ఎరుపు రంగులో ఉండే ఆహారాలను.. రోజూ తినాల్సిందే.. ఎందుకంటే..?
ప్రకృతిలో అనేక రకాల ఆహారాలు ఉన్నాయి. పండ్లు, కూరగాయలు రకరకాల రంగుల్లో లభిస్తాయి. భిన్న రంగుల్లో ఉండే ఆహారాలను తరచూ తినాలని పోషకాహార నిపుణులు చెబుతుంటారు. అలా తింటే పోషకాహార లోపం రాకుండా ఉంటుంది. ఎరుపు రంగులో ఉన్న ఆహారాలేంటి? కలిగే ప్రయోజనాలేంటి? టమాటాలు, యాపిల్స్, స్ట్రాబెర్రీలు, రాస్ప్ బెర్రీలు, చెర్రీలు, ఎరుపు రంగు క్యాప్సికం..
ఇలా ఎరుపు రంగులో ఉండే ఆహారాలను తరచూ తినాలని ఆహార నిపుణులు సూచిస్తున్నారు. వీటిల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్ల కారణంగా మన శరీరంలో ఉత్పత్తి అయ్యే ఫ్రీ ర్యాడికల్స్ నిర్మూలించబడతాయి. దీంతో ఆక్సీకరణ ఒత్తిడి తగ్గుతుంది. కణాలకు జరిగే నష్టం వాపులు తగ్గుతాయి. గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు రాకుండా అడ్డుకోవచ్చు. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. హార్ట్ ఎటాక్ రాకుండా సురక్షితంగా ఉంటారు. ఎరుపు రంగు ఆహారాల్లో యాంటీ ఇన్ ఫ్లామేటరీ గుణాలు ఉంటాయి. ఈ ఆహారాల్లో ఉండే విటమిన్ సి, లైకోపీన్ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. చర్మ కణాలు డ్యామేజ్ అవకుండా రక్షిస్తాయి. దీంతో చర్మం కాంతివంతంగా మారుతుంది. యవ్వనంగా కనిపిస్తారు. ఎరుపు రంగు ఆహారాల్లో ఐరన్ కూడా అధికంగానే ఉంటుంది. ఇది రక్తం తయారయ్యేలా చేస్తుంది. రక్తహీనతను తగ్గిస్తుంది. నీరసం, అలసట నుంచి బయట పడేలా చేస్తుంది. ఇలా ఎరుపు రంగులో ఉండే ఆహారాలను తరచూ తింటుంటే అనేక లాభాలను పొందవచ్చు. మేం అందించిన ఈ సమాచారం మీ అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య సమస్యలున్న వారు వీటిని పాటించేముందు వ్యక్తిగత వైద్యుడిని సంప్రదించడం మంచిది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఉనికి కోల్పోతున్న ఆ బుల్లి గ్రహం.. తన పుట్టుకకు కారణమైన నక్షత్రం ద్వారానే నాశనం
ఒక అమ్మాయి.. ఇద్దరు అబ్బాయిలు.. ఏకంగా కత్తులతోనే
గుడ్‌న్యూస్.. ఆధార్ లేకున్నా తత్కాల్ టికెట్లు
రోజూ యాలకుల టీ తాగితే.. బాడీలో అద్భుతమే
వాటి కోసమే సరికొత్తగా హాస్టళ్లు.. మంచి ఆహారం, వైద్య సేవలు లభ్యం
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
డ్రైవర్పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే

