తల్లిదండ్రులు అలర్ట్..! మీ పిల్లలు ఈ సమస్యలతో బాధపడుతున్నారా..?
Health News: వాతావరణ మార్పుల వల్ల పిల్లల్లో కొత్త కొత్త ఆరోగ్య సమస్యలు ఏర్పడుతున్నాయి. ముఖ్యంగా కడుపు సమస్యలతో చాలా
Health News: వాతావరణ మార్పుల వల్ల పిల్లల్లో కొత్త కొత్త ఆరోగ్య సమస్యలు ఏర్పడుతున్నాయి. ముఖ్యంగా కడుపు సమస్యలతో చాలా ఇబ్బంది పడుతున్నారు. చాలామంది పిల్లలు కడుపు నొప్పి, పేగు ఇన్ఫెక్షన్, విరేచనాల సమస్యలతో బాధపడుతూ ఆస్పత్రుల్లో చేరుతున్నారు. అయితే తల్లిదండ్రులు పిల్లలను గమనించాలని, వారి ఆరోగ్య పరిస్థితులపై నిఘా పెట్టాలని డాక్టర్లు సూచిస్తున్నారు. ఎందుకంటే ఈ సీజన్‌లో అనేక రకాల వైరస్‌లు యాక్టివ్‌గా మారుతాయని, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న పిల్లలు వీటి బారిన పడుతారని హెచ్చరిస్తున్నారు. వీటిని నివారించాలంటే పిల్లలు బయటి ఆహారం తినకుండా చూసుకోవాలని సూచిస్తున్నారు.
చాలామంది పిల్లలు బయట తిండి తినడం వల్ల ఈ సమస్యలు ఎదురవుతున్నాయని వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా ఐదేళ్లలోపు పిల్లల్లో కడుపుకి సంబంధించిన సమస్యలు ఎక్కువగా వస్తున్నాయని అంటున్నారు. తల్లిదండ్రులు ఎల్లప్పుడూ ఇంటిని శుభ్రంగా ఉంచాలని, పిల్లలకు ఆహారం ఇచ్చే ముందు చేతులను సబ్బు లేదా శానిటైజర్‌తో శుభ్రం చేసుకోవాలని సూచిస్తున్నారు. ఇలా చేయడం ద్వార ఎలాంటి బ్యాక్టీరియా పిల్లల్లోకి ప్రవేశించదు అంతేకాక వారు సురక్షితంగా ఉంటారు.
బ్యాక్టీరియా వేగంగా వ్యాపిస్తుంది ఈ సీజన్‌లో పిల్లలలో బ్యాక్టీరియా, వైరస్‌లు సులభంగా వ్యాప్తి చెందుతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ఆహారంలో ఉపయోగించే కూరగాయలు, ధాన్యాలు లేదా పండ్లు సరిగ్గా కడగనప్పుడు ఇది జరుగుతుందన్నారు. చాలా మంది పిల్లలు ఒకే ప్లేట్‌లో కలిసి భోజనం చేస్తుంటే వారి చేతిలో ఉండే బ్యాక్టీరియా ఆహారంలో కలిసిపోతుందన్నారు. ఇది ఆహారం ద్వారా కడుపులోకి చేరి కడుపు నొప్పి, వాంతులు, విరేచనాల సమస్యలను సృష్టిస్తుందని పేర్కొన్నారు. ముఖ్యంగా బాత్రూమ్ ఉపయోగించిన తర్వాత చేతులను పూర్తిగా శుభ్రపరచడం పిల్లలకు నేర్పించండి.