భార్య చేతిలో మరో భర్త బలి.. ఏం చేసిందంటే వీడియో
పెళ్లైంది.. ఇద్దరు సంతానం.. భర్త డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ఇద్దరు పిల్లలను చూసుకుంటూ ఇంట్లోనే ఉంటోంది భార్య. ఇలా వారి జీవితం సాఫీగా సాగుతున్న క్రమంలో వారి జీవితంలోకి మరో వ్యక్తి ఎంట్రయ్యాడు. భార్య ఆ వ్యక్తికి దగ్గరైంది. ఈ వివాహేతర సంబంధానికి భర్తను అడ్డుగా భావించింది. అడ్డు తొలగించుకోడానికి ప్రియుడితో కలిసి మాస్టర్ ప్లాన్ వేసింది. ఓరోజు భర్తకు దగ్గరుండి ప్రేమగా భోజనం వడ్డించింది. సంతోషంగా భోజనం చేసిన అతను తీవ్ర అస్వస్థతకు గురై చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఆ తర్వాత భార్య జైలుపాలైంది. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలోని ధర్మపురి జిల్లాలో జరిగగింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..తమిళనాడు అరూర్ సమీపంలోని కీరైపట్టి గ్రామానికి చెందిన రసూల్ కు అమ్ముబీతో కొన్నేళ్ల క్రితం పెళ్లైంది.. రసూల్, అమ్ముబీ దంపతులకు ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. రసూల్ ఓ ప్రైవేట్ కంపెనీలో డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈ క్రమంలోనే కొన్ని రోజుల క్రితం రసూల్ వాంతులు చేసుకొని, స్పృహ కోల్పోయాడు. వెంటనే కుటుంబసభ్యులు సేలంలోని ఓ ఆసుపత్రిలో చేర్చారు. వైద్యులు అతనికి చికిత్సను ప్రారంభించారు. ఈ క్రమంలో ఆయన రక్త నమూనాలు పరీక్షించగా.. దానిలో పురుగుమందు అవశేషాలు ఉన్నట్లు గుర్తించారు. ఈ విషయాన్ని వైద్యులు కుటుంబసభ్యులకు తెలిపారు. దీంతో రసూల్ కుటుంబీకులు ఒక్కసారిగా షాకయ్యారు.. ఆయన భార్య అమ్మూబీపై అనుమానంతో ఆమెను అడిగారు.. పొంతన లేని సమాధానాలు చెప్పడంతో అనుమానించిన కుటుంబీకులు ఆమె సెల్‌ఫోన్‌లోని వాట్సప్ చాటింగ్‌ను పరిశీలించారు. దీంతో అసలు విషయం వెలుగుచూసింది. అమ్మూబీ స్థానికంగా సెలూన్ నడుపుతున్న లోకేశ్వరన్‌తో చాట్ చేసినట్లు కుటుంబసభ్యులు గుర్తించారు. అందులో.. నువ్వు ఇచ్చిన విషాన్ని మొదట దానిమ్మ రసంలో కలిపా.. దాన్ని నా భర్త తాగలేదు.. దీంతో ఆహారంలో కలిపా.. అంటూ అమ్ముబీ పేర్కొంది. ఈ క్రమంలోనే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రసూల్ మృతి చెందడంతో.. కుటుంసభ్యులు అతని భార్య, ప్రియుడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు అమ్ముబీ, లోకేశ్వరన్‌లను శనివారం అరెస్టు చేసి జైలుకు పంపారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
మరిన్ని వీడియోల కోసం :
లైవ్ కవరేజ్ చేస్తూ.. వరదలో కొట్టుకుపోయిన జర్నలిస్ట్ వీడియో
కోళ్ల షెడ్డుకు వేసిన ఫెన్సింగ్ నుంచి వింత శబ్దాలు.. దగ్గరకు వెళ్లి చూస్తే వీడియో
ఇదెక్కడి చోద్యం.. ఒకే అమ్మాయిని పెళ్లి చేసుకున్న బ్రదర్స్ వీడియో
నదిలో ఉండాల్సిన మొసలి.. రోడ్డుపైకి రావడంతో.. వీడియో
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
