నదిలో ఉండాల్సిన మొసలి.. రోడ్డుపైకి రావడంతో.. వీడియో
సాధారణంగా మొసళ్లు.. నదులు, చెరువుల్లో ఉంటాయి. నీటిలో ఉండగా దీని బలం మామూలుగా ఉండదు. ఎంతటి జంతువునైనా ఇట్టే పడగొట్టేస్తుంది. అదే నేలపైకి వస్తే చిన్న పక్షికి కూడా లోకువైపోతుంది. ఇంతకీ విషయం ఏంటంటే.. నదిలో ఉండాల్సిన మొసలి సడన్‌గా రోడ్డుమీదకు వచ్చింది. అదికూడా రద్దీగా ఉండే రోడ్డుపై దర్జాగా వెళ్తూ జనాలను భయాందోళనకు గురిచేసింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
జూలై 18 గురువారం రాత్రి గుజరాత్‌లోని వడోదరలో నరహరి విశ్వామిత్ర వంతెన సమీపంలోని ప్రధాన రహదారిపై ఈ షాకింగ్ సీన్ కలకలం రేపింది. రద్దీగా ఉండే ఆ రోడ్డుపైకి విశ్వామిత్ర నది నుంచి 8 అడుగుల పొడవైన మొసలి వచ్చింది. రోడ్డుపై మొసలిని చూసి స్థానికులు భయంతో పరుగులు తీశారు. ఆ రోడ్డుపై వెళ్తున్న వాహనాలన్నీ ఆగిపోవడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఇదంతా కమిషనర్ బంగ్లా సమీపంలోనే జరిగింది. స్థానికులు వెంటనే అటవీ శాఖకు సమాచారం అందించారు. హుటాహుటినా అటవీ సిబ్బంది అక్కడికి చేరుకొని మొసలిని సురక్షితంగా అక్కడి నుంచి తరలించారు. ఈ అరుదైన దృశ్యాన్ని చూడటానికి స్థానికులు పెద్ద సంఖ్యలో గుమిగూడారు. చాలామంది ఆ దృశ్యాలను తమ ఫోన్‌లలో బంధించారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీనిపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందించారు.
మరిన్ని వీడియోల కోసం :
ఇవి పాల ప్యాకెట్లు అనుకునేరు.. లోపల చూస్తే షాకవుతారు వీడియో
అయ్యయ్యో.. ఎంత కష్టం వచ్చింది ఈ పాముకి వీడియో
ఏఐ మ్యాజిక్.. డ్రోన్స్, రోబోలతో సిరుల సేద్యం వీడియో
ఏమి మారిందంటూ..పాటతో రైతు కష్టాలు చెప్పిన కూరగాయలమ్మే వ్యక్తి వీడియో
సంక్రాంతి ముందు నాన్వెజ్ ప్రియులకు షాక్..
రాత్రివేళ నడిరోడ్డుపై వింత ఆకారం.. ఆగిపోయిన వాహనాలు
కత్తులతో నడిరోడ్డుపై రచ్చ చేసిన మహిళ..
రాకుమారుల రుమాలు.. రేటు జస్ట్.. రూ.7 లక్షలే
అర్ధరాత్రి పోలీసుల ముందే బైక్ స్టంట్స్.. వీడియో వైరల్
బిచ్చగాడు కాదు లక్షాధికారి.. చనిపోయాక బయటపడ్డ నిజం
ఆ కొండపై ఫోన్ చేస్తే.. చనిపోయిన వాళ్ళూ పలుకుతారా ??
