Viral Video: ఇదేం రసగుల్లా చాట్ రా బాబు..! ట్రోల్ చేస్తోన్న నెటిజన్స్..
పుర్రెకో బుద్ధి..జిహ్వకో రుచి' అన్నట్లు రెగ్యులర్‌గా చేసే వంటకాలు విసుగుతెచ్చాయేమో కానీ ఇటీవల కొందరు వెరైటీ వంటకాలను ప్రయత్నిస్తున్నారు.

‘పుర్రెకో బుద్ధి..జిహ్వకో రుచి’ అన్నట్లు రెగ్యులర్‌గా చేసే వంటకాలు విసుగుతెచ్చాయేమో కానీ ఇటీవల కొందరు వెరైటీ వంటకాలను ప్రయత్నిస్తున్నారు. అంతేకాదు మీరు ఈ వంటకాలను ట్రై చేయండంటూ సోషల్ మీడియాలో వాటిని పోస్ట్ చేస్తున్నారు. దీంతో అవి వైరల్‌గా మారుతున్నాయి. ఇటీవల ఐస్‌క్రీం దోశ, మ్యాగీ మిల్క్‌షేక్ వీడియోలకు ఊహించని స్పందన వచ్చింది. దీంతో రెగ్యులర్ వంటలైనా…కాస్త వెరైటీగా ట్రై చేస్తే చాలని చాలామంది డిఫరెట్ వంటకాలను ట్రై చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అలా ప్రస్తుతం రసగుల్లా చాట్ వీడియో ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది.
ఈ రసగుల్లా చాట్ చూశారా? రసగుల్లా…కలకత్తా ఫేమస్ స్వీట్లలో ఒకటైన దీని గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. దీనిని చూడగానే చాలామందికి నోరూరుతుంది. ఇక చాట్ అంటే సాధారణంగా బంగాళాదుంపలు, పెరుగు, కారప్పూస తదితర పదార్థాలతో తయారుచేస్తారు. అయితే వీటిని వేర్వేరుగా తింటే మజా ఏమందనుకున్నాడేమో రెండింటినీ మిక్స్ చేశాడు ఒక ఘనుడు. సుమారు నిమిషం పాటు నిడివి ఉన్న ఈ వీడియోలో ముందుగా చక్కెర ద్రావణంలో ముంచిన రెండు రసగుల్లాలను ఒక పాత్రలోకి తీసుకున్నాడు. వాటిని మధ్యలో కట్‌చేసి చింతపండు చట్నీ, పెరుగుతో నింపుతాడు. ఆ తర్వాత బాదం, జీడిపప్పు, ఎండు ద్రాక్షలతో గార్నిష్ చేస్తాడు. సర్వ్ చేసేముందు మళ్లీ ఒక గరిటె సహాయంతో చింతపండు చట్నీని రసగుల్లాలపై పోస్తాడు.
ఇదేం వంటకంరా బాబు? ప్రస్తుతం ఈ రసగుల్లా చాట్‌కు సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో తెగ వైరలవుతోంది. నెటిజన్లు ఈ వెరైటీ వంటకంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ‘ఇదేం వంటకంరా బాబు…రసగుల్లాలో ఛాట్‌ను అసలు ఊహించలేదు. ఇలాంటి వెరైటీ వంటకాలతో చంపేయకండిరా బాబు’ అంటూ ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు.
We are doomed. Rasgulla chaat!! pic.twitter.com/tjRZ4lcMVl
— Kaptan Hindustan™ (@KaptanHindostan) October 19, 2021
Viral Video: పంజాబ్‌లో దారుణం.. ప్రశ్నించినందుకు దాడి చేసిన ఎమ్మెల్యే.. వీడియో వైరల్..