Mukku Avinash Marriage : ఘనంగా ముక్కు అవినాష్ పెళ్లివేడుక .. వైరల్ అవుతున్న వీడియో..
జబర్దస్త్ కార్యక్రమం వల్ల చాలా మంది కమెడియన్లు సినిమా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. వీరిలో ముక్కు అవినాష్ ఒకడు.
Mukku Avinash Marriage : జబర్దస్త్ కార్యక్రమం వల్ల చాలా మంది కమెడియన్లు సినిమా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. వీరిలో ముక్కు అవినాష్ ఒకడు. తనదైన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను కడుపుబ్బా నవించే అవినాష్ తాజాగా ఓ ఇంటివాడు అయ్యాడు. తన చిన్ననాటి స్నేహితురాలైన అనుజను అవినాష్ వివాహమాడాడు. ఇటీవలే అవినాష్ ఎంగేజ్ మెంట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అప్పటి నుంచి పెళ్లెప్పుడు అంటూ నెటిజన్లు అవినాష్ ను ప్రశ్నిస్తూ వస్తున్నారు. తాజాగా ఆ తంతు ముగిసింది. అవినాష్ ఈ రోజు ( బుధవారం) ఆమె మెడలో మూడు మూళ్లు వేసి ఓ ఇంటివాడయ్యాడు. కుటుంబ సభ్యులు, కొద్ది మంది సన్నిహితుల మధ్య ఈవేడుక జరిగింది.
అవినాష్ పెళ్ళిలో బిగ్ బాస్ కంటెస్టెంట్స్ దివి, అరియాన గ్లోరీ, సయ్యద్ సోహైల్ సందడి చేశారు. అలాగే జబర్దస్త్ కమెడియన్ రాంప్రసాద్ అవినాష్ పెళ్ళివీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈవీడియోకు సారీ బ్రదర్ బ్లండర్ మిస్టేక్ జరిగింది. కానీ తప్పడం లేదు.. అని రాసుకొచ్చాడు రాంప్రసాద్. ఇప్పుడు ఈవీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.
View this post on Instagram
మరిన్ని ఇక్కడ చదవండి :