Runny Nose: వర్షా కాలంలో అదే పనిగా ముక్కు కారుతోందా? ఇలా చేస్తే చిటికెలో ఉపశమనం..
కొంత మందికి వర్షాకాలంలో ముక్కు కారుతుంటుంది. ఈ సమస్య జలుబు, సైనస్, అలెర్జీ కారణంగా వస్తుంది. ఈ సమస్య మీకూ ఉంటే.. వెంటనే మీరు మొదట డాక్టర్ వద్దకు పరిగెత్తాల్సిన అవసరం లేదు. మందులు తీసుకోకుండానే ఇంట్లోనే కొన్ని ఇంటి నివారణల ద్వారా ముక్కు కారటం సమస్యను చిటికెలో తగ్గించుకోవచ్చు. ఎలాగంటే..

వర్షాకాలంలో ముక్కు కారటం సాధారణమే. చాలా మంది ఇళ్లలో ఇది కనిపిస్తుంది. కొంత మందికి వర్షాకాలంలో ముక్కు కారుతుంటుంది. ఈ సమస్య జలుబు, సైనస్, అలెర్జీ కారణంగా వస్తుంది. ఈ సమస్య మీకూ ఉంటే.. వెంటనే మీరు మొదట డాక్టర్ వద్దకు పరిగెత్తాల్సిన అవసరం లేదు. మందులు తీసుకోకుండానే ఇంట్లోనే కొన్ని ఇంటి నివారణల ద్వారా ముక్కు కారటం సమస్యను చిటికెలో తగ్గించుకోవచ్చు. ఎలాగో ఇక్కడ తెలుసుకుందాం..
అల్లం-తులసి-నిమ్మకాయ టీ
వర్షాకాలంలో ముక్కు కారుతుంటే.. అల్లం, తులసి ఆకులు, నిమ్మరసం, ఒక చెంచా తేనెతో తయారుచేసిన గోరువెచ్చని టీని రోజుకు 2-3 సార్లు తాగవచ్చు. ఇది జలుబును తగ్గిస్తుంది. అలెర్జీలను నివారిస్తుంది.
ఆవిరి పీల్చడం
యూకలిప్టస్ నూనె లేదా పుదీనా ఆకులతో వేడి నీటిలో ఆవిరి పట్టినా ఫలితం ఉంటుంది. తలను ఒక గుడ్డ లేదంటే టవల్‌తో కప్పి గాలి పీల్చుకోవాలి. ఇది ముక్కు దిబ్బడను తొలగించడానికి, ముక్కు కారటం తగ్గించడానికి సహాయపడుతుంది.
వెల్లుల్లిని వేయించి లేదా ఉడికించి తినవచ్చు
వర్షాకాలంలో జలుబు సమస్యలకు ఒకటి లేదా రెండు వెల్లుల్లి రెబ్బలను నెయ్యి లేదా ఆవ నూనెలో వేయించి తింటే జలుబు ఇట్టే నయమవుతుంది.
మరికొన్ని చిట్కాలు
- ముక్కుకు రెండు వైపులా గోరువెచ్చని నూనెతో మసాజ్ చేసినా ఫలితం ఉంటుంది. ముక్కు చుట్టూ గోరువెచ్చని ఆవనూనెతో మసాజ్ చేయడం వల్ల వేగంగా ఉపశమనం లభిస్తుంది.
- వివిధ కూరగాయలు, అల్లం, వెల్లుల్లితో చేసిన వేడి సూప్ తాగితే జలుబును తగ్గించడంలో ప్రభావవంతంగా ఉంటుంది.
- వేడి నీరు తాగి, తగినంత విశ్రాంతి తీసుకుంటే ముక్కు దిబ్బడ నుంచి ఉపశమనం పొందవచ్చు. రోజంతా సాధారణ నీటికి బదులు వేడి నీరు తాగేందుకు ప్రయత్నించాలి. దానితో పాటు, శరీరాన్ని వీలైనంత వెచ్చగా ఉంచుకోవాలి. అంతేకాకుండా తగినంత విశ్రాంతి కూడా తీసుకోవాలి.
- వర్షాకాలంలో ముక్కు కారకుండా ఉండటానికి చల్లటి నీరు, ఐస్ క్రీం, రిఫ్రిజిరేటెడ్ ఆహారాన్ని తినకుండా ఉండటం మంచిది.
- వర్షాకాలంలో తడి దుస్తులు ధరించి ఉండకూడదు. 4-5 రోజులకు మించి ముక్కు కారడం ఆగకుంటే, దీనితోపాటు దగ్గు, జ్వరం కూడా ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.








