అనారోగ్యంతో ఆసుపత్రికి పోతే.. కాన్పు చేసిన వైద్యులు వీడియో
ఆస్ట్రేలియాలో ఓ ఇరవయ్యేళ్ల యువతికి వింత అనుభవం ఎదురైంది. అప్పటివరకు రోజూలాగే అన్ని పనులు చేసుకున్న ఆ యువతి చిన్న సమస్యతో డాక్టరు వద్దకు వెళ్లింది. అక్కడ డాక్టర్ ఆమెకు పరీక్షలు చేసి.. ఆమె నిండు గర్భవతి అని నిర్ధారించటంతో.. ఆ యువతి షాక్‌కు గురైంది. అంతేకాదు.. ఆ తర్వాత 17 గంటల్లోనే ఆమె పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది.
తనకు ఎదురైన ఈ అనుభవాన్ని ఆ మహిళ తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకుంది. షార్లెట్ సమ్మర్స్ అనే ఆస్ట్రేలియా యువతి రెండేళ్లుగా ఓ యువకుడితో రిలేషన్‌లో ఉంది. గత కొంతకాలంగా ఆమె శరీరంలో కొన్ని మార్పులు వచ్చినా..కాస్త ఒళ్లు చేశానని అనుకొనులే.. అనుకుని సరిపెట్టుకుంది. రోజులాగే అన్ని పనులు చేసుకుంటూ వచ్చింది. కానీ, జూన్ 6న గ్లూటెన్ సెన్సిటివిటీ సమస్యతో జనరల్ చెకప్ కోసం డాక్టర్ వద్దకు వెళ్ళగా.. ఆయన గర్భధారణ పరీక్ష చేయించుకోవాలని సూచించారు. ఆ పరీక్షలో షార్లెట్ 8 నెలల గర్భవతి అని తేలింది. దీంతో షార్లెట్, ఆమె కుటుంబ సభ్యులు ఆశ్చర్యపోయారు. వెంటనే తన భాగస్వామికి ఫోన్ చేసి విషయం చెప్పింది. క్రిప్టిక్ ప్రెగ్నెన్సీ కేసులో ఇలా జరుగుతుందని వైద్యులు ఆమెకు వివరించారు.
మరిన్ని వీడియోల కోసం :
అందమైన అమ్మాయి ఫోటో దిగుతుంటే.. ఏనుగు పిల్ల ఏం చేసిందో చూడండి!
దారితప్పి తల్లికోసం తల్లడిల్లిన గున్న ఏనుగు.. తల్లిని కలిసిన తర్వాత వీడియో
ప్రొటీన్ పౌడర్‌ని ఇంట్లో తయారు చేయండి ఇలా వీడియో
ఇక రైళ్లలో చీమ చిటుక్కుమన్నా అవి కనిపెట్టేస్తాయ్ వీడియో
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
