గుడ్‌న్యూస్.. ఆధార్ లేకున్నా తత్కాల్ టికెట్లు
భారత రైల్వే ఇటీవల తత్కాల్ టికెట్ల విషయంలో కొత్త నిబంధనలు ప్రవేశపెట్టింది. ముఖ్యంగా తత్కాల్ టికెట్లు బుక్ చేసుకునే వారు ఐఆర్‌సీటీసీ అకౌంట్‌కు ఆధార్ కార్డు లింక్ చేయడం తప్పనిసరి చేసింది. జూలై 1వ తేదీ నుంచి ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌లో తత్కాల్ టికెట్లు బుక్ చేసుకోవాలన్నా ఆధార్ అథంటికేషన్ తప్పనిసరి అని ప్రకటించింది రైల్వే.
జూలై 15 నుంచి రిజర్వేషన్ కౌంటర్లలోనూ ఆధార్ ఆధారిత ఓటీపీ విధానాన్ని అమలు చేస్తామని ప్రకటించింది. అయితే ప్రస్తుతం ఆధార్ వివరాలు లేకున్నా.. రిజర్వేషన్ కౌంటర్లలో తత్కాల్ టికెట్లను జారీ చేస్తున్నారు. మూడు రోజులుగా రిజర్వేషన్ సిబ్బంది ఆధార్ లేకుండానే టికెట్లు జారీ చేస్తున్నారు. ఆధార్ అథంటికేషన్ ప్రక్రియలో ఏర్పడిన టెక్నికల్ సమస్యల కారణంగా కొత్త విధానాన్ని తాత్కాలికంగా వాయిదా వేసినట్లు సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్ సీఆర్‌ఐఎస్ అధికారులు వెల్లడించారు. సాంకేతిక సమస్యల వల్ల రిజర్వేషన్ కౌంటర్లలో తత్కాల్ టికెట్ల జారీలో మరిన్ని ఇబ్బందులు వస్తాయని భావించిన అధికారులు.. ప్రస్తుతానికి ఆధార్ రూల్ పక్కనబెట్టారు. ప్రస్తుతం నిమిషానికి 4 టికెట్లు జారీ చేస్తున్నామని, ఆధార్ అథంటికేషన్ ఓటీపీ కోసం ప్రతి టికెట్టుకూ అదనంగా సమయం పడుతున్నందని, ఈ జాప్యాన్ని నివారించడం కోసమే ప్రస్తుతానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. మరోవైపు, ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్‌ను పూర్తిగా అప్‌గ్రేడ్ చేసే దిశగా సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ పనిచేస్తోంది. ఈ ఏడాది చివరికి టికెట్ సిస్టమ్‌కు డిజిటల్ హంగులు చేకూరనున్నాయి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రోజూ యాలకుల టీ తాగితే.. బాడీలో అద్భుతమే
వాటి కోసమే సరికొత్తగా హాస్టళ్లు.. మంచి ఆహారం, వైద్య సేవలు లభ్యం
అద్దె ఇల్లు ఖాళీ చేసిన వ్యక్తికి..అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన ఓనర్
నారుమడి కాదు.. గుర్రపుడెక్క.. శ్రీశైలం జలాశయంలో అరుదైన దృశ్యం
రన్నింగ్‌లో ఉన్న స్కూటీలో పాము.. వాహనదారుడు ఏం చేశాడో తెలిస్తే
లక్ష.. లక్ష్మీకాసులతో 12 అడుగుల గణపయ్య!
రెండేళ్ల కష్టం నేడు వినాయకుడి రూపం.. పవన్‌కు గిఫ్ట్‌గా!
మర్రి ఆకుపై 2 సెం.మీ గణపయ్య.. మైక్రో ఆర్టిస్ట్ అద్భుతం!
పసుపు కొమ్ములతో పర్యావరణ గణపతి.. జడ్చర్లలో స్పెషల్ వినాయకుడు!
ఇల్లు పీకి పందిరేస్తున్నాయి పంట పొలాలు నాశనం.. పిల్లల పై దాడులు!
బరువు తగ్గాలనుకుంటున్నారా..? CMR-NIN పరిశోధనలో సంచలన నిజాలు
లీటర్‌కు రూ.80 కోట్లు.. తేలు విషం రహస్యం ఇదే!

