AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Natyam: క్లాసికల్ డ్యాన్సర్లకు ఉండే హద్దులను మా సినిమాలో చూపిస్తాం : సంధ్య రాజ్

ప్రముఖ  కూచిపూడి డ్యాన్స‌ర్ సంధ్యారాజు నటిస్తూ స్వయంగా నిర్మిస్తున్న సినిమా ‘నాట్యం’. రేవంత్ కోరుకొండ దర్శకత్వంలో నిశృంకళ ఫిల్మ్‌ పతాకంపై రూపొందిన ఈ సినిమా ఈ నెల 22న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది

Natyam: క్లాసికల్ డ్యాన్సర్లకు ఉండే హద్దులను మా సినిమాలో చూపిస్తాం : సంధ్య రాజ్
Sandya
Rajeev Rayala
| Edited By: Ravi Kiran|

Updated on: Oct 20, 2021 | 7:41 PM

Share

Sandhya Raju : ప్రముఖ  కూచిపూడి డ్యాన్స‌ర్ సంధ్యారాజు నటిస్తూ స్వయంగా నిర్మిస్తున్న సినిమా ‘నాట్యం’. రేవంత్ కోరుకొండ దర్శకత్వంలో నిశృంకళ ఫిల్మ్‌ పతాకంపై రూపొందిన ఈ సినిమా ఈ నెల 22న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది..ఈ సంద‌ర్భంగా హీరోయిన్ సంధ్యారాజు నాట్యం సినిమా గురించి మాట్లాడుతూ.. ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఆమె మాట్లాడుతూ.. చిన్నప్పటి నుంచి నాట్యం అంటే నాకు ప్రాణం. ప్రతీ రోజూ నాకు నాట్యం గురించి ఆలోచనలే  ఉంటాయి అన్నారు. సినిమా ద్వారా ప్రజలకు ఇంకా దగ్గర కావచ్చు అనే ఆలోచనతోనే ఈ ప్రాజెక్ట్ ఎంచుకున్నాను అన్నారు సంధ్య. నాట్య ప్రదర్శనలు చేస్తే ఎప్పుడూ ఒకే సెక్షన్ పీపుల్స్ చూస్తుంటారు. కానీ ఒక్క షార్ట్ ఫిల్మ్ ద్వారానే నాట్యం గురించి ఎంతో మందికి చెప్పాం. చాలా రీచ్ అయింది. అప్పుడు సినిమా మాధ్యమానికి ఉన్న శక్తి ఏంటో అర్థమైంది. అందుకే ఈ సినిమాను తీశాను అన్నారు.

అలాగే నాకు చిన్నప్పటి నుంచి సినిమా ప్రపంచం గురించి తెలీదు. నా ధ్యాస అంతా ఎప్పుడూ కూడా నాట్యం మీదే ఉండేది. నాట్య ప్రధానంగా ఎన్నో సినిమాలు వచ్చాయి. కే విశ్వనాథ్ వంటి వారు గొప్ప చిత్రాలు చేశారు. నాట్యం అంటే కాళ్లు చేతులు కదపడం కాదు.. దాని ద్వారా ఓ కథను చెప్పడం అనే మా దర్శకుడి ఆలోచన ఈ చిత్రంలో కనిపిస్తుంది. ఈ నాట్యం ద్వారా జనాల్లో ఆలోచనలు రేకెత్తించొచ్చు. పాత కాలంలో నాట్యం అనేది కూడా ఓ సినిమాలాంటిదే అన్నారు సంధ్య. నాట్యం చిత్రంలో రెండు మూడు కథలు అంతర్లీనంగా ఉంటాయి. గురు శిష్యుల సంబంధాన్ని చూపిస్తాం. క్లాసికల్ డ్యాన్సర్లకు ఉండే హద్దులను చూపిస్తాం. వెస్ట్రన్ డ్యాన్స్, క్లాసికల్ డ్యాన్స్‌కు మధ్య ఉన్న తేడా ఏంటి? అని ఇలా రెండు మూడు ట్రాక్‌లు జరుగుతూ ఉంటాయి. నాట్యం అనేది ఊరి పేరు. దాని చుట్టూ ఉండే మూఢ నమ్మకాలు కూడా సినిమాలో ఉంటాయి. కమర్షియల్ సినిమాలానే ఉంటుంది అన్నారు సంధ్య.

మంచి కంటెంట్ ఎక్కడ తీసినా అందరికీ రీచ్ అవుతుంది. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు ఈ సినిమాను చూశారు. అభినందించారు. ఆరోగ్య సమస్యల వల్ల ఐదు నిమిషాలే సినిమా చూస్తాను అని అన్నారు. కానీ సినిమా మొదలైన తరువాత.. పూర్తయ్యే వరకు చూస్తూనే ఉండిపోయారు అని సంధ్య రాజ్ తెలిపారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Aryan Khan drugs case: డ్రగ్స్ కేసులో ఆర్యన్ ఖాన్‌ లభించని ఊరట.. ఇంకా జైల్లోనే.. హైకోర్టే దిక్కు..

Keerthy Suresh: ఇక పై అలాంటి సినిమాలు చేయనంటున్న ముద్దుగుమ్మ.. సంచలన నిర్ణయం తీసుకున్న కీర్తిసురేష్..

BiggBoss 5 Telugu : వార్‌కు దిగిన సన్నీ- ప్రియా.. ‘చెంప పగిలిద్ది అంటూ.. దమ్ముంటే కొట్టి చూడు అంటూ’.. రెచ్చిపోయిన కంటెస్టెంట్స్..