Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cranberry Juice: మూత్రనాళ ఇన్ఫెక్షన్స్‌తో బాధపడేవారికి దివ్య ఔషధం.. క్రాన్‌బెర్రీ జ్యూస్ అంటున్న వైద్యులు..

Cranberry Juice: ప్రపంచంలో రకరకాల పండ్లు, వాటిల్లో రకాల రుచులు, రంగులు ఉన్నాయి. వీటిల్లో చూడడానికి కాఫీ గింజల తరహాగా కనిపించే క్రాన్‌బెర్రీస్..

Cranberry Juice: మూత్రనాళ ఇన్ఫెక్షన్స్‌తో బాధపడేవారికి దివ్య ఔషధం.. క్రాన్‌బెర్రీ జ్యూస్ అంటున్న వైద్యులు..
Cranberry Juice
Follow us
Surya Kala

|

Updated on: Oct 20, 2021 | 10:30 AM

Cranberry Juice: ప్రపంచంలో రకరకాల పండ్లు, వాటిల్లో రకాల రుచులు, రంగులు ఉన్నాయి. వీటిల్లో చూడడానికి కాఫీ గింజల తరహాగా కనిపించే క్రాన్‌బెర్రీస్ పండ్లు. ఇవి చాలా ప్రత్యేకమైనవి. చిన్నగా, గుండ్రంగా, ఎరుపు రంగులో ఉండే ఈ పండ్లు.. కొద్దిగా పుల్లగా, కొద్దిగా వగరు రుచి కలిగి ఉంటాయి. ఈ పండ్లకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఉంది. అయితే మనదేశంలో ఇప్పుడిప్పుడే సాగు మొదలు పెట్టారు. ఆన్‌లైన్‌ ఈ-కామర్స్ సైట్లలో, సూపర్ మార్కెట్లలో, డ్రైఫ్రూట్స్ స్టోర్‌లలో డ్రైఫ్రూట్స్ రూపంలో ఇవి కనిపిస్తాయి. ఈ క్రాన్‌బెర్రీస్ పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ముఖ్యంగా గుండెపోటు బారిన పడకుండా ఉపయోగపడతాయి. యాంటీఆక్సిడెంట్స్ , ఫైబర్, మాంగనీస్, విటమిన్ సీ, విటమిన్-ఇ పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా క్రాన్‌బెర్రీస్ పండ్లు సంబంధ సమస్యలకు చక్కని పరిష్కరం.. ఇంకా చెప్పాలంటే.. ప్రతి వ్యాధులకు మందులు వాడి.. సైడ్ ఎఫెక్ట్స్ తో ఇబ్బందులు పడే బదులు..క్రాన్‌బెర్రీస్ జ్యూస్ ని రెగ్యులర్ గా తీసుకుంటే మంచి మెడిసిన్ గా పనిచేస్తుంది.

ఇటీవల మారిన ఆహారపు అలవాట్లతో వయసుతో సంబంధం లేకుండా అనేక వ్యాధులు బారిన పడుతున్నారు. ముఖ్యంగా మూత్రనాళ ఇన్ఫెక్షన్స్‌ తో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటారు. మూత్రనాళంలోకి బ్యాక్టిరియా ప్రవేశించినా , తగినంత మంచినీళ్ళు తాగకపోయినా, కిడ్నీల్లో రాళ్లు, మూత్రాశయం, మూత్రనాళంలో ఏవైనా క్రిములు చేరినా ఇన్ఫెక్షన్స్‌ వస్తుంటాయి. దీంతో మూత్రంలో మంట, నొప్పి రావడమేకాదు..ఇన్ఫెక్షన్‌ ఎక్కువైతే.. జ్వరం, ఒంటి నొప్పులు, సరిగ్గా కూర్చోలేకపోవడం వంటి అనేక ఇబ్బందులుకూడా తలెత్తుతాయి. ఈ సమస్య నివారణ కోసం చికిత్స తీసుకుంటారు. యాంటీబయోటిక్స్‌ తో ఇన్ఫెక్షన్ నుంచి బయటపడతారు.

అయితే మూత్రనాళ ఇన్ఫెక్షన్స్‌తో బాధపడే వారు మందులకంటే క్రాన్‌బెర్రి జ్యూస్ ని తాగడం వలన అద్భుత ఫలితం ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. మూత్రనాళ సమస్యలతో బాధపడుతున్న వందల మంది మహిళలపై చేసిన సర్వేలో క్రాన్‌బెర్రి జ్యూస్ అద్భుతంగా పనిచేస్తుందని తెలిసిందని డాక్టర్లు చెప్పారు. క్రాన్‌బెర్రీ రసాన్ని తీసుకున్న మహిళల్లో మూత్ర ఇన్ఫెక్షన్ తగ్గినట్లు చెప్పారు. అందుకనే చాలామంది డాక్టర్లు మూత్రనాళ సంబంధ వ్యాధులతో బాధపడేవారు క్రాన్‌బెర్రీ జ్యూస్‌ను తీసుకోమని సూచిస్తున్నారు. కాన్ బ్రేరీ పండ్లల్లో ఉండే ఫెనోలిక్ యాసిడ్స్, ఫ్లేవనాయిడ్స్‌కు మూత్రనాళ సమస్యలను నివారించే గుణం ఉంది. మూత్రనాళంలోని బ్యాక్టీరియాలను నిర్మూలించడం, మంటను తగ్గించడంతో పాటు అనేక ఇబ్బందులను తగ్గిస్తుందని డాక్టర్లు చెబుతున్నారు.

Also Read:  తాతగారితో గారాల మనవడు ఈ చిన్నారి బాలుడు.. ఆంధ్రుల అభిమాన నటుడు ఎవరో గుర్తు పట్టారా..