T20 World Cup: మ్యాచ్ జరగాల్సిందే.. యువకులు రాణిస్తే ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు.. దాయాదుల పోరుపై కపిల్ కీలక వ్యాఖ్యలు

భారత్, పాకిస్తాన్ జట్లు ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడవు. కాబట్టి, ఐసీసీ టోర్నమెంట్‌లలో ఇరుజట్ల మధ్య పోరు ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంటుంది.

T20 World Cup: మ్యాచ్ జరగాల్సిందే.. యువకులు రాణిస్తే ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు.. దాయాదుల పోరుపై కపిల్ కీలక వ్యాఖ్యలు
Kapil Dev
Follow us
Venkata Chari

| Edited By: Anil kumar poka

Updated on: Oct 23, 2021 | 1:28 PM

T20 World Cup 2021, Ind vs Pak: అంతర్జాతీయ క్రికెట్‌లో భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌లు బహుశా క్రికెట్‌లోనే కాదు.. అన్ని క్రీడల్లోనూ ఎంతో కీలకమైన మ్యాచులుగా పరిగణిస్తారు. ఈ మ్యాచులో భాగమైన ప్లేయర్లు మైదానంలో దాని తీవ్రతను మరింతగా పెంచేస్తుంటారు. టీ 20 వరల్డ్ కప్‌ 2021లో భాగంగా అక్టోబర్ 24న, ఆదివారం జరగబోయే భారత్ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్‌ ప్రస్తుతం చర్చల్లో నిలుస్తోంది. సరిహద్దుల్లో నెలకొన్న ప్రస్తుత సరిస్థితులతో పాకిస్తాన్‌తో ఆడోద్దనే డిమాండ్లు ఎక్కువయ్యాయి. తాజాగా ఈ విషయమై లెజెండరీ ఇండియా ఆల్ రౌండర్ కపిల్ దేవ్ తన అభిప్రాయాలను పంచుకున్నారు.

ఒక కార్యక్రమంలో మాట్లాడిన కపిల్ దేవ్.. రెండు జట్లు ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడవు. కాబట్టి, ఐసీసీ టోర్నమెంట్‌లలో ఇరుజట్ల మధ్య పోరు అభిమానులకు ఎంతో ముఖ్యమైనవి. అలాగే క్రికెట్ ప్రపంచమే ఎంతో ఆసక్తిగా ఈ మ్యాచ్ కోసం ఎదురుచూస్తుంది. “ఇదంతా ఒత్తిడి, ఆనందం మీద ఆధారపడి ఉంటుంది. ఆటను ఆస్వాదిస్తుంటే ఒత్తిడికి లోనవుతున్నారు. ఎక్కువ ఒత్తిడి తీసుకుంటే, కోరుకున్న ప్రదర్శనలు లభించవు” అని కపిల్ దేవ్ తెలిపారు. అంతేకాకుండా, ఒక యువకుడు ఈ కీలక మ్యాచులో బాగా రాణిస్తే.. ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందేందుకు అవకాశం ఉందని ఆయన పేర్కొన్నాడు.

“ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్‌లలో బాగా ఆడితే ఆటగాళ్లకు గుర్తింపు లభిస్తుంది. ఒక యువకుడు ఇలాంటి కీలక మ్యాచులో రాణిస్తే, అతను ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందేందుకు అవకాశం ఉంది. అయితే, ఒక సీనియర్ ఆటగాడు రాణించకపోతే మాత్రం అది అతని ప్రతిష్టను దెబ్బతీస్తుంది” అని కపిల్ దేవ్ తెలిపారు.

టోర్నమెంట్‌లో భాగంగా సోమవారం జరిగిన మొదటి వార్మప్ గేమ్‌లో ఇంగ్లండ్‌ను ఓడించిన టీమిండియా తమ ఉనికిని గుర్తించింది. 20 ఓవర్లలో 189 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. ఇషాన్ కిషన్, కేఎల్ రాహుల్, మహమ్మద్ షమీ రాణించడంతో 6 బంతులు మిగిలి ఉండగానే ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది.

అక్టోబర్ 24, ఆదివారం దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో పాకిస్తాన్‌తో జరిగే తొలి సూపర్ 12 మ్యాచ్ కోసం మైదానంలో తలపడే ముందు, అక్టోబర్ 20న అంటే బుధవారం ఆస్ట్రేలియాతో విరాట్ కోహ్లీ నేతృత్వంలోని టీమిండియా ఆస్ట్రేలియాతో మరో వార్మప్ గేమ్ ఆడనుంది. ఈ మ్యాచులో మరికొంతమందిని బరిలోకి దింపి పరీక్షించాలని టీం మేనేజ్‌మెంట్ కోరుకుంటోంది.

Also Read: T20 World Cup 2021: ఆకట్టుకున్న ఒమన్ ఫాస్ట్ బౌలర్.. కళ్లు చెరిదే క్యాచ్‌తో బంగ్లాకు షాక్.. 11 ఏళ్ల క్రితం భారత్‌ను కూడా బోల్తాకొట్టించాడు..!

T20 World Cup 2021: తొలి మ్యాచులో మోకాలిపై కూర్చుని నిరసన.. ఇంగ్లండ్, వెస్టిండీస్ ఆటగాళ్ల నిర్ణయం.. ఎందుకో తెలుసా?