Rowdy Boys: రౌడీ హీరో చేతులమీదుగా రౌడీ బాయ్స్ సాంగ్.. ఆకట్టుకుంటున్న పాట
సినిమా ఇండస్ట్రీలోకి వారసులు ఎంట్రీ ఇవ్వడం మనం చూస్తూనే ఉన్నాం ఇప్పటికే చాలా మంది అలా వచ్చి సక్సెస్ అయ్యారు.

Rowdy Boys: సినిమా ఇండస్ట్రీలోకి వారసులు ఎంట్రీ ఇవ్వడం మనం చూస్తూనే ఉన్నాం ఇప్పటికే చాలా మంది అలా వచ్చి సక్సెస్ అయ్యారు. ఈక్రమంలోనే ఇప్పుడు మరో స్టార్ ప్రొడ్యూసర్ ఫ్యామిలీ నుంచి ఓ హీరో రాబోతున్నాడు. దిల్‌రాజు సోదరుడు, నిర్మాత శిరీష్ తనయుడు ఆశిష్ హీరోగా ఇండస్ట్రీ ఎంట్రీ ఇస్తున్నాడు. ఇతను నటిస్తోన్న చిత్రం ‘రౌడీ బాయ్స్’. ఇందులో అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటిస్తోంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి హర్ష దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. ఇటీవలే ఈ సినిమా నుంచి టీజర్ , పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ సినిమానుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ రిలీజ్ చేశారు.
ఈ పాటను రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ విడుదల చేశారు. అమ్మాయి కోసం రెండు వేర్వేరు కాలేజీల మధ్య గొడవ అనే ఇతివృత్తంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ చిత్రానికి దేవీశ్రీ ప్రసాద్ సంగీతం వహిస్తుండడం విశేషం. హీరో ఆశిష్ తొలి సినిమాలోనే మంచి నటనను కనబరినట్లు టీజర్‌లో తెలుస్తోంది.
మరిన్ని ఇక్కడ చదవండి :