ఒకదానికొకటి ఎదురుపడిన రెండు కింగ్ కోబ్రాలు.. ఆ తర్వాత
సోషల్ మీడియాలో రోజూ విభిన్నమైన వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. ఆన్‌లైన్ యూజర్లను ఆకట్టుకునే అద్భుత దృశ్యాలు కొన్ని క్షణాల్లోనే వైరల్ అయిపోతాయి. ముఖ్యంగా వన్యప్రాణుల వీడియోలే ఈ మధ్య నెట్టింట ఎక్కువగా కనిపిస్తున్నాయి. వాటిలోనూ పాములు వీడియోలకు ఓ రేంజ్ ఎట్రాక్షన్ ఉంటుంది. పాముల్లో నాగుపాము చాలా డేంజరస్ అన్న విషయం తెలిసిందే.
తమకు అపాయం అనిపిస్తే అవి పడగవిప్పి విరుచుకుపడతాయి. అయితే మీరు పాములు మనుషులపై దాడి చేయడాన్ని చూసి ఉండొచ్చు. అలానే పాముల సయ్యాట వీడియోలు కూడా తరచూ కంటపడుతూ ఉంటాయి. కానీ… ఒక కోబ్రా మరో కోబ్రాపై దాడి చేయడం మాత్రం అత్యంత అరుదు. ఇలాంటి ఓ అరుదైన ఘట్టం కెమెరాకు చిక్కింది. ఇప్పుడు అది సోషల్ మీడియాను షేక్ చేస్తోంది! వీడియోలో రెండు భారీ కోబ్రాలు ఒకదానికొకటి ఎదురుగా పడగవిప్పి నిలబడి ఉన్నాయి. ఒక్కసారిగా ఒక కోబ్రా తన పడగతో.. ఎదురుగా ఉన్న కోబ్రాపై దాడికి దిగుతుంది. దాంతో మరో కోబ్రా కూడా ఎదురుదాడికి దిగింది. ఏమైందో ఏమో కానీ కొన్ని క్షణాల్లోనే ఆ పోట్లాట ఆగిపోయింది. ఓ కోబ్రా ఒక్కసారిగా పోరాటం ఆపి తన దారిన వెళ్లిపోయింది. దాంతో రెండో కోబ్రా కూడా అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఈ సీన్ చూసి నెటిజన్లు షాకయ్యారు. ఎదరుపడినప్పుడు ఆ రెండు పాముల్లో ఏదో ఒకటే ప్రాణాలతో ఉంటుంది అనిపించేలా సీన్ క్రియేట్ చేశాయి. కానీ అంతలోనే దేనికది తోకముడిచాయి. ఈ వీడియోను ఓ యూజర్ తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు. ఈ వీడియోను ఇప్పటికే 30 లక్షల మందికి పైగా వీక్షించారు. పది లక్షల మందికి పైగా లైక్ చేశారు. వేలాదిమంది తమదైన శైలిలో కామెంట్లు చేస్తూ.. రీ ట్వీట్ చేశారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కేవలం రూ.100కే ఇల్లు.. ఎక్కడో తెలుసా?
87 ఏళ్లకు తండ్రి అయిన కోటీశ్వరుడు.. కట్ చేస్తే..
ఊరు ఊరంతా కరెంట్ షాక్.. సెల్ఫోన్ ఛార్జింగ్ పెడుతూ యువకుడు
పొదుపు చేయలేదు.. జాబ్ పోయింది.. టెకీ ఆవేదన
ప్రాణాలకు తెగించి వృద్ధ దంపతుల వీరోచిత పోరాటం
మెస్సికి కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చిన అనంత్ అంబానీ..
నీరు తోడుతుండగా వచ్చింది చూసి.. పరుగో పరుగు..
జోరు వానలో చిక్కుకున్న ఏనుగు.. గొడుగుగా మారిన తల్లి ఏనుగు..

