రన్నింగ్‌లో ఉన్న స్కూటీలో పాము.. వాహనదారుడు ఏం చేశాడో తెలిస్తే
వర్షాకాలంలో పాములు నివాస ప్రాంతాలలో పార్క్ చేసే కార్లు, ఇతర వాహనాల్లో దూరి వాహన యజమానులను కంగారు పెడుతుంటాయి. హైదరాబాద్ అంబర్ పేటలో ఇలాంటి ఘటనే జరిగింది. ఇంటి ముందు పార్క్ చేసిన స్కూటీలోకి పాము దూరింది. దానిని గమనించక.. బండిని స్టార్ట్ చేసి తీసుకెళ్లిన యజమాని.. మార్గ మధ్యంలో పాము వాహనంలో దూరిన సంగతి గమనించి.. షాక్ అయ్యాడు. వెంటనే వాహనాన్ని పక్కన ఆపేసి.. దూరంగా పరిగెత్తాడు.
దీంతో ఆ దారిన పోయే వాహనదారులంతా కూడా షాకయ్యారు. అంబర్ పేట పటేల్ నగర్‌లో నివాసం ఉండే ఓ వ్యక్తి ఉదయం ఆజాద్ నగర్ మీదుగా అలీ కేఫ్ చౌరస్తా వైపు వెళ్తున్నాడు. ఆజాద్ నగర్ మదర్సా వద్దకు రాగానే అతని ద్విచక్ర వాహనంలో అంతవరకు ఉన్న నాగుపాము పిల్ల అకస్మాత్తుగా అతని చేతి మీదికి ఎక్కింది. ఊహించని ఈ ఘటనకు వణికిపోయిన సదరు వాహనదారుడు.. తన చేతిపై ఉన్న నాగుపామును విసిరి కొట్టగా అది కింద పడింది. దీంతో వెంటనే స్కూటీని రోడ్డు పక్కన ఆపి దానిపై నుంచి కిందికి దిగాడు. అయితే క్రింద పడిపోయిన నాగుపాము మళ్లీ అతని స్కూటీలోనే దూరింది. దాన్ని గమనించిన స్థానికులు వెంటనే స్నేక్ క్యాచర్‌కు సమాచారం ఇచ్చారు. దాదాపు రెండు గంటల పాటు శ్రమించి… వాహన భాగాలను ఒక్కొక్కటిగా విప్పటంతో.. లోపల దూరిన పాము పిల్లను బయట పడింది. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ వానాకాలంలో ఇంటి దగ్గర పార్క్ చేసిన వాహనాలు స్టార్ట్ చేసే సమయంలో ఆన్ చేసి.. రెండు నిమిషాల పాటు చెక్ చేసుకోవాలని సదరు స్నేక్ క్యాచర్ సూచించాడు. ఈ కేసులో వాహనదారుడిని పాము కాటువేయకపోవటం అదృష్టమేనని అతడు పేర్కొన్నాడు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కప్పలకు పెళ్లి చేసిన చిన్నారులు.. ఎందుకంటే
ఒకదానికొకటి ఎదురుపడిన రెండు కింగ్ కోబ్రాలు.. ఆ తర్వాత
87 ఏళ్లకు తండ్రి అయిన కోటీశ్వరుడు.. కట్ చేస్తే..
ఊరు ఊరంతా కరెంట్ షాక్.. సెల్ఫోన్ ఛార్జింగ్ పెడుతూ యువకుడు
పొదుపు చేయలేదు.. జాబ్ పోయింది.. టెకీ ఆవేదన
ప్రాణాలకు తెగించి వృద్ధ దంపతుల వీరోచిత పోరాటం
మెస్సికి కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చిన అనంత్ అంబానీ..
నీరు తోడుతుండగా వచ్చింది చూసి.. పరుగో పరుగు..
జోరు వానలో చిక్కుకున్న ఏనుగు.. గొడుగుగా మారిన తల్లి ఏనుగు..

