AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏమి మారిందంటూ..పాటతో రైతు కష్టాలు చెప్పిన కూరగాయలమ్మే వ్యక్తి వీడియో

ఏమి మారిందంటూ..పాటతో రైతు కష్టాలు చెప్పిన కూరగాయలమ్మే వ్యక్తి వీడియో

Samatha J
|

Updated on: Jul 22, 2025 | 9:46 PM

Share

అన్నదాతకు అడుగడుగునా కష్టాలే.. దుక్కి దున్ని నారు పోసిన నాటి నుంచి పంట చేతికి వచ్చే వరకూ ఎన్నో కష్టాలు అవరోధాలు ఎదుర్కొంటాడు. చీడ పీడలు ఒకవైపు, అడవి పందులు, జంతువుల బెడద మరోవైపు.. ఇవన్నీ తట్టుకొని పంట చేతికొచ్చి అది మార్కెట్‌కి చేరడం ఒక ఎత్తయితే.. పంటకు సరైన గిట్టుబాటు ధర లభించడం మరో ఎత్తు.

వీటన్నిటినీ తట్టుకొని రైతు పంట పండిస్తే దళారులు రైతు కష్టాన్ని దోచుకుంటారు. అలా కాదని స్వయంగా రైతే పంటను అమ్ముకోడానికి బయలుదేరితే పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా? తన బాధను మాట రూపంలో చెబితే అర్థం కాదని.. పాట రూపంలో పాడాడు. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం పిండిప్రోలు గ్రామంలో కూరగాయలు, ఆకుకూరలు అమ్ముకునే రైతన్న ఆవేదనతో పాడిన పాట సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వినియోగదారుడికి ఒక ఆకు కూర కట్ట ధర రూ.10లు చెబితే ఆ వినియోగదారు రూ. 5 కే ఇవ్వాలని అడగడంతో తీవ్ర ఆవేదన చెందిన రైతు, వ్యవసాయంలో అతను పడిన బాధలను వర్ణిస్తూ పాడిన పాట అందరినీ ఆలోచింపజేస్తోంది. ఏం బతుకిది రాయినై పుడితే బాగుండు అంటూ ఓ రైతు పాట రూపంలో తనతో పాటు సాటి అన్నదాతలు పడుతున్న కష్టాల కన్నీటి వ్యథలను వివరిస్తున్న పాట అందరినీ ఆకట్టుకుంటోంది. తిరుమలాయపాలెం మండలం పిండిప్రోలుకు చెందిన ఆరెంపుల వెంకన్న పాడిన పాట అందరినీ ఆలోచనలో పడేసింది.

మరిన్ని వీడియోల కోసం :

ఈ కుక్కలతో జాగ్రత్త.. కరిస్తే అంతే సంగతులు వీడియో

బట్టతలనే బిల్‌బోర్డ్ గా మార్చుకున్న యువకుడు..వేలల్లో సంపాదన వీడియో

కొన్న కోడికన్నా..కొట్టుకొచ్చిన కోడి రుచి ఎక్కువంట.. అందుకే వీడియో

అనారోగ్యంతో ఆసుపత్రికి పోతే.. కాన్పు చేసిన వైద్యులు వీడియో

Published on: Jul 22, 2025 09:46 PM