మధ్యప్రదేశ్‌లో యువకుడి ప్రాణం తీసిన చెప్పు..
మధ్యప్రదేశ్‌లో అనుహ్య ఘటన వెలుగులోకి వచ్చింది. సియోని జిల్లాలో ఉన్న పరేవా ఖోహ్ స్థానికంగా పర్యాటక స్థలంగా పేరు పొందింది. వర్షాకాలంలో నిండుగా పొంగే నదిని చూసేందుకు పెద్ద సంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు. కొండల నడుమ ప్రవహించే ఈ నది చూడడానికి ఆహ్లాదకరంగా ఉంటుంది. జూలై 20 ఆదివారం సెలవు రోజు కావడంతో ఆయుష్ అనే 20ఏళ్ల యువకుడు.. ఐదుగురు స్నేహితులతో కలిసి పరేవా ఖోహ్‌కు సరదాగా వెళ్లాడు.
అయితే అక్కడి ప్రకృతి అందాలు ఆస్వాదిస్తున్న క్రమంలో అతడి చెప్పు అనుకోకుండా నదిలో పడిపోయింది. నీళ్లలో తేలుతున్న ఆ చెప్పు నీటి అలల ధాటికి కొండరాళ్ల పైకివస్తూ పోతూ ఉంది. దీంతో అతడు ఓ కర్ర సాయంతో చెప్పును బయటకు తీసేందుకు ప్రయత్నించాడు. ప్రవాహంలో చెప్పు కొంచెం ముందుకు వెళ్లింది. ఆయుష్ కూడా రాళ్ల మీదుగా అక్కడికి పరుగులు తీశాడు. అయితే చెప్పును చేతితో తీసుకోవచ్చనుకున్నాడు. దీంతో ఆయుష్ చేయి చాపబోయాడు. రాళ్లపై ఉన్న పాచి కారణంగా పట్టుతప్పి అతడు నీళ్లలో పడిపోయాడు. అదే సమయంలో నదిలో నీటి ప్రవాహం ఎక్కువగా ఉండడంతో అతడు రాళ్లను పట్టుకుని బయటకు వచ్చేందుకు ప్రయత్నించాడు. కానీ నదిలో ప్రవాహం దాటికి పట్టుదొరక్క.. స్నేహితుల కళ్ల ముందే కొట్టుకుపోయాడు. ఒడ్డున ఉన్న స్నేహితులకు ఏం చేయాలో తెలియక భోరున ఏడుస్తూ అక్కడి సిబ్బందికి సమాచారం అందించారు. గజఈతగాళ్ల సాయంతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టినా ప్రయోజనం లేకపోయింది. రంగంలోకి దిగిన ఎస్‌డిఆర్‌ఎఫ్ బృందం.. చివరికి ఆయుష్ మృతదేహాన్ని బయటకు తీసింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
లక్ష.. లక్ష్మీకాసులతో 12 అడుగుల గణపయ్య!
రెండేళ్ల కష్టం నేడు వినాయకుడి రూపం.. పవన్‌కు గిఫ్ట్‌గా!
మర్రి ఆకుపై 2 సెం.మీ గణపయ్య.. మైక్రో ఆర్టిస్ట్ అద్భుతం!
పసుపు కొమ్ములతో పర్యావరణ గణపతి.. జడ్చర్లలో స్పెషల్ వినాయకుడు!
ఇల్లు పీకి పందిరేస్తున్నాయి పంట పొలాలు నాశనం.. పిల్లల పై దాడులు!
బరువు తగ్గాలనుకుంటున్నారా..? CMR-NIN పరిశోధనలో సంచలన నిజాలు
లీటర్‌కు రూ.80 కోట్లు.. తేలు విషం రహస్యం ఇదే!

