథేంటి.? ఇప్పుడు చూద్దాం..

నల్లగొండ జిల్లా నకిరేకల్‌లో నివాసముంటున్న ఉమారాణి, వెంకన్న దంపతులు.. తమ ఇంట్లో ఉన్న పిల్లలతోనే కాదు పిట్టతో కూడా వేగలేకపోతున్నారు. ఎందుకని అనుకుంటున్నారా.! వాళ్ల ఇంటి పెరట్లో ఓ అరటి చెట్టు ఉంది. అది మంచిగా గెల వేసింది. రెండు అరటి కాయలు కోయడానికి వెళ్లిన ఉమారాణి అరటి గెలపై ఉన్న పిట్ట గూడును చూసింది. జాలిపడి ఆ గూడును తీసి వేయకుండా అలాగే ఉంచారు. ఆ పిట్ట కాస్త దాంట్లో గుడ్లు పెట్టి పొదిగింది. అరటి కాయలు రోజురోజుకీ పెరగటం వల్ల పిట్ట గూడు కింద పడిపోయే అంతగా ఒరిగింది. ఉమారాణి తన భర్తను పిలిచి గూడును సరిచేసి కిందపడకుండా పెట్టించింది. ఇది చూసి ఆందోళన చెందిన పిట్ట తన గూడును తీసేస్తున్నారని అనుకుని పొడవడం మొదలుపెట్టింది.

ఆ ఇంటిలోని సభ్యులు ఎవరైనా కూడా పెరట్లోకి వెళ్తే చాలు.. రెండు పిట్టలు దాడి చేస్తున్నాయి. ఎక్కడ కళ్లలో పొడిస్తే.. కళ్ళు పోతాయోననే భయంతో వాళ్లంతా హెల్మెట్ పెట్టుకొని తిరుగుతున్నారు. పిట్టకు భయపడి హెల్మెట్‌తో తిరగడం ఇరుగు పొరుగువారు చూసి నవ్వుకుంటున్నారు. ఆ పిట్టలు ఎగిరిపోయే వరకు తమకు ఈ బాధలు తప్పవని.. ఆ పిట్టకు తన గూడుపై, గూట్లో ఉన్న పిల్లలపై ప్రేమను చూసి అవి పొడిచినా ఆనందంగా భరిస్తున్నారు ఆ కుటుంబసభ్యులు.

Also Read:

Click on your DTH Provider to Add TV9 Telugu