BiggBoss 5 Telugu : వార్‌కు దిగిన సన్నీ- ప్రియా.. ‘చెంప పగిలిద్ది అంటూ.. దమ్ముంటే కొట్టి చూడు అంటూ’.. రెచ్చిపోయిన కంటెస్టెంట్స్..
బిగ్ బాస్ సీజన్ 5 మంచి రసవత్తరంగా సాగుతుంది. మునుపెన్నడూ లేనివిధంగా ఈసారి 19 మంది హౌస్ లోకి వెళ్లారు. ఇప్పటికే ఒకొక్కరిగా హౌస్ నుంచి ఎలిమినేట్ అవుతున్న నేపథ్యంలో ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది.
BiggBoss 5 Telugu : బిగ్ బాస్ సీజన్ 5 మంచి రసవత్తరంగా సాగుతోంది. మునుపెన్నడూ లేనివిధంగా ఈసారి 19 మంది హౌస్‌లోకి వెళ్లారు. ఇప్పటికే ఒకొక్కరిగా హౌస్ నుంచి ఎలిమినేట్ అవుతున్న నేపథ్యంలో ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. రోజు రోజుకు బిగ్ బాస్ ఉత్కంఠగా సాగుతోంది. ఇక బిగ్ బాస్ ఇస్తున్న టాస్క్ లు హౌస్ మేట్స్ మధ్య గొడవలకు దారి తీస్తున్నాయి. ఈక్రమంలో ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ.. రచ్చ చేస్తున్నారు. ఈసారి హౌస్ లో భారీ గొడవే జరిగింది. ఈసారి బిగ్ బాస్ హౌస్‌లో సన్నీకి- ప్రియా కు మధ్య వార్ జరిగింది. చెంప పగిలిద్ది అని ప్రియా.. నోరు మూసుకో అని సన్నీ ఇద్దరు చిన్నపాటి యుద్ధమే చేసుకున్నారు. సన్నీ- ప్రియా గొడవపడుతుంటే మిగిలిన వారు వారిని ఆపే ప్రయత్నం చేశారు.
నేటి ఎపిపోడ్‌కు సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు. ఈ ప్రోమోలో టాస్క్‌లో భాగంగా సన్నీకి ప్రియాకు మధ్య గొడవ జరిగింది. అందరు కోడి గుడ్డును పట్టుకునే పనిలో ఉంటే.. ప్రియా అక్కడ ఉన్న బుట్టలో గుడ్డులు తీసుకునే ప్రయత్నం చేసింది. దాంతో అక్కడికి వచ్చిన సన్నీ ప్రియను పక్కకు నెట్టేశాడు. దాంతో ప్రియా చెంప పగిలిపోద్ది అంటూ మండిపడింది. దానికి సన్నీ నోరు ఉందికదా అని పారేసుకోవద్దు అంటూ సీరియస్ అయ్యాడు. అంతటితో ఆగలేదు ఈ గొడవ ఇంకాస్త పెద్దదైంది. ఈక్రమంలో సన్నీ ఏయ్ అన్నడంతో.. ప్రియా ఏయ్ ఏంటి అంటూ ఫైర్ అయ్యింది. చేతకాని మొహాలు వస్తారు ఇక్కడికి.. అంటూ సన్నీ అనడంతో.. చెంప పగిలిపోద్ది అని ప్రియా అంది. దాంతో కోపంతో రగిలిపోయిన సన్నీ దమ్ముంటే కొట్టి చూడు అంటూ ప్రియా మీదకు వెళ్ళాడు. మొత్తమీద ఈ ప్రోమో చూస్తుంటే ఈ రోజు ఎపిసోడ్ మంచి రసవత్తరంగా ఉండనుందని అర్ధమవుతుంది.
మరిన్ని ఇక్కడ చదవండి :