Salaar Movie : ప్రభాస్ సినిమా నుంచి లీకైన వీడియో.. సోషల్ మీడియాలో వైరల్..
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం నటిస్తున్న భారీ బడ్జెట్ సినిమా సలార్. ఈ సినిమాలో ప్రభాస్ సరసన శృతిహాసన్ హీరోయిన్‌గా నటిస్తుంది.
Salaar : యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం నటిస్తున్న భారీ బడ్జెట్ సినిమా సలార్. ఈ సినిమాలో ప్రభాస్ సరసన శృతిహాసన్ హీరోయిన్‌గా నటిస్తుంది. కేజీ ఎఫ్ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. మాఫియా బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ చాలా డిఫరెంట్ లుక్ లో కనిపించనున్నాడు. ఇదిలా ఉంటే ఈ సినిమా షూటింగ్ స్పాట్ నుంచి ఇప్పటికే కొన్ని ఫోటోలు లీక్ అయ్యి సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈక్రమంలో తాజాగా ఈ సినిమా షూటింగ్ నుంచి ఓ వీడియో లీక్ అయ్యింది.
ఓ ఫైట్‌కు సంబందించిన వీడియో లీక్ అయ్యింది. ఈ వీడియోలో ప్రభాస్ గన్స్‌తో ఫైర్ చేస్తూ కనిపించాడు. ఇక ఈవీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతుంది. ఇదిలా ఉంటే సలార్ సినిమా దాదాపు రూ. 250 కోట్లకుపైగా బడ్జెట్‌తో తెరకెక్కుతోందని ప్రచారం జరుగుతోన్న ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాలకు ఢోకా లేదని తెలుస్తోంది. ఈ సినిమా మొత్తం బడ్జెట్‌లో దాదాపు సగం యాక్షన్ సన్నివేశాలకే ఖర్చు చేస్తున్నారంటా. అంటే దీనిబట్టే ప్రభాస్‌ను ప్రశాంత్ ఏ రేంజ్‌లో చూపించనున్నాడో అర్థం చేసుకోవచ్చు. ప్రభాస్ ప్రస్తుతం ‘రాధే శ్యామ్’తో పాటు బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కిస్తోన్న ‘ఆది పురుష్’లో నటిస్తున్నారు. వీటి తర్వాత మహానటి ఫేమ్ నాగ అశ్విన్‌తో ఓ సినిమా చేయనున్నారు.
#Salaar leaked ????? pic.twitter.com/E8BXdH28Fn
— For Trends™ (@Fortrendz) October 18, 2021
మరిన్ని ఇక్కడ చదవండి :